poulomi avante poulomi avante

ఆకాశం అంచులకు భాగ్యనగరం

నగరం నలు వైపులా ఆకాశహర్మ్యాలు

ముంబయి తరువాత హైదరాబాద్ లో ఎత్తైన భవనాలు

సిటీలో గరిష్టంగా 59 అంతస్థుల భవనం

దేశంలో 8 శాతం ఆకాశహర్మ్యాలు హైదరాబాద్ లోనే

స్కైస్క్రాపర్ నిర్మాణాలకే మొగ్గుచూపుతున్న బిల్డర్లు

హైదరాబాద్ నగర రూపురేఖలు మారిపోతున్నాయి. సిటీలో వెలుస్తున్న నిర్మాణాలను చూస్తుంటే ఏ సింగపూర్ లోనో, న్యూయార్క్ లోనో ఉన్న అనుభూతి కలుగుతోంది. అవును భాగ్యనగరం నలువైపులా ఆకాశాన్ని తాకేలా భారీ నివాస, వాణిజ్య భవనాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి. దేశంలో ముంబయి తరువాత అత్యధికంగా హైరైజ్ భనవాలు ఉన్నది హైదరాబాద్ లోనేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకీ భాగ్యనగరంలో అతి ఎత్తైన భవనాలు ఏయే ప్రాంతాల్లో నిర్మాణం జరుపుకుంటున్నాయో తెలుసుకుందామా…

హైదరాబాద్ నిర్మాణరంగంలో తనదైన మార్కును చూపుతోంది. మరీ ముఖ్యంగా గత ఐదారేళ్లుగా నగర నిర్మాణరంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నిర్మాణపరంగా సిటీ రూపురేఖలు మార్చే పలు భారీ ప్రాజెక్ట్‌లు నగరం నలువైపులా వస్తున్నాయి. గతంలో కనీసం పది ప్లోర్స్ భవనాలు కూడా లేని ప్రాంతాల్లో ఇప్పుడు 25 అంతకు మించి అంతస్తుల నిర్మాణాలు వస్తున్నాయి.

ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కనీసం 25 నుంచి 40 అంతస్థుల నివాస, వాణిజ్య భవనాలే నిర్మాణం అవుతున్నాయి. నగరంలో గరిష్ఠంగా 58 అంతస్తుల వరకు భారీ స్కైస్క్రాపర్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు అనుమతులు పొంది పనులు ప్రారంభించగా, మరికొన్ని నిర్మాణ సంస్థలు అనుమతులు పొందే దశలో ఉన్నాయి.

దేశంలో ముంబయి తరువాత మన హైదరాబాద్ లోనే అత్యధికంగా స్కై స్క్రాపర్స్ ఉన్నాయని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలు అత్యధికంగా ఉన్న నగర జాబితాలో హాంకాంగ్‌ మొదటి స్థానంలో నిలవగా, షెన్‌ఝెన్‌, న్యూయార్క్‌, దుబాయ్‌ ఇలా అనేక నగరాలు జాబితాలో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మన దేశానికి సంబంధించి మొదటి స్థానంలో ముంబై ఉండగా, ఆ తరువాత రెండవ స్థానంలో హైదరాబాద్ ఉంది.

దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎత్తయిన భవనాల్లో సుమారు 77 శాతం ఎత్తయిన భవనాలు ముంబైలో ఉండగా, తర్వాత స్థానంలో ఎనిమిది శాతం భవనాలు హైదరాబాద్‌ లో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ముంబయి, హైదరాబాద్ తరువాత ఎత్తైన భవనాలు ఏడు శాతం కోల్‌ కత్తా, ఐదు శాతం నోయిడాలో ఉండగా, ఒక్క శాతం చొప్పున గుర్గావ్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో సౌత్ ఇండియాలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా బెంగళూరు, చెన్నై వంటి నగరాలు దరిదాపుల్లో కూడా లేవు.

హైదరాబాద్ లో ఎక్కువగా వెస్ట్ ప్రాంతంలోనే ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు. కనీసం 25 ఫ్లోర్స్ నుంచి మొదలు 45 అంతస్తుల వరకు నివాస, వాణిజ్య భవనాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి. వెస్ట్ హైదరాబాద్ లోని కోకాపేట్, శేరిలింగంపల్లి, ఖాజాగూడ, పుప్పాలగూడ, మియాపూర్, నార్సింగి వంటి ప్రాంతాల్లో 30కి పైగానే ఈ తరహా భారీ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్, ఎల్బీనగర్, బాచుపల్లి, పటాన్ చెరు వంటి ప్రాంతాల్లోను భారీ నివాస భవనాలు వెలుస్తున్నాయి.

హైదరాబాద్‌ దక్షిణ ప్రాంతంగా చెప్పే అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ వైపు ఆకాశహర్మ్యాల నిర్మాణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నగరంలో అతి ఎత్తయిన భవనం 58 అంతస్తులు 236 మీటర్ల ఎత్తులో కోకాపేటలో నిర్మాణ దశలో ఉంది. ఇది కాక 57 అంతస్తులు 200 మీటర్లలో మరొకటి, 55 అంతస్తులు 204 మీటర్లలో రెండు, 54 అంతస్తులు 214 మీటర్ల ఎత్తులో మరో రెండు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

ఇక ఇప్పటికే నగరంలో 45 అంతస్తుల మేర మూడు, 42 అంతస్తుల ఎత్తున మరో మూడు స్కై స్క్రాపర్స్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. 25 అంతస్తులు మొదలు 36 అంతస్తులు వరకు ఎత్తులో సుమారు 57 భవనాల ఇప్పటికే నగరంలో నిర్మాణమై అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణ దశలో ఇలాంటి భవనాలు మరో 50కి పైగానే ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.

ఇక హైదరాబాద్ లో 59 అంతస్తులు అంటే 235 మీటర్ల భారీ భవన నిర్మాణం కోసం ప్రతిపాదన ఉండగా, 40 నుంచి 55 అంతస్తుల కోసం దాదాపు 30కి పైగా నిర్మాణ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. టీఎస్‌ బీపాస్‌ లో ఇప్పటి వరకు 80 ఆకాశహర్మ్యాలు అనుమతులు పొందాయి. వీటిలో 60 అపార్ట్‌ మెంట్లు, 22 వరకు వాణిజ్య భవనాలు ఉన్నాయి. ఇలా అనుమతి పొందిన గృహ నిర్మాణాల్లో 14 ప్రాజెక్ట్‌లు 30 నుంచి 45 అంతస్తులపైన నిర్మించబోతున్నవేనని లెక్కలు చెబుతున్నాయి.

హైదరాబాద్ లో నిర్మాణం అవుతున్న భారీ భవనాలు ఆయా ప్రాంతాలకు ల్యాండ్‌మార్క్‌గా నిలవనున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న ఇంటువంటి భారీ ప్రాజెక్టుల్లో ఇంటి కొనుగోలుతో సమాజంలో తమ స్టేటస్ పెరుగుతుందని, అలాంటి భవనాల్లో నివాసం ఉంటే అందరిలోను ప్రత్యేకతను చాటుకోవచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే చాలా మంది బిల్డర్లు ఆకాశహర్మ్యాల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా పెరిగిన భూముల ధరలు, స్థల యజమానులతో డెవలప్‌మెంట్‌ ఒప్పందాల కారణంగా కూడా ఎక్కువ అంతస్తులు నిర్మిస్తే తప్ప ఆర్థికంగా ప్రాజెక్ట్‌ లాభసాటి కాదని నిర్మాణసంస్థలు చెబుతున్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles