poulomi avante poulomi avante

శంషాబాద్ వైపు రియల్ పరుగులు

రవాణా, మౌలిక వసతుల్లో శంషాబాద్ నెంబ‌ర్ వ‌న్‌

మధ్యతరగతి వారి చూపంతా శంషాబాద్ వైపే

50 లక్షల్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్

నివాస ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ శంషాబాద్

ఓవైపు బెంగళూరు జాతీయ రహదారి.. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇంకో వైపు ఐటీ హబ్.. ఇక ఇప్పుడు ప్యూచర్ సిటీ.. ఓ ప్రాంత అభివృద్దికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అవును రియల్ రంగ భవిష్యత్తు అంతా ఇక శంషాబాద్ దే అంటున్నారు రియాల్టీ నిపుణులు. త్రిపుల్ వన్ జీఓ ఉపసంహరణతో రానున్నో రోజుల్లో శంషాబాద్ భారీ నివాస, కార్యాలయ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారనుందని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గ్రేటర్ సిటీ నలువైపులా భారీ నివాస, కార్యాలయ భవన ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో వందల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఐతే హైదరాబాద్ లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమం వైపు నిర్మాణ‌ రంగం జోరు మీదుంది. ఇందుకు ఐటీ రంగమే కారణమని చెప్పవచ్చు. ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ పశ్చిమానికి శంషాబాద్ పోటీ కానుంద‌ని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భవిష్యత్తు రియల్ ఎస్టేట్ అంతా శంషాబాద్ దేనని చెబుతున్నారు. అందుకు అనుగునంగా శంషాబాద్ తో పాటు సమీప ప్రాంతాల్లో జోరుగా నివాస, వాణిజ్య రియల్ ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి.

హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న ప్రాంతాల్లో ఒకటైన శంషాబాద్ కు అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. ప్రధానంగా శంషాబాద్ ను ఆనుకుని అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం బాగా కలిసొస్తుంది. అంతేకాదు శంషాబాద్ మీదుగానే ఔటర్ రింగ్ రోడ్డు వెళుతోంది. ఇంక హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పైనే శంషాబాద్ ఉండటం మరో ప్లస్ పాయింట్. శంషాబాద్ కు కేవలం 15 నిమిషాల వ్యవధిలో వెళ్లేంత చేరువ‌లో శ్రీశైలం రహదారి ఉంది. ఇక హైదరాబాద్ ఐటీ హబ్ శంషాబాద్ కు కూతవేటు దూరంలోనే ఉంది. శంషాబాద్ కు కాస్త దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు రానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ సైతం శంషాబాద్ కు సమీపంలోనే ఉంటుంది. మరి ఓ ప్రాంతం అభివృద్ది చెందాలంటే ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఇక శంషాబాద్ మునిసిపాలిటీగా ఏర్పడటంతో అన్నీ మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి.

హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఉద్యోగులు, మధ్య తరగతి వాళ్లు శంషాబాద్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఐటీ హబ్ హైటెక్ సిటీ, గచ్చిబౌళి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు శంషాబాద్ సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ ఉండటం వంటివి ఇటువైపు ఆకర్షిస్తున్నాయి. ఐటీ హబ్ కు సమీపంలో ఇళ్లు కొనాలంటే కోటి రూపాయలు ఆ పైన ఖర్చు చేయాల్సిందే. అదే శంషాబాద్ లో పరిసర ప్రాంతాల్లో ఐతే డబుల్ బెడ్రూం ఫ్లాట్ 50 లక్షల రూపాయల నుంచి దొరుకుతుంది. శంషాబాద్ దాటి మరికాస్త ముందుకు కొత్తూరు సమీపంలో ఐతే 40 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలా మంది ఐటీ ఉద్యోగులతో పాటు సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్న మధ్యతరగతి వారు శంషాబాద్ వైపు చూస్తున్నారు.

ఇప్పుడిప్పుడే శంషాబాద్ వైపు నివాస ప్రాజెక్టులు మొదలవుతున్నాయి. మొన్న శంషాబాద్ సమీపంలోని బుద్వేల్ లో హెచ్ఎండీఏ భూముల వేలంతో రియల్ ఎస్టేట్ స్పీడందుకుంది. ఇక్కడ ప్రస్తుతం 25 వరకు అపార్ట్ మెంట్స్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీఓ ఉపసంహరించుకున్న నేపధ్యంలో త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను మొదలుపెట్టేందుకు నిర్మాణరంగ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు 4 వేల నుంచి 8 వేల వరకు ధర పలుకుతుండగా, విల్లా ఐతే రెండు కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల వరకు ధరలు ఉన్నాయి. మెల్ల మెల్లగా శంషాబాద్ పరిసరాల్లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. అందుకే అవకాశం మేరకు శంషాబాద్ వైపు నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న వారు ఓ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

శంషాబాద్ లో నిర్మాణంలో ఉన్న కొన్ని నివాస ప్రాజెక్టులను పరిశీలిస్తే.. త్రిషల ఇన్ప్రాస్ట్రక్చర్ సంస్థ నిర్మిస్తున్న త్రిషల త్రిలోక్ అపార్ట్ మెంట్ ప్రాజెక్టులో త్రిపుల్, ఫోర్ బెడ్రూం ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 2200 చదరపు అడుగుల నుంచి 4150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్స్ ధరలు 1.4 కోట్ల నుంచి 2.8 కోట్ల మధ్య ఉన్నాయి. శంషాబాద్ సమీపంలోని సాతంరాయిలో సుచిరిండియా కన్స్టక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్న సుచిరిండియా ది టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్టులో డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 800 నుంచి 945 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్స్ ధరలు 46 లక్షల నుంచి 54 లక్షల మధ్య ఉన్నాయి. శంషాబాద్ సమీపంలోని బుద్వేల్ లో ప్రెస్టీజ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ప్రెస్టీజ్ స్మార్ట్ సిటీలో 1528 చదరపు అడుగుల నుంచి 3334 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2.5, 3, 4 బెడ్రూం ఫ్లాట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్లాట్స్ ధరలు 1.1 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల మధ్య ఉన్నాయి.

శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లిలో సుమధుర ఇన్ఫ్రాకాన్ నిర్మిస్తున్న సుమధుర గార్డెన్స్ బై ది బ్రూక్ ప్రాజెక్టులో 1285 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ 95 లక్షల రూపాయల్లో అందుబాటులో ఉన్నాయి. మామిడిపల్లి సమీపంలో జల్సా డెవలపర్స్ అభివృద్ది చేస్తున్న జల్సా రిజెన్సీలో 1885 చదరపు అడుగుల నుంచి 4294 చదరపు అడుగుల మధ్య విస్తీర్ణంలో ఫ్లాట్స్ నిర్మాణం జరుగుతోంది. ట్రిపుల్, ఫోర్ బెడ్రూం ఫ్లాట్స్ 56 లక్షల నుంచి 1.29 కోట్ల రూపాయల మధ్య ధరలున్నాయి. ఇక శంషాబాద్ లో కసాగ్రాండ్ బిల్డర్స్ నిర్మిస్తున్న కసా గ్రాండ్ హ్యాన్ ఫోర్డ్ విల్లా ప్రాజెక్టులో 2800 చదరపు అడుగుల విస్తీర్ణంలో విల్లాల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో విల్లా 2.9 కోట్ల రూపాయల్లో అందుబాటులో ఉంది. ఇలా శంషాబాద్ లో ప్రాజెక్టును బట్టి ఫ్లాట్స్, విల్లాలతో పాటు ఇండిపెండెంట్ ఇళ్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఎవరి బడ్జెట్ ను బట్టి వాళ్లు తమ డ్రీమ్ హోమ్ ను ఎంపిక చేసుకోవచ్చు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles