poulomi avante poulomi avante

ఇంటీరియ‌ర్స్ ఖ‌ర్చుకు త‌గ్గేదేలె..

ఇంటీరియర్ డిజైన్ కు పెరుగుతున్న డిమాండ్
ఇండీరియర్ డిజైన్ పై యజమానుల ఆసక్తి
ఇంటి ధరకు సమానంగా ఇంటీరియర్స్ కోసం ఖర్చు
నిర్మాణరంగానికి ధీటుగా ఇంటీరియర్ రంగం

ఇంటిని చూసి ఇల్లాలును చూడాలనేది పాత సామెత. ఇప్పుడు ఇంట్లో ఇంటీరియర్ చూసి ఇల్లాలను చూడాలనేది కొత్త సామెత. అవును కోట్ల రూపాయలు పెట్టి ఇంటిని కొనుగోలుచేసినా.. ఆ ఇంటిని అందంగా తీర్చి దిద్దేందుకు మళ్లీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎంతలా మారిపోయిందంటే.. ఇంటి కొనుగోలుకు పెట్టే స్థాయిలో ఇంటీరియల్ కోసం వెచ్చిస్తున్నారు. దీంతో ఇప్పుడు నిర్మాణరంగానికి సమాంతరంగా హైదరాబాద్ లో ఇంటీరియర్ వ్యాపారం జరుగుతోంది.

ఇల్లు ఎన్ని కోట్లు పెట్టి కొన్నా.. అది అందంగా లేకపోతే ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. ఇంటికి అందం ఇంటీరియర్‌ డెకరేషన్‌. ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఓ కల. ఆ ఇంటిని తమకు నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకునే వారు, లేదంటే ఇల్లు కొనుక్కునే వాళ్లు అందరిని ఆకట్టుకునేలా ఉండేలా డిజైన్‌ చేయించుకుంటారు. ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై దృష్టి సారిస్తున్నారు.

ఇంటీరియల్ డిజైన్ కోసం కోట్లలో డబ్బు ఖర్చు అవుతున్నా వెనకాడడం లేదు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఎంత డబ్బైనా ఖర్చు చేస్తున్నారు యజమానులు. దీంతో ఇంటి నిర్మాణం ఒక ఎత్తైతే.. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దే క్రమంలో ఇంటీరియర్ డిజైన్ మరో ఎత్తవుతోంది. నిర్మాణరంగానికి సమాంతరంగా ఇంటీరియర్ రంగం ఎదుగుతూవస్తోందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

గతంలో చాలామంది కొత్త ఇళ్లు నిర్మించుకునే వారు ఎక్స్‌టీరియర్‌ పై ఆసక్తి చూపేవారు. ఇళ్లను కొనుగోలు చేస్తున్న వారు ఇంటీరియర్‌ డిజైన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇంటీరియర్ డిజైన్‌ లకు చాలా డిమాండ్‌ పెరిగింది. ఇంటి యజమానుల అభిరుచికి తగ్గట్లు విభిన్నంగా ఇంటీరియర్‌ డిజైన్ చేస్తున్నారు అందుకు సంబందించిన నిపుణులు, ఇంటీరియర్ డిజైన్ సంస్థలు. దీనికి అనుగుణంగా హైదరాబాద్ తో పాటు చిన్ని చిన్న పట్టణాల్లోను వివిధ రకాల ఇంటీరియర్‌ డిజైన్లతో నయా ట్రెండ్‌ కొనసాగుతుంది.

ప్రతిఒక్కరూ వారి వారి స్థాయికి తగ్గట్టు ఇంటీరియర్‌ డిజైన్, సీలింగ్‌ను ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ తో ఆకట్టుకునేలా ఇంటిని తీర్చిదిద్దుతున్నారు. గతంలో స్టార్‌ హోటళ్లు, కార్పోరేట్ కార్యాలయాలకు మాత్రమే పరిమితమయ్యే ఇంటీరియర్ డిజైన్లు ప్రస్తుతం ప్రతి ఇంటి నిర్మాణాలకు వ్యాపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ పై దృష్టి పెడుతున్నారు. అందు కోసం లక్షల నుంచి మొదలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధ రకాల డిజైన్లతో సీలింగ్‌లను, ఇతర డిజైన్లను ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో దగ్గర ఉండి పనులు చేయించుకుంటున్నారు యజమానులు. ఇంటీరియర్ డిజైన్ కోసం ఆ రంగంలో వేలాది మంది నిపుణులు అందుబాటులోకి వచ్చారు. అంతే కాకుండా ఇండీరియర్ డిజైన్ కోసం హైదరాబాద్ లో వందలాది సంస్థలు వెలిసాయి. ప్రత్యేకంగా పీవోపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్‌ పేయింట్స్, టెక్షర్‌ వాల్‌ పేపర్లు, ఫర్నిచర్, ఉడ్‌ వర్క్‌పై లామినేట్స్‌తో కంటికి అందంగా ఉండేలా తీర్చిదిద్దుకుంటున్నారు.

మరో వైపు ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా ఇంటి ఫ్లోర్ పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వుడ్ ఫ్లోర్ నుంచి మొదలు గ్లాస్ ఫ్లోర్ వరకు ఎన్నో మ్యాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా ఇంటి డెకరేటివ్ ఐటమ్స్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇప్పుడు చిన్న ఇల్లు నుంచి మొదలు పెద్ద ఇంటి వరకు అంటే బడ్జెట్ పరంగా మధ్య తరగతి ఇంటి యజమానుల నుంచి మొదలు ఖరీదైన ఇంటి యజమానుల వరకు అందరూ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో నిర్మాణరంగానికి సమానంగా ఇంటీరియల్ డిజైన్ రంగం ఎదుగుతూ వస్తోంది. ఎందుకంటే ఇంటికొనుగోలు ఖర్చులో 20 నుంచి 80 శాతం ఇంటీరియర్ డిజైన్ కోసం ఖర్చు చేస్తున్నారు.

అంటే కోటి రూపాయలు పెట్టి ఇంటిని కొనుగోలు చేస్తే 20 నుంచి 30 లక్షల వరకు ఇంటీరియర్ డిజైన్ కోసం వెచ్చిస్తున్నారు. ఇక ఖరీదైన ఇంటి యజమానులు 5 కోట్లు పెట్టి ఇంటిని కొనుగోలు చేస్తే 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఇంటిని అందంగా తీర్చి దిద్దే ఇంటీరియర్స్ కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంటీరియర్ డిజైన్‌లను బట్టి మెటీరియల్, లేబర్‌ చార్జితో స్క్వేర్‌ ఫీట్‌ కు 1,000 నుంచి 6000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక ఖరీదైన అపార్ట్ మెంట్స్, విల్లాల్లో ఐతే ఇంటీరియర్స్ కోసం ప్రత్యేకంగా నిపుణులను ఎంగేజ్ చేసుకుని వారికి లక్షల్లో చెల్లిస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles