poulomi avante poulomi avante

ఆకాశహర్మ్యాల్లో అగ్నిప్రమాదం జరిగితే ప్రాణాలు ద‌క్కుతాయా?

స్కై స్క్రాపర్స్ లిఫ్టుల్లో ప్రయాణం సురక్షితమేనా?

ఎత్తైన భవనాల్లో ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులు

ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్లుల‌ను పెట్టాలి..

హైదరాబాద్ మహా నగరంలో ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలే కనిపిస్తున్నాయి. నిర్మాణరంగ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశాన్ని తాకేలా స్కైస్క్రాపర్స్ ను నిర్మిస్తున్నాయి. ఐతే భారీ నిర్మాణాల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు సురక్షితంగా క్రిందకు దిగే ఫైర్‌ ఎవాక్యుయేషన్‌ లిఫ్టులు ఉండాలంటున్నారు నిపుణులు. ఈ మేరకు ఆకాశహర్మ్యాలలో ఫైర్ లిఫ్టులు ఏర్పాటుచేసేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని సూచిస్తున్నారు.

దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఆకాశహార్మ్యాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. కనీసం 10 అంతస్తుల నుంచి మొదలుకొని గరిష్టంగా 50 అంతస్తులు ఆ పైవరకు ఎత్తైన భవనాలను నిర్మిస్తున్నారు. అందులో ఎక్కువగా 25 అంతస్తుల నుంచి 45 అంతస్తులవరకు స్కైస్క్రాపర్స్ నిర్మాణం అవుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎన్ని అంతస్తులు కట్టినా, క్షణాల్లో పై అంతస్తులకు వెళ్లేందుకు అత్యాధునిక లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలాంటి భారీ అంతస్తుల భవనాల్లో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితు ఏంటన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

అగ్నిప్రమాద సమయంలో సాధారణంగా లిఫ్ట్‌లు వినియోగించవద్దని నిపుణులు చెబుతుంటారు. ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మెట్ల మార్గంలోనే వెళ్లాలని సూచిస్తుంటారు. మరి ఆ సమయంలో అన్ని అంతస్తుల నుంచి మెట్లపై నుంచి క్రిందకు వచ్చే సరికి చాలా సమయం పడుతుంది. పైగా అగ్నిప్రమాదం జరిగినప్పుడు అలా క్రిందకు దిగడం కూడా కష్టమే.

ఈ యేడాది జనవరిలో ముంబయి శివారులోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోరేగావ్‌ లోని 27 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగడం స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అన్‌మోల్‌ ప్రైడ్‌ భవనంలో 27 అంతస్తులు ఉండగా.. 25, 26వ అంతస్తుల్లో సాయంత్రం మంటలు చెలరేగాయి.

అతి కష్టం మీద భవనంలో ఉన్న వారిని క్రిందకు తీసుకువచ్చారు. ఐనప్పటికీ చాలా మంది గాయపడ్డారు. ఇక్కడే కాదు దేశంలోని చాలా మెట్రో నగరాల్లోని ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతోంది. భారీ భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పై అంతస్తుల్లో ఉన్న వారిని వేగంగా క్రిందకు తీసుకువచ్చే ప్రత్యేక వ్యవస్థ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ వంటి నగరాల్లో 52 మీటర్ల ఎత్తు వరకే చేరుకోగల అగ్నిమాపక స్కై క్రేన్లు మాత్రమే ఉన్నాయ‌ని సమాచారం. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు పై అంతస్తుల్లో ఉన్నవారిని కాపాడటం కష్టమవుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మరి, భారీ అంతస్తులున్న భవనంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి, మంటలు వ్యాపించక ముందే బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం ఫైర్‌ ఎవాక్యుయేషన్‌ లిఫ్ట్‌. ఔను.. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సైతం క్షేమంగా, అత్యంత వేగంగా పై అంతస్తుల నుంచి క్రిందకు దిగేందుకు భవనాల్లో ప్రత్యేక లిఫ్ట్‌లు ఉండాలని నిపుణులు అంటున్నారు.

ఫైర్‌ ఎవాక్యుయేషన్‌ లిఫ్టులు మంటల్ని తట్టుకుంటాయి. కనీసంగా రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మంటలను తట్టుకుని, వేగంగా పై అంతస్తుల వారిని క్రిందకు తీసుకువచ్చే విధంగా ఈ లిఫ్టులను తయారు చేస్తారు. అవి 2 నుంచి 4 గంటల వరకు అగ్నిని తట్టుకోగల ఫైర్ ప్రూఫ్ ప్యానెల్స్‌తో తయారు చేస్తారు.

అగ్ని ప్రమాదం సమయంలో ఈ అత్యాధునిక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులు పనిచేస్తాయడానికి ప్రత్యమ్నాయ విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేస్తారు. అందుకని ఫైర్ యాక్సిడెంట్ జరిగినా విద్యుత్ అంతరాయం లేకుండా ఈ లిఫ్టులు ఆ సమయంలోను పనిచేస్తాయి. ఇక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులకు ప్రత్యేకమైన వెంటిలేషన్ ఏర్పాట్లు ఉంటాయి.

దీనివల్ల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దట్టమైన పొగ అలముకున్నా ఈ లిఫ్టుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించి క్రిందకు దిగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భారీ అంతస్తులున్న భవనాల్లో ఇలాంటి ఫైర్ లిప్టులను ఏర్పాటు చేస్తే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సులభంగా భవనంలో ఉన్నవారు ప్రమాదం బారిన పడకుండా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మిగతా సాధారణ లిఫ్టులతో పోలిస్తే ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టుల ధర కొంత ఎక్కువే అయినా అగ్ని ప్రమాదాలను, నివాస, వాణిజ్య భవనాల్లో నివసిస్తున్న వారి భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 22 అంతస్తులు దాటిన భారీ భవనాల్లో ఫైర్‌ ఎవాక్యుయేషన్‌ లిఫ్ట్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిబంధన తీసుకువచ్చింది. మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం 20 అంతస్తులకు మించి నిర్మించే భవనాల్లో తప్పనిసరిగా ఫైర్‌ ఎవాక్యుయేషన్‌ లిఫ్టులు ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని రియల్ రంగ నిపుణులు కోరుతున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles