poulomi avante poulomi avante

హైడ్రా.. ఎలా బలోపేతం?

హైడ్రాపై ఆర్డినెన్స్ కు ప్రభుత్వ కసరత్తు

హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు సర్వం సిద్దం

పలు శాఖల అధికారాలు హైడ్రాకు బదిలీ

న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వకుండా జాగ్రత్తలు

హైడ్రా ఏర్పాటైన మొదటి రోజు నుంచే అక్ర‌మ నిర్మాణాల‌పై దూకుడుగా ముందుకు వెళుతోంది. నగరంలోని కబ్జాలపై, చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో కట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా సైతం అంతే వేగంగా చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై కొరడా ఝుళిపిస్తోంది.హైదరాబాద్ పరిసరాల్లోని చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను శరవేగంగా కూల్చివేస్తూ వస్తోంది. సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సహా పలు కబ్జాలను నేలమట్టం చేసింది హైడ్రా.

ఇంతవరకూ బాగానే ఉన్నా హైడ్రాకు చట్టబద్ధత లేదని, దాని చర్యలు సమర్ధనీయం కావంటూ కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు ముందు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రా ను ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియట్, లా కమిషన్, ఏసీబీ మరియు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ల వంటి కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ హైడ్రాకు చట్టబద్దతి లేకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి.

ఇప్పటివరకు చెరువులను ఆక్రమించినవారికి, నిబంధనలను ఉల్లంఘించిన వారికి జీహెచ్ఎంసీ, నీటిపారుదల, రెవెన్యూ మరియు పట్టణ స్థానిక సంస్థల వంటి అనుబంధ విభాగాల ద్వారా మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నారు. నేరుగా హైడ్రా నోటీసులు జారీ చేసే అధికారం లేదు. అందుకే హైడ్రాకు చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకు రావడానికి కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టం, నీటిపారుదల చట్టం మరియు వాల్టా చట్టం వంటి వివిధ చట్టాలకు సంబంధించి హైడ్రాను అమలు చేసే అధికారంగా మార్చడానికి ప్రత్యేక అధికారాలను కల్పించేందుకు రంగం సిద్దమైంది.

హైడ్రాకు చట్ట బద్దత కల్పించే క్రమంలో తెచ్చే ఆర్డినెన్స్ కోసం తెలంగాణ భూ ఆక్రమణ చట్టం – 1905కు సవరణ చేసి నూతన చట్టాన్ని తీసుకురానున్నది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణ చట్టంలోని 1ఏ, 7ఏ సెక్షన్లను సవరించి.. అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడం ప్రస్తుతానికి వీలు కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905 ఆర్డినెన్స్‌-2024 తీసుకు రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక, జీహెచ్‌ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్‌ సర్వీసెస్‌ తదితర శాఖలకు ఉన్న అధికారాలను చట్టం ద్వారా, కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా ఉన్న అధికారాలను తాజాగా తెచ్చే ఆర్డినెన్స్‌ ద్వారా హైడ్రాకు అప్పగించనుంది.

ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించినవి హైడ్రా పరిధిలో ఉన్నాయి. హైడ్రాకు ఈ అధికారాలు అప్పగించకపోతే ఆ సంస్థ లక్ష్యం మేరకు పని చేయడం వీలు పడదు. దీంతో అనివార్యంగా వివిధ శాఖలకు చట్టపరంగా దఖలు పడిన కొన్ని అధికారాలను తొలగించి హైడ్రాకు బదిలీ చేసేలా చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.హైడ్రాకు విశేషాధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ ద్వారా తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905కు చేయనున్న చట్ట సవరణలో ఇప్పటికే వివిధ శాఖలకు ఉన్న అధికారాలు హైడ్రాకు వెళ్లనున్నాయి.

తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905 లో సెక్షన్లు 3, 6, 7, 7ఏ క్రింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్‌కు ఉన్న అధికారాలను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు బదిలీ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. వాల్టా చట్టం-2002, జీవోఎంఎస్‌-168 ప్రకారం తెలంగాణ బిల్డింగ్స్‌ రూల్స్, తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ యాక్ట్‌-1999లో ఇందుకు సంబంధించిన అధికారాలు తొలగించి హైడ్రాకు బదిలీ చేసే ప్రతిపాదన న్యాయవిభాగం పరిశీలనలకు పంపించగా, తెలంగాణ పురపాలక చట్టం-2019, బీపాస్‌ చట్టం-2020, హెచ్‌ఎండీఏ చట్టం-2008, వాల్టా చట్టం-2002లోని అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించడంతో పాటు హైడ్రా గవర్నింగ్‌ బాడీలో సీసీఎల్‌ఏ ఉండాలని, మిగిలిన చట్టాల్లో కొన్ని నిబంధనల్లో మార్పులు చేయాలని న్యాయవిభాగం సూచించినట్లు సమాచారం.

దీనిపై రెవెన్యూ, పురపాలక శాఖల మధ్య సుధీర్గ చర్చలు జరిగిన తరువాత తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905కు సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా అవసరమైన అధికారాలన్నీ కట్టబెట్టిన తరువాత ఆక్రమణదారులకు నేరుగా నోటీసులివ్వడం నుంచి కూల్చివేతలు, కబ్జా చేసిన స్థలాల స్వాదీనం వరకు హైడ్రా కు అడ్డంకులు లేకుండా ఉంటుంది. అంతే కాకుండా కోర్టుల్లో కేసులు వేసినా చట్టబద్దత ఉంటుంది కాబట్టి పెద్దగా చిక్కులు రావని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles