బెస్ట్ ప్రాజెక్ట్‌లతో కేవలం హైద్రాబాద్‌లోనే కాదు టోటల్ సౌతిండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కన్‌స్ట్రక్షన్ కంపెనీగా గుర్తింపు పొందింది వాసవీ గ్రూప్. థింక్ హైద్రాబాద్- థింక్ వాసవీ గ్రూప్ అని ట్యాగ్ లైన్ పెట్టుకోవడమే కాదు.. అందుకు తగ్గట్టే నిర్మాణ రంగంలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తుంది ఈ సంస్థ. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లకు ఫస్ట్ ఛాయిస్‌గా ఉంది వాసవీ గ్రూప్. ఇప్పటికే రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, ఐటీ స్పేస్‌లో ఎన్నో ప్రాజెక్ట్‌లను డెవలప్ చేసిన వాసవీ- అదే జోష్ కంటిన్యూ చేస్తూ త్వరలో మరిన్ని న్యూ ప్రాజెక్ట్‌లతో ముందుకు రాబోతుంది. మరి వాసవీ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులేమిటో.. అవి ఎక్కడెక్కడ లోకేట్ అయి ఉన్నాయి? వాటి స్పెషాలిటీస్ ఏమిటి?
రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్ధాలుగా సేవలు అందిస్తున్న వాసవీ గ్రూప్- హైద్రాబాద్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్‌స్ట్రక్షన్ కంపెనీగా గుర్తింపు పొందింది. అందుకే వాసవీ గ్రూప్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే.. ఆ నిర్మాణం ఎంత క్లాసీగా ఉంటుందా.. అందులో వరల్డ్‌క్లాస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందా.. అని కస్టమర్లు ఎదురు చూస్తుంటారు. సదుపాయాల విషయంలో ఇప్పటివరకు డిజప్పాయింట్ చేయని వాసవి గ్రూప్.. త్వరలో కంప్లీట్ కానున్న ప్రాజెక్ట్స్ కూడా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయంటుంది.
ఆనందాన్ని పంచే
అద్భుత గృహాలు..
హైద్రాబాద్ డెవలప్‌మెంట్ మ్యాటర్‌లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్‌తో సై అంటోంది ఈస్ట్‌సైడ్. అలాంటి తూర్పు హైద్రాబాద్‌కి తమ ఆనంద నిలయం ప్రాజెక్ట్‌తో కొంగొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవీ గ్రూప్. ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్‌కు ఎగ్జాట్ ఆపొజిట్‌లో ఉంటుంది వాసవీ ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 3 వేల 576 ఫ్లాట్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం 72 శాతం ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మిస్తున్న ఈ సెన్సేషనల్ మెగా ప్రాజెక్ట్ దక్షిణభారతంలోనే అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో.. సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై ఎండ్ వరల్డ్ క్లాస్ ఎమెనిటీస్‌ని వాసవీ గ్రూప్ అందుబాటులోకి తేనుంది.
వాసవీ ఆనంద నిలయంలో ఒక్కో టవర్‌లో థర్టీ త్రీ ఫ్లోర్స్‌తో మొత్తం 11 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిల్లో టూ బీహెచ్‌కే, త్రీ బీహెచ్‌కే, ఫోర్ బీహెచ్‌కే లతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని సైతం డిజైన్ చేశారు. 32-33 అంతస్థుల్లో టాప్‌లో ఉండే ఈ స్కై విల్లాస్‌ని చూస్తే వావ్ అంటూ థ్రిల్ అయిపోవాల్సిందే. అన్ని రకాల వసతులతో ఎలాంటి ఢోకా లేకుండా కంఫర్ట్‌బుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి.. వితౌట్ సెకండ్ థాట్ ఆనంద నిలయంలోని స్కై విల్లాస్ బెస్ట్ ఆప్షన్. ఇక లక్షా 31 వేల చదరపు అడుగుల్లో డిజైన్ చేసిన రెండు క్లబ్ హౌస్‌లు ఎవ్రీథింగ్ స్పెషల్ అనేలా ఉంటాయ్. లాప్ అండ్ రిక్రేయేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవీలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, ఔట్ డోర్ డైనింగ్ స్పేస్ ఇలా ఇంకెన్నో సదుపాయాలతో రెసిడెంట్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఇక్కడ.
వావ్‌మనిపించే
వాసవి స్కైలా..
ఏదో ఒక అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ కొనేశాం- మాకంటూ సొంత ప్రాపర్టీ ఉందని చెప్పుకునే రోజులు పోయాయ్. ఇల్లంటే ఇటు లగ్జరీగానూ.. అటు కంఫర్ట్‌గానూ ఉండాలి. మరి ఈ రెండింటిని మిక్స్ చేసి కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టు అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తే అన్న ఆలోచనను ఆచరణలో చూపించింది వాసవీ గ్రూప్. మనం మెచ్చిన.. మనసుకు నచ్చిన అపార్ట్‌మెంట్స్‌కు రియల్ పిక్చరే వాసవీ స్కైలా. హైద్రాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్- హైటెక్ సిటీ సమీపంలో ఉంది స్కైలా.
6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం యూనిట్స్ సంఖ్య 685. వీటిని 5 టవర్లలో నిర్మిస్తుండగా.. ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్థులున్నాయ్. వాసవీ గ్రూప్ నిర్మిస్తోన్న మిగిలిన ప్రాజెక్ట్‌లతో పొల్చితే స్కైలా కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. రీజన్ ఇక్కడ ట్రిపుల్ బెడ్‌రూమ్, ఫోర్ బీహెచ్‌కేతో పాటు ఫైవ్ బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో ఉన్న అపార్ట్‌మెంట్స్ ఉన్నాయ్. అంతేనా 50 వేల స్క్వేర్ ఫీట్ స్పేషియస్ వైశాల్యంలో ఉన్న క్లబ్ హౌస్- జిమ్, స్విమ్మింగ్‌పూల్, వాకర్స్, జాగర్స్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యోగా- మెడిటేషన్ రూమ్స్, రూఫ్‌టాప్ కెఫే, సూపర్ మార్కెట్, షటిల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ రూమ్, క్రికెట్ నెట్స్ ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయ్.
70 శాతం ఓపెన్ స్పేస్. అద్భుతమైన ఇంటీరియర్స్.. ఆశ్చర్యపర్చే ఆర్కిటెక్చర్. విలాసం- సౌకర్యం ఇలా ఒకదానితో ఒకటి కలగలసి చూడగానే కళ్లు మిరుమిట్లుగొల్పే వండర్ వాసవీ అట్లాంటిస్. నార్సింగి దగ్గర ఠీవీగా దర్పంగా ఉన్నట్లుంటుంది వాసవీ అట్లాంటిస్ ప్రాజెక్ట్‌ను చూడగానే. ఈ గేటెడ్ కమ్యూనిటీ 12.24 ఎకరాల్లో ఉంది. 8 కమ్యూనిటీలున్న అట్లాంటిస్‌లో ఒక్కో టవర్‌లో 45 ఫ్లోర్లు ఉండగా.. మొత్తం 2 వేల 199 యూనిట్స్ ఉన్నాయ్. వీటిల్లో టూ బీహెచ్‌కే, త్రీ బీహెచ్‌కే, ఫోర్ బీహెచ్‌కే ఇలా ఎవరి బడ్జెట్‌కు తగ్గట్టు వారు తమకు కావాల్సిన ఫ్లాట్స్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. 2 క్లబ్ హౌస్‌లు, వాకర్స్-జాగర్స్ ట్రాక్, బాంకెట్ హాల్, బాస్కెట్ బాల్ కోర్టు, క్రికెట్ నెట్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్‌పూల్, ఇండోర్ గేమ్స్, స్పా అండ్ సెలూన్, యోగా అండ్ మెడిటేషన్ రూమ్స్, బిజినెస్ సెంటర్ సహా అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయిక్కడ.
అబ్బురపరిచే ఆవాసా..
లగ్జరీ విల్లాస్ కాన్సెప్ట్‌తో వాసవీ గ్రూప్ కొంపల్లిలో చేపట్టిన ప్రాజెక్ట్ వాసవీ అవాసా. ఇటు విలాసం.. అటు సౌకర్యం కలిసి స్వర్గాన్ని తలపించేలా ఉంటాయి వాసవీ అవాసాలోని విల్లాలు. 4 వేల 405 చదరపు అడుగుల నుండి 4 వేల 647 స్క్వేర్ ఫీట్స్ వైశాల్యంతో మొత్తం 59 పొష్ విల్లాలున్నాయి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. సూపర్ స్పేషియస్.. లావిష్ కన్‌స్ట్రక్షన్.. కంఫర్ట్‌కు కేరాఫ్ అవాసా ప్రాజెక్ట్. ఇక 9 వేల 198 చదరపు అడుగుల విస్తీర్ణంలోని క్లబ్‌హౌస్‌లో- ఇది ఉంది.. అది లేదు అనే మాటకు తావులేకుండా అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయ్. ఔట్‌డోర్ జిమ్, స్విమ్మింగ్‌పూల్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ కోర్టు, పార్టీ లాన్ ఏరియా, యాంఫిథియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, సీటింగ్ జోన్ సహా ఎమెనిటీస్ కొదువలేదు.
బెస్ట్ బిజినెస్ హబ్@ గచ్చిబౌలి
బిజినెస్ ఎక్స్‌లెన్స్‌కు రీ-డెఫినిషన్ ఇస్తూ వాసవీ గ్రూప్ ఎక్స్‌క్లూజివ్‌గా నిర్మించిన కమర్షియల్ స్పేస్- వాసవీ స్కై సిటీ. బిజినెస్ వరల్డ్‌లో హార్ట్ ఆఫ్ ద హైద్రాబాద్‌గా ఉన్న గచ్చిబౌలిలో ఉండటం వల్ల వాసవీ స్కై సిటీకి కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ఇటు ఎమెనిటీస్ మ్యాటర్‌లోనూ నో కాంప్రమైజ్. 8 ఎకరాల స్థలంలో రెండు టవర్లలో 19 అంతస్థుల్లో స్కై సిటీని కన్‌స్ట్రక్ట్ చేశారు. స్టార్టప్‌ల నుంచి పెద్ద కార్పొరేషన్ కంపెనీల వరకు ఎలాంటి సంస్థకైనా కావాల్సినంత వర్కింగ్ స్పేస్ ఈ స్కై సిటీలో అందుబాటులో ఉంది. అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్స్, హై-స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ డెవలప్‌కు కేరాఫ్‌గా మోడ్రన్ కో-వర్కింగ్ స్పేస్‌లు ఇందులో ఉన్నాయ్. ఇక హెల్త్ కోసం కాంప్లెక్స్‌లో ఫిట్‌నెస్ సెంటర్స్, కేఫెలు, రిటైల్ ఔట్‌లెట్స్ కూడా ఉన్నాయ్. కేవలం వాణిజ్య పరంగానే కాదు.. పర్యావరణహితం కోసం కూడా ఆలోచించే వాసవీ గ్రూప్ ఈ స్కై సిటీ నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్ మెథడ్‌ని పాలో అయింది.