poulomi avante poulomi avante

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు స్వర్ణాంధ్ర 2047 విజన్..

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాధ్ర @2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిద్దడంతో పాటు 43 వేల డాలర్లకు పైగా తలసరి ఆదాయంతో కూడిన 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నామ‌ని అన్నారు.

ఏపీ 974 కి.మీల పొడవుగల సుముద్రతీర ప్రాంతాన్ని కలిగి ఉందని ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా మూలపేట, గంగవరం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నాయని సిఎస్ చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తీర ప్రాంత జిల్లాల్లో ఏర్పాటవుతున్నాయని ఎగుమతి, దిగుమతులకు పెద్దఎత్తున అవకాశాలు కలుగనున్నాయని చెప్పారు.

వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా పెద్దఎత్తున అభివృద్ధి చెందుతోందని కావున బ్లూ ఓషన్ ఎకానమీని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఐదేళ్ళ కాలానికి జిల్లా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలైన జీరో పేదరికం, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజిమెంట్, డేటా సెంటర్, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్సు వంటి గ్రోత్ ఇంజన్లు వంటి జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన ఉదాహరణకు అరకు కాఫీ వంటి జిల్లా ప్రాముఖ్యం కలిగిన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ళ విజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలక్టర్లకు స్పష్టం చేశారు. అదే విధంగా జిల్లా ప్రణాళిక ఆధారంగా చేసుకుని మండల స్థాయిలో ఐదేళ్ళ విజన్ కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేయాలని చెప్పారు.

ముఖ్యంగా గ్లోబల్ హై వ్యాల్యూ అగ్రీ అండ్ ప్రోసెసింగ్ పవర్ హౌస్,పరిశ్రమ ఆధారిత నైపుణ్య పెంపుదల విద్య, తూర్పు తీరంలో లాజిస్టిక్స్ కేంద్రంగా ఎదగడం, పారిశ్రామిక మరియు పునరుత్పాదకాలకు కేంద్రంగా ఎపిని తీర్చిదిద్దడం వంటి అంశాల ప్రాధన్యతతో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles