హైడ్రా కు పూర్తి అధికారాలు కట్టబెడుతూ పురపాలక శాఖ ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ.. జీహెచ్ఎంసీ చట్ట సవరణతో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఇకపై హైడ్రా నోటిసులు జారీ చేస్తుందని తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రా నోటీసులు ఇస్తుందన్నారు. అనధికారిక భవనాలను కూడా సీజ్ చేసే అధికారం హైడ్రాకు వచ్చిందని చెప్పారు.