కళాత్మక కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్య ( Aishwarya ) ఎస్ఆర్ఎం సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలో ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. చదువుల్లో టాప్ విద్యార్థుల్లో ఒకరుగా నిలిచారు. దుబాయ్‌లోని అల్తురాత్ ఇంజినీరింగ్ సంస్థలో చేరి అనేక ప్రాజెక్టుల్లో అవగాహన పెంచుకున్నారు. వివిధ సంస్థల భవనాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, నివాస గృహాలు, ఆహ్లాదకరమైన నిర్మాణాల్ని డిజైన్ చేయడంలో అనుభవం సంపాదించారు. అక్కడే పలు పేరెన్నిక గల ప్రాజెక్టుల డిజైనింగ్లో పాలుపంచుకున్నారు. తను హైదరాబాద్ విచ్చేసి సొంతంగా ప్రాక్టీస్ ఏర్పాటు చేశారు. వైద్ ఆర్కిటెక్ట్స్ ఆరంభం నాటి నుంచి ఐశ్వర్య తన బృందంతో కలిసి అనేక ప్రాజెక్టుల్ని డిజైన్ చేశారు.
బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ నిమిత్తం ఐదు వేల ఫ్లాట్లు, సూళ్లూరుపేట్‌లో కాంటినెంటల్ కాఫీ కోసం 150 ఎకరాల ల్యాండ్ స్కేపింగ్ డిజైన్, నెల్లూరులో 2 లక్షల చదరపు అడుగుల పీఎంజేవీకే భవనం వంటివి డిజైన్ చేశారు. హైదరాబాద్‌లో 25 వేల చదరపు అడుగుల విల్లా వంటి అనేక ప్రాజెక్టుల్ని తీర్చిదిద్దారు. వైవిధ్యమైన డిజైనింగ్ పోర్ట్‌ఫోలియో గల ఐశ్వర్య తను డిజైన్ చేసే అన్ని రకాల ప్రాజెక్టుల్ని హరిత సూత్రాలకు అనుగుణంగా నిర్మించాలని కోరుకుంటారు. తన ప్రాజెక్టులు చూడటానికి ఉన్నతంగా, వైవిధ్యంగా ఉండాలని భావిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్‌లో పలు ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తున్నారు.
ఆర్కిటెక్ట్ పేరు: ఐశ్వర్య
సంస్థ పేరు: వైద్ ఆర్కిటెక్స్
వెబ్ సైటు: www.vaidarchitects.in
ఈమెయిల్: vaid.architects@gmail.com
కాంటాక్ట్ డిటెయిల్స్: 9095544916
చిరునామా: ప్లాటు నెం. 555ఎ, రోడ్ నెం 28, జూబ్లీహిల్స్, హైదరాబాద్
స్పెషలైజేషన్: ఆర్కిటెక్చర్/ఇంటీరియర్ డిజైన్, ల్యాండ్‌స్కేప్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
సంస్థ పేరు: వైద్ ఆర్కిటెక్స్
వెబ్ సైటు: www.vaidarchitects.in
ఈమెయిల్: vaid.architects@gmail.com
కాంటాక్ట్ డిటెయిల్స్: 9095544916
చిరునామా: ప్లాటు నెం. 555ఎ, రోడ్ నెం 28, జూబ్లీహిల్స్, హైదరాబాద్
స్పెషలైజేషన్: ఆర్కిటెక్చర్/ఇంటీరియర్ డిజైన్, ల్యాండ్‌స్కేప్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్