- గిరిధారి హోమ్స్.. హ్యాపీనెస్ హబ్
- ఇందులో నివసిస్తే ఆనందమే..
హైద్రాబాద్‌లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి రెజ్ టీవీ టాప్ అండ్ రిలయబుల్ ప్రాజెక్ట్స్ గురించి రికమండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మీకు పరిచయం చేస్తోన్న మరో టాప్ కన్స్ట్రక్షన్ గిరిధారి హోమ్స్ చేపట్టిన హ్యాపీనెస్ హబ్ ప్రాజెక్ట్. విదేశాల్లో పాపులరై డిమాండెడ్ కాన్సెప్ట్‌గా ఉన్న హ్యాపీనెస్ థీమ్‌తో కిస్మత్పూర్లో ఈ తరహా ప్రాజెక్ట్ చేపట్టింది గిరిధారి హోమ్స్. మరి హ్యాపీనెస్ హబ్ స్పెషాలిటీస్ ఏంటో..? కిస్మత్పూర్ లాంటి వాంటెడ్ ఏరియాలో నిర్మిస్తోన్న ఈ యూనిక్ ప్రాజెక్ట్‌లో యూనిట్ ప్రైస్ రేంజ్‌తో పాటు అదర్ ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఇప్పుడు చూద్దాం.
థీమ్ ప్రాజెక్ట్‌లని పరిచయం చేసి.. ఈ తరహా నిర్మాణాలకి చిరునామాగా మారింది గిరిధారి హోమ్స్. 2008 నుంచి కస్టమర్లకు సేవలందిస్తోన్న గిరిధారి హోమ్స్ మార్కెట్లో వన్ ఆఫ్ ద ప్రీమియం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీగా పేరు పొందింది. అఫర్డబుల్ ప్రైసెస్లోనే లగ్జరీ లివింగ్ స్పేస్‌లు క్రియేట్ చేసి కస్టమర్లకు విలాసవంతమైన గృహాలను అందిస్తుంది ఈ సంస్థ. ఇప్పటికే 14కి పైగా ప్రాజెక్ట్‌లని టేకప్ చేసి కస్టమర్ల అభిమానాన్ని సైతం చూరగొంది. అలాంటి గిరిధారి హోమ్స్ నుంచి వస్తోన్న మరో వండర్ఫుల్ వెంచర్ గిరిధారి హ్యాపీనెస్ హబ్ ఎట్ కిస్మత్పూర్.
ఆఫీస్ ప్రెజర్స్.. విసిగించే ట్రాఫిక్.. చెవులు పగలకొట్టే సౌండ్ పొల్యుషన్- వీటంన్నిటిని బయటపడి రిలాక్స్ అవ్వాలంటే ఉండే ఇల్లు డెఫనెట్‌గా హ్యాపీ హోమ్ అవ్వాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, ఫ్రెష్ ఎయిర్, పారే నీటి సవ్వడులు, మైండ్‌ని రిఫ్రెష్ చేసే లోగోస్, కొటేషన్స్, ఆర్ట్ ఇలా అన్ని వినూత్నంగా ఉంటే ఎలాంటి చికాకైనా సెకన్లో ఎగిరిపోవడం ఖాయం. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్‌తో డిజైన్ చేసిందే గిరిధారి హ్యాపీనెస్ హబ్. కిస్మత్పూర్ టీఎస్పీఏ జంక్షన్‌కి సమీపంలో 5.47 ఎకరాల్లో చేపట్టారు ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్‌ని. ఉన్న స్థలంలో ఇరుకుగా వేల ఫ్లాట్స్ కట్టేయకుండా ఇందులో కేవలం 567 యూనిట్లను మాత్రమే నిర్మిస్తున్నారు. జీ ప్లస్ 5 అంతస్థుల ఎత్తులో 3 టవర్లు ఉంటాయిందులో. 1033 నుంచి 1601 స్క్వేర్‌ఫీట్స్ విస్తీర్ణంలో టూ బీహెచ్‌కే, త్రీ బీహెచ్‌కే డైమెన్షన్స్ ఉండనున్నాయ్. ఇక క్లబ్‌హౌస్‌ను సైతం హ్యాపీ బాడీ, మైండ్, సోల్, హార్ట్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నారు.
ప్రకృతి ఒడిలో సేదదీరినట్టు ఉంటుంది గిరిధారి హ్యాపీనెస్ హబ్ నిర్మాణం. నీటి ప్రవాహాలతో సందడి చేస్తూ చల్లటి పిల్లగాలులు పంచే హిమాయత్ సాగర్ ఓ వైపు. వేల ఎకరాల్లో పచ్చని తివాచీ పర్చుకున్నట్టు ఉండే మృగవాణి పార్క్, ఆ వెంటనే గ్రీనరీతో నిండిపోయిన అగ్రికల్చర్ యూనివర్శిటీ, వేల ఎకరాల్లో విశాలంగా కనిపించే ఆర్మీ ఏరియా.. వీటంన్నిటి మధ్యలో ఆహ్లాదానికి.. ప్రశాంతతకు మారుపేరులా ఉంటుంది గిరిధారి హ్యాపీనెస్ హబ్.
ఆనంద, ఆహ్లాద, అమేయ, అద్భుత, ఆరోగ్య, ఉల్లాస, ఉత్సాహ.. పేర్లు వింటుంటేనే ఏదో తెలియని అథెంటిక్ ఫీలింగ్ వస్తుంది కదా..! గిరిధారి హ్యాపీనెస్ హబ్‌లో ఇలాంటి వైవిధ్యాలు ఎన్నో..! బ్యాడ్మింటన్ కోర్ట్స్, కిడ్స్ ప్లే జోన్ దగ్గర్నుంచి ప్రతి విభాగానికి పెట్టిన పేరు దగ్గర్నుంచి ఆనందాన్ని ప్రతిబింబించే చిహ్నాల వరకు అన్నింటిలో ప్రత్యేకత కనిపిస్తుంటుంది. హ్యాపీనెస్ హబ్‌లో స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది మొమరీ బ్యాంక్ గురించి. ప్రతి బయ్యర్‌కు ఓ లాకర్‌ను ఇస్తారు. ఫోటోలు, వీడియోల రూపంలో మధుర జ్ఞాపకాలన్నీ మొమరీ బ్యాంక్‌లో భద్రపర్చుకోవచ్చు. ఇక స్విమ్మింగ్‌పూల్, జిమ్, యాంఫీ థియేటర్, సెంట్రల్ కోర్ట్ యార్డ్స్, బాంక్వెట్ హాల్స్ లాంటి అమెనిటీస్కి కొదువ లేదు. కిస్మత్పూర్- ఇటు రెసిడెన్షియల్‌గా.. అటు కమర్షియల్గానూ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏరియాల్లో అతి ముఖ్యమైంది. ఇలాంటి ప్రాంతంలో బడ్జెట్లో ప్రాపర్టీ ఊహించడమే గొప్ప అనుకుంటే.. ఫైవ్‌స్టార్ లగ్జరీ అమెనిటీస్తో ఫ్లాట్స్ రావడం అన్ ఇమాజినబుల్ థింగ్ కాక మరేమిటి..? ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైండ్ స్పేస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బంజారాహిల్స్.. ఇలా హైద్రాబాద్ ఏ ప్రధాన ప్రాంతానికైనా అరగంటలో చేరుకోవచ్చు ప్రాజెక్ట్ లొకేటై ఉన్న ప్రదేశం నుంచి. పేరుకు తగ్గట్టే ప్రతీ అంగుళం.. అడుగులో అణువణువునా ఆనందం వెల్లివిరిసేలా డిజైన్ చేసిన హ్యాపీనెస్ హబ్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి బయ్యర్లకు హ్యాండోవర్ చేయనున్నారు.