poulomi avante poulomi avante

గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ?

  • గ్రేటర్ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలన్న ప్రతిపాదన
  • నాలుగు భాగాలుగా జీహెచ్ఎంసీ..
  • రెండు వేల చ. కి. మీ వరకు విస్తరణ
  • ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు,
    కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం?

హైదరాబాద్ మహా నగరాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ది చేయాలన్న కృత నిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలన్న ప్రతిపాదనను మున్సిప‌ల్‌, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి పంపగా.. దానిపై కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేసి మొత్తం ఒకే కార్పోరేషన్ ను ఏర్పాటు చేయడం ద్వారా ..సిటీని సమ్మిళిత అభివృద్ధి దిశగా నడిపించాలని ముందు భావించింది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్‌ కార్పోరేషన్ ను మూడు లేదా నాలుగు భాగాలుగా విడగొట్టాలనే ప్రతిపాదనను సైతం తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన పరిష్కారం చూపించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్‌ కార్పోరేషన్ ను మినహాయిస్తే ఓఆర్‌ఆర్‌ లోపల మొత్తం 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీతో పోలిస్తే అభివృద్ధి విషయంలో మిగతా కార్పోరేషన్లు, మున్సిపాల్టీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈక్రమంలో ఓఆర్‌ఆర్‌ వరకూ నగరాన్ని ఒకే విధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రెండు వేల చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీ విస్తీర్ణం నేపథ్యంలో పరిపాలనకు సంబంధించిన కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని నివారణకు 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను విలీనం చేశాక.. జీహెచ్‌ఎంసీని మూడు లేదా నాలుగు భాగాలుగా విడగొట్టాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇది జరగాలంటే ఔటర్‌ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు.

ఓఆర్ఆర్ లోపల ఉన్న కార్పోరేషన్లు, మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు గ్రేటర్‌ పాలకమండలి ఆమోదం తెలపాలి. కానీ గ్రేటర్ కౌన్సిల్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేదు. పైగా ఈ పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఉంది. మరోవైపు ఈ 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. గడువు ముగిసిన స్థానిక సంస్థలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా.. జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి, అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం విడగొట్టడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కమిటీ ఏర్పాటు నేపథ్యంలో ఈ మున్సిపాలిటీలకు గడువు లోపు ఎన్నికలపై న్యాయ వివాదాలు సైతం తప్పుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి కనీసం ఏడాది సమయం పడుతుందనీ, ఈలోపు జీహెచ్‌ఎంసీ పాలకవర్గం గడువు ముగుస్తుందనీ అధికారులు భావిస్తున్నారు. అప్పటికి శివారులోని స్థానిక సంస్థల విలీనం, జీహెచ్‌ఎంసీ విభజన అంశాలపై స్పష్టత వస్తుందనీ, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చనేది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles