poulomi avante poulomi avante

హైద‌రాబాద్‌లో టాప్ 10 స్కై స్క్రేప‌ర్లు ఇవే..!

2025లో మీరు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని అనుకుంటున్నారా? అయితే, హైద‌రాబాద్‌లో అనేక నిర్మాణ సంస్థ‌లు ఆకాశ‌హ‌ర్మ్యాల్ని నిర్మిస్తున్న నేప‌థ్యంలో.. అందులో నుంచి కొన్ని ప్రాజెక్టుల‌ను మీకు రియ‌ల్ ఎస్టేట్ గురు స‌జెస్ట్ చేస్తోంది. మ‌రి, వాటిని ఏయే సంస్థ‌లు.. ఎక్క‌డెక్క‌డ నిర్మిస్తున్నాయి? ఒక్కో ప్రాజెక్టు ఎంత విస్తీర్ణంలో క‌డుతున్నారు? ఆయా నిర్మాణాల స్పెషాలిటీస్ ఏమిటీ? హైద‌రాబాద్‌లోని టాప్ టెన్ స్కై స్క్రేప‌ర్ల‌ను మేమేందుకు సజెస్ట్ చేస్తున్నామో ఈ స్టోరీని పూర్తిగా చూస్తే మీకు ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

1) వంశీరామ్ మ‌న్‌హ‌ట్ట‌న్‌

Hyderabad top 10 skyscrapers
Hyderabad top 10 skyscrapers

హైద్రాబాద్‌లో ఊబ‌ర్ ల‌గ్జరీ లివింగ్‌ లైఫ్‌ స్టైల్‌ను కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న అత్యుత్తమ ప్రాజెక్టే.. వంశీరామ్ మ‌న్‌హ‌ట్టన్‌. మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కూ హైద్రాబాద్‌లో ఇలాంటి లొకేష‌న్‌లో.. ఇంత హై క్వాలిటీ స్టాండ‌ర్డ్స్‌తో మ‌రే ప్రాజెక్టు రాద‌ని.. ఘంటాప‌థంగా చెబుతున్నారు. విలావంతమైన జీవనంలో ఓ కొత్త పరిణామాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో మన్‌హట్టన్‌ ప్రాజెక్టుని ప్రారంభించింది వంశీరామ్‌. 15 ఎకరాల్లో.. 8 టవర్లతో 978 యూనిట్లను అదిరిపోయే విధంగా నిర్మిస్తోంది. 5369 చదరపు అడుగుల నుంచి 15,210 చదరపు అడుగుల సైజులో.. 4, 5 బీహెచ్ కే ఫ్లాట్స్‌ను డెవలప్‌ చేస్తున్నారు. 2029 మార్చి నాటికి పూర్తి చేసే సంకల్పంతో ఎక్కడా రాజీపడకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతోంది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమస్త సౌకర్యాలతో ఓ క్లబ్ హౌస్‌ను నిర్మిస్తున్నారు.

2) రాజపుష్ప ప్రొవిన్షియా

గచ్చిబౌలి- ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నియర్‌ బై ఓన్‌ ప్రాపర్టీ కావాలనుకునే వారికి.. ఈ రెండు ప్రాంతాల దగ్గర్లో నివసించాలనుకునే వారికి బెస్ట్‌ ఛాయిస్‌ రాజపుష్ప ప్రొవిన్షియా. ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించి సక్సెస్‌ఫుల్‌గా కస్టమర్లకు హ్యాండోవర్‌ చేసిన రాజపుష్ప- నార్సింగిలో 23.75 ఎకరాల విశాలమైన ల్యాండ్‌ ఏరియాలో ప్రొవిన్షియా పేరుతో లార్జెస్ట్‌ లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీ స్కై స్క్రేపర్‌ ప్రాజెక్ట్‌ని చేపట్టింది. ఇందులో జీ+39 ఎత్తులో 11 టవర్లు నిర్మించారు. 1370 నుంచి 2660 స్క్వేర్‌ఫీట్స్‌లో టూ బీహెచ్‌కే అండ్ త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్‌.. మొత్తం 3 వేల 498 అపార్ట్‌మెంట్‌ యూనిట్స్‌ ఉన్నాయ్‌. ఇక లక్షన్నర చదరపు అడుగుల్లో క్లబ్‌ ఒడిస్సీ, క్లబ్‌ ఒయాసిస్‌ పేరుతో రెండు గ్రాండ్‌ క్లబ్‌ హౌస్‌ల్ని ఎక్స్‌క్లూజివ్‌గా ఏర్పాటు చేశారు. రెడీ టూ మూవ్‌కి సిద్ధంగా ఉన్న ప్రొవిన్షియాలో ఈ ఏడాది మార్చి నుంచి కస్టమర్లకి ఫ్లాట్లను అందజేయనున్నారు.

3) పౌలోమీ పలాజో

2005లో కంపెనీని ఎస్టాబ్లిష్‌ చేసిన దగ్గర్నుంచి రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల్లో లీడింగ్‌లో ఉంది పౌలోమీ ఎస్టేట్స్‌. కస్టమర్ల టేస్ట్‌కి తగ్గట్టు లావిష్‌ అండ్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తున్న పౌలోమీ నుంచి వస్తోన్న హై రైజ్‌ అపార్ట్‌మెంట్స్‌ ప్రాజెక్ట్‌ పౌలోమీ పలాజో. కోకాపేటలోని గోల్డెన్‌ మైల్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌లో నిర్మిస్తోన్న ఈ స్కై స్క్రేపర్‌లో 55 అంతస్థులున్నాయ్‌. ప్రాజెక్ట్‌ సైజ్‌ విషయానికొస్తే- 2.3 ఎకరాల్లో నిర్మిస్తోన్న పలాజోను సింగిల్‌ బిల్డింగ్‌గా నిర్మిస్తున్నారు. మొత్తం 141 యూనిట్స్‌ ఉండగా.. అన్నీ ఫోర్‌ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్సే. 6 వేల 225 నుంచి 8 వేల 100 చదరపు అడుగుల్లో ఈ యూనిట్స్‌ కన్‌స్ట్రక్ట్‌ అవుతున్నాయ్‌. 2028 మార్చి నాటికి బయ్యర్లకి ఫ్లాట్స్‌ అందజేస్తామంటోంది పౌలోమీ. వెల్నెస్‌ ఫ్లోర్‌, ఫిట్నెస్‌ ఫ్లోర్‌, రిక్రియేషన్‌ ఫ్లోర్‌లుగా 3 లెవల్స్‌లో క్లబ్‌ పలాజో పేరుతో క్లబ్‌హౌస్‌ సదుపాయాలున్నాయ్‌.

4) వాస‌వి ఆనంద నిల‌యం

హైద్రాబాద్‌ డెవలప్‌మెంట్‌ మ్యాటర్‌లో రన్నింగ్‌ రేస్‌ పెడితే వెస్ట్‌ సైడ్‌తో సై అంటోంది ఈస్ట్‌సైడ్‌. అలాంటి తూర్పు హైద్రాబాద్‌కి తమ ఆనంద నిలయం ప్రాజెక్ట్‌తో కొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్. ఎల్‌బీ నగర్‌ మెట్రో స్టేషన్‌కు చేరువ‌లోనే ఉంది వాసవి ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 3,576 ఫ్లాట్స్ నిస్తున్నారు. మొత్తం 72 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఉండేలా నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌.. దక్షిణ భారతంలోనే అతి పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ. లష్‌ గ్రీనరీతో.. సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై ఎండ్‌ వరల్డ్‌ క్లాస్‌ ఎమెనిటీస్‌ని వాసవీ గ్రూప్‌ అందుబాటులోకి తేనుంది.

5) సాస్‌ క్రౌన్‌

హైద్రాబాద్‌లోనే అత్యంత ఎత్తైన ఆకాశ‌హ‌ర్మ్యమే సాస్‌ క్రౌన్‌. జీ ప్లస్‌ 57 అంత‌స్థుల ఎత్తైన ఈ స్కై స్క్రేప‌ర్‌.. కోకాపేట్‌ స‌ర్వీస్‌ రోడ్డు మీద ఎంతో ఠీవీగా నిల‌బ‌డుతూ ద‌ర్శనమిస్తుంది. 58 అంత‌స్తుల స్ట్రక్చర్‌ ప‌నుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రేప‌ర్‌ సాస్‌ క్రౌన్‌. కోకాపేట్‌లోని గోల్డెన్‌ మైల్‌ లేఔట్‌లో సుమారు నాలుగున్నర ఎక‌రాల్లో రూపుదిద్దుకుంది ఈ ల‌గ్జరీ ప్రాజెక్ట్‌. సుమారు ఐదు ట‌వ‌ర్లలో డిజైన్‌ చేసిన ప్రాజెక్టులో.. కేవ‌లం 235 కుటుంబాలు నివ‌సించ‌డానికి అవ‌కాశ‌ముంది. అంటే- ఆ 235 ఫ్యామిలీస్‌ వెరీ వెరీ స్పెష‌ల్‌ అని చెప్పొచ్చు. 200 మీట‌ర్ల కంటే ఎత్తులో నివ‌సించాల‌ని కోరుకునేవారి కోసం సుమారు ఇర‌వై ఐదు డ్యూప్లేలున్న ప్రాజెక్టే.. సాస్ క్రౌన్‌.

6) టీమ్‌ 4 ఆర్కా

#team4 arka
#team4 arka

అత్యున్నతమైన ఫీచర్లు.. అధునాతన సౌకర్యాలు అదిరిపోయే డిజైన్‌తో నిర్మిస్తోన్న సూపర్‌ లగ్జరీ ప్రాజెక్ట్‌ టీమ్‌ 4 ఆర్కా. ఖాజాగూడ దగ్గర్లోని నానక్‌రామ్‌గూడలో 9 ఎకరాల్లో టీమ్‌ ఫోర్‌ లైఫ్‌ స్పేసెస్‌ సంస్థ ఈ అల్ట్రా మోడ్రన్‌ లగ్జరీ ప్రాజెక్ట్‌ను డెవలప్‌ చేస్తోంది. ఇందులో మొత్తం 6 టవర్లు ఉన్నాయ్‌. 43 అంతస్థుల ఎత్తైన టీమ్‌ 4 ఆర్కా ప్రాజెక్ట్‌లో 1204 ఫ్లాట్స్‌ను కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారు. 2,120 నుంచి 4,410 చదరపు అడుగుల వైశాల్యంలో త్రీ బీహెచ్‌కే, ఫోర్‌ బీహెచ్‌కే యూనిట్లు సిద్ధమవుతున్నాయ్‌. ప్రాజెక్టు మొత్తం ఒక ఎత్తైతే.. క్లబ్ హౌస్ మరో ఎత్తు. దీన్ని ఆరు అంతస్తుల ఎత్తులో డిజైన్ చేశారు. ఆకాశ‌హ‌ర్మ్యాల్లో నివ‌సించాల‌ని ఆశించేవారు టీమ్ ఫోర్ ఆర్కాను విజిట్ చేయాల్సిందే. 2029 సెప్టెంబర్‌ నాటికి పొసెషన్‌ స్టార్ట్‌ అవ్వొచ్చని అంచనా.

7) ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకానియా

ద‌క్షిణాదిలో పేరెన్నిక గ‌ల నిర్మాణ సంస్థ ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌.. కొండాపూర్‌లో సుమారు 22 ఎక‌రాల్లో ఎస్ఎంఆర్ విన‌య్ ఐకానియాను నిర్మించింది. ఇందులో మొత్తం వ‌చ్చేవి ప‌ద‌కొండు ట‌వ‌ర్లు. ఇప్పటివ‌ర‌కూ సుమారు ప‌ద‌కొండు వంద‌ల ఫ్లాట్లను కొనుగోలుదారుల‌కు అందజేసింది. ఆల్రెడీ సుమారు 940కి పైగా కుటుంబాలు నివ‌సిస్తున్నాయ్‌. ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేప్‌తో పాటుగా దేవాలయం, ప్రత్యేకమైన క్లబ్‌ హౌస్‌లు, క్రీడా వసతులు మొదలైనవి అభివృద్ధి చేశారు. ఇందులో విశాల‌మైన క్రికెట్ గ్రౌండ్ మొత్తం ప్రాజెక్ట్‌కే ప్రధాన ఆక‌ర్షణ అని చెప్పొచ్చు. క్లబ్‌హౌస్‌, స్విమ్మింగ్‌ పూల్‌, అల్ట్రా మోడ్రన్ జిమ్‌, టెన్నిస్ కోర్టు, స్క్వాష్ కోర్టు, ఇండోర్‌ బాడ్మింటన్‌ కోర్టు, బాస్కెట్‌బాల్‌ కోర్టు , సింథటిక్‌ టర్ఫ్‌తో జాగింగ్‌ ట్రాక్ వంటివి పొంద‌ప‌రుస్తారు.

8) అన్వితా ఇవానా

ఇంటీరియర్‌తో పాటు నిర్మాణ రంగంలోని అనుభవంతో తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగు పెట్టింది అన్వితా బిల్డర్స్‌. వాటిల్లో టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రాజెక్ట్‌ అన్వితా ఇవానా. కొల్లూరు వద్ద 2 వేల కోట్ల రూపాయల హ్యుజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో నిర్మిస్తోన్న ఈ లగ్జరీ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లో అనేక విశేషాలున్నాయ్‌. మొత్తం 12.9 ఎకరాల్లో విస్తరించిన ఈ స్కై స్క్రేపర్‌ ప్రాజెక్ట్‌ని రెండు దశల్లో కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారు. మొత్తం 6 టవర్లలో 1700కి పైగా లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను నిర్మిస్తున్నారు. లక్ష స్క్వేర్‌ఫీట్స్‌లో గ్రౌండ్‌ లెవల్‌ అమెనిటీస్‌.. మరో లక్ష ఎస్‌ఎఫ్‌టీల్లో టెర్రస్‌ లెవల్‌ అమెనిటీస్‌ కల్పిస్తున్నారు. 2027 నాటికి మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకొంది అన్వితా గ్రూప్‌.

9) క్యాండియ‌ర్ ట్విన్స్‌

డెవలప్మెంట్‌కి కేరాఫ్‌గా ఉన్న వెస్ట్‌ హైద్రాబాద్‌లో పచ్చని ప్రకృతిని కాపాడుతూనే.. భారీ ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది క్యాండియ‌ర్ డెవలపర్స్‌. మియాపూర్‌లో లొకేటై ఉన్న క్యాండియ‌ర్ ట్విన్స్‌ ప్రాజెక్ట్‌ను 3.5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. లావిష్‌గా డిజైన్‌ చేసిన రెండు టవర్లలో రానున్న ఈ ప్రాజెక్ట్‌- 47 అంతస్థుల స్కై స్క్రేపర్‌గా చూడముచ్చటగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో మొత్తం 742 లగ్జరీ ఫ్లాట్స్‌ కన్‌స్ట్రక్ట్‌ అవుతున్నాయ్‌. యూనిట్‌ సైజ్‌ 1590 నుంచి 2 వేల 60 స్క్వేర్‌ఫీట్స్‌ స్పేషియస్‌లో ఉండనుంది. 7 అంతస్థుల్లో 45 వేల చదరపు అడుగుల వైశాల్యంతో ఉన్న క్లబ్‌హౌస్‌.. ఇండోర్‌ అండ్‌ ఔట్‌డోర్‌ గేమింగ్‌ సిట్‌ఔట్స్‌ సహా ఎన్నో ఫెసిలిటీస్‌ ఉన్నాయ్‌. 2026 జూన్‌ నుంచి క్యాండియ‌ర్ ట్విన్స్‌లో పొసెషన్‌ స్టార్ట్‌ కానుంది.

10) వాసవి స్కైలా

ఇటు లగ్జరీ.. అటు కంఫర్ట్‌ని మిక్స్‌ చేసి బయ్యర్ల టేస్ట్‌కు తగ్గట్టు రూపొందిస్తోన్న అపార్ట్‌మెంట్స్‌ వాసవి స్కైలా. సిటీలో మోస్ట్ వాంటెడ్‌ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్‌- హైటెక్‌ సిటీ సమీపంలో కొలువుదీరింది ఈ ప్రాజెక్ట్‌. పేరుకు తగ్గట్టు ఆకాశాన్ని అందుకునేలా ఉంటుంది ఈ వాసవీ స్కైలా. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్కైలా గేటెడ్‌ కమ్యూనిటీలో మొత్తం 685 యూనిట్స్‌ ఉన్నాయ్‌. వీటిని 5 టవర్లలో నిర్మిస్తున్నారు. ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్థులున్నాయ్‌. వాసవి గ్రూప్‌ నిర్మిస్తోన్న మిగిలిన ప్రాజెక్ట్‌లతో పొల్చితే స్కైలా కొంచెం డిఫరెంట్‌ అనే చెప్పాలి. రీజన్‌ ఇక్కడ ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌, ఫోర్ బీహెచ్‌కేతో పాటు ఫైవ్‌ బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో ఉన్న అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయ్‌. 50 వేల ఎస్‌ఎఫ్‌టీల్లో క్లబ్‌ హౌస్‌ సహా అనేక మోడ్రన్‌ అమెనిటీస్‌ ఉన్నాయిందులో.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles