- మారిన హైడ్రా తీరు..
మొన్నటిదాకా బుల్డోజర్లు వెంటేసుకుని హైదరాబాద్ అంతా తిరిగిన హైడ్రా ఒక్కసారిగా తీరు మార్చుకుంది. అక్రమ నిర్మాణాలను కూల్చుతాం.. అంటూ బల్లగుద్ది మరీ చెప్పిన హైడ్రా ఇప్పుడు చెరువులు, కుంటల్లో పూడికతీత పనులకు దిగింది. అది కూల్చాం.. ఇదీ కూల్చాం.. అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లు కూల్చాం అంటూ ప్రెస్‌మీట్లు పెట్టి లెక్కలు చెప్పిన హైడ్రా చీఫ్.. తాజాగా చెరువులో మోకాల్లోతు పూడిక తీశాం.. నాలుగు అడుగుల్లో నీరు తెప్పించాం అంటూ చెప్పుకుంటున్నారు.
అసలు హైడ్రా వ్యూహం ఏమిటి..?, కూల్చివేతల నుంచి పూడికతీతలకు ఎందుకు మారిందనేదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకున్న అసలు వ్యూహం నుంచి హైడ్రా బయటకు వచ్చింది. ఇప్పుడు హైడ్రా తీరు మరింది.. వ్యూహం దిశ మార్చుకున్నది. రాత్రికి రాత్రి బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలు నిర్దాక్షణ్యంగా కూల్చివేసిన పరిస్థితుల నుంచి నీళ్లు తెప్పిస్తాం.. పునాదులు తీస్తాం అనే తీరున తయారైంది.