poulomi avante poulomi avante

క్రెడాయ్ ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్

సందర్శకులు వస్తారన్న నమ్మకమున్నా.. ఎక్కడో తెలియని భయం. కరోనా డెల్టా నేపథ్యంలో.. అసలు ప్రజలు బయటికొస్తారా? అనే సందేహం సర్వత్రా నెలకొంది. కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. ఊహించిన దానికంటే అధికంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత జరిగిన అతిపెద్ద ప్రాపర్టీ షో కావడంతో.. శని, ఆదివారాలు హైటెక్స్ ప్రాపర్టీ షో ప్రాంగణం సందర్శకులతో కిటకిటలాడింది. ’మేం ఊహించిన దానికంటే అధిక రెస్పాన్స్ లభించిందని.. చాలామంది తమ స్టాళ్లుకు విచ్చేసి వివరాలు తీసుకున్నారని.. అందులో ప్రాస్పెక్టీవ్ క్లయింట్స్ ఎక్కువగా ఉన్నార’ని హోమ్ 360 డిగ్రీస్ మేనేజింగ్ పార్టనర్ శ్రీనాథ్ రాఠీ తెలిపారు. ఈసారి క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రాస్పెక్టివ్ క్లయింట్స్ తమ స్టాళ్లను సందర్శించారని.. సందర్శకుల్లో అధిక శాతం మంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారే ఉన్నార’ని ప్రణీత్ డెవలపర్స్ కు చెందిన సంతోష్ కుమార్ తెలిపారు. రెండు రోజుల ప్రాప‌ర్టీ షో త‌మ ప్రాజెక్టుల్ని ఎక్కువగా సంద‌ర్శించార‌ని పీవీఆర్ డెవ‌ల‌పర్స్ కు చెందిన హ్యారీ సిల్వెస్ట‌ర్ చెప్పారు.

వాస‌వి గ్రూప్ సీఎండీ విజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాపర్టీ షోలో అధిక శాతం సంద‌ర్శకులు త‌మ స్టాలును సంద‌ర్శించార‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో ఆఫీస్ మార్కెట్ గిరాకీ గురించి చాలామంది ర‌క‌ర‌కాలుగా అంటున్నార‌ని.. కానీ, త‌మ స్కైసిటీకి మాత్రం మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని చెప్పారు. కేపీహెచ్‌బీ కాల‌నీ మ‌లేషియ‌న్ టౌన్‌షిప్లో ఫోరం మాల్ ఎదురుగా చేప‌ట్టిన వాణిజ్య స‌ముదాయం నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్నాయ‌ని.. బాచుప‌ల్లిలో క‌డుతున్న వాస‌వి అర్బ‌న్ నిర్మాణ ప‌నుల్లో వేగం పెరిగింద‌న్నారు. రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్ర‌దీప్ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ ఎండీ ప్ర‌దీప్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద చేప‌డుతున్న బ్లిస్ ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని.. పొప్పాల్ గూడ‌లో మ‌రో భారీ స్థాయి నిర్మాణాన్ని చేప‌డుతున్నామ‌ని వెల్ల‌డించారు.

యువ‌శ‌క్తి శ్ర‌మ‌తో స‌క్సెస్‌..

క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు ‘రియల్ ఎస్టేట్ గురు’తో మాట్లాడుతూ.. ఇంత‌టి భారీ స్థాయిలో ప్రాపర్టీ షో సక్సెస్ అవుతుందని చాలామంది ఊహించలేదన్నారు. ఈసారి అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకుని ప్రాపర్టీ షోను నిర్వహించడం వల్ల మంచి ఆదరణ లభించిందని చెప్పారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ప్రాపర్టీ షో లేఅవుట్ అద్భుతంగా వచ్చిందని.. ఇంతలా ప్ర‌జ‌ల ఆదరణ ఉంటుందనే విషయాన్ని చాలామంది డెవలపర్లు భావించలేదన్నారు. తమ యువ జట్టు సమిష్ఠి ప్రయత్నం, అహర్నిశల శ్రమ వల్ల ఈ ప్రాపర్టీ షో విజయవంతం అయ్యిందన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles