గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వంద మీటర్ల ఎత్తులో కట్టిన వన్ వెస్ట్ వాణిజ్య సముదాయం ప్రధాన ఆకర్షణగా మారింది. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఈ ఆఫీసు సముదాయాన్ని రెపరెపలాడుతున్న భారతీయ జెండాలో మెరిసిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణించే వారిలో ఎక్కువ శాతం మంది ప్రత్యేకంగా ఈ భవనం ఫోటోలు తీసుకోవడం రియల్ ఎస్టేట్ గురు ప్రత్యక్షంగా చూసింది. ఈ ప్రాజెక్టు విస్తీర్ణం ఎంతలేదన్నా పదకొండు లక్షల చదరపు అడుగుల దాకా ఉంటుందని సమాచారం. పదిహేడు అంతస్తులు గల వన్ వెస్ట్ ప్రాజెక్టులో స్థలమంతా లీజవుట్ అయ్యిందని సంస్థ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దీనికి స్థానిక సంస్థ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా లభించింది.