నగర రియల్ రంగానికి కాస్త ఊతమిచ్చే రెండు ప్రకటనలు ఈ వారం వెలువడ్డాయి. దీని వల్ల అమ్మకాలు పెరుగుతాయనో.. మార్కెట్‌కు రెక్కలొస్తుందనో చెప్పలేం కానీ.. కాస్త సానుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఆఫీసు మార్కెట్లో మళ్లీ కదలికలు ఏర్పడే అవకాశాలున్నాయి. గత ఏడాదిన్నర నుంచి ఆఫీసు స్పేస్ కుప్పకూలిందనే వార్తల నుంచి సానుకూలత వైపు మార్కెట్ పయనిస్తోందని చెప్పొచ్చు.
మలబార్ గోల్డ్ రూ.750 కోట్ల పెట్టుబడి
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తెలంగాణలో గోల్డ్ అండ్ డైమండ్ జ్యుయెలరీ ఉత్పత్తి కేంద్రాన్ని ఆరంభిస్తోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. దీంతో 2500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇటీవల మలబార్ గోల్డ్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కజకిస్థాన్ కాన్సులేట్ నాసిర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.