poulomi avante poulomi avante

సూప‌ర్ స్టార్ విల్లామెంట్స్ @ కోకాపేట్‌

ప‌చ్చ‌టి ప‌రిస‌రాలు, సెలయేటి స‌వ్వ‌ళ్లు, ఆహ్లాద‌క‌ర‌మైన ప‌రిస‌రాలు,
ప్రశాంత‌మైన వాతావ‌ర‌ణం, అద్భుత‌మైన గండిపేట్ దృశ్యాలు..
స‌మీపంలోనే ఐటీ హ‌బ్, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌ సంద‌డి..
స్కూలు, ఆస్పత్రి వెళ్లడానికి పదిహేను నిమిషాల్లే..

మీ జీవితానికి స‌రిప‌డా మ‌ధురానుభూతులన్నీ..
ఓ జ్ఞాప‌కంగా మీ మ‌దిలో భ‌ద్ర‌ప‌ర్చుకోవాలంటే..
మీరు సూప‌ర్ లార్జ్ ల‌గ్జ‌రీ విల్లాస్లో నివ‌సించాలి..
విల్లాల కంటే విశాల‌మైన‌వి ఎంపిక చేసుకోవాలి..
మ‌రి, ప్రపంచ స్థాయి డిజైన్‌తో.. ఆధునిక స‌దుపాయాల్ని
అందించే గృహాలు హైద‌రాబాద్‌లో ఎక్క‌డ ల‌భిస్తాయి?

Sri Srinivasa Constructions

 

KING JOHNSON KOYYADA: హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో ఆధునిక ఆవిష్క‌ర‌ణ‌లంటే గుర్తుకొచ్చే సంస్థ‌ల్లో శ్రీ శ్రీనివాసా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. ల‌గ్జ‌రీ అపార్టుమెంట్లు, విల్లాల్ని నిర్మించే కంపెనీల్లో ఈ సంస్థ‌కు కొనుగోలుదారుల్నుంచి చ‌క్క‌టి ఆద‌ర‌ణ ఉంది. అస‌లెవ‌రూ ఊహించని స‌మ‌యంలో.. స‌రికొత్త సొబ‌గుల‌తో మాదాపూర్లో ఫార్చ్యూన్ టవర్స్ ల‌గ్జ‌రీ గేటెడ్ క‌మ్యూనిటీ ప్రాజెక్టుని నిర్మించి శ‌భాష్ అనిపించుకుంది. హైదరాబాద్లో జీవో నెం 86 అనుమతితో కట్టిన ప్రప్రథమ హైరైజ్ ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. ఇలా, అనేక నిర్మాణాల‌తో న‌గ‌ర రియ‌ల్ రంగంలో త‌మ ప్రత్యేకతను చాటి చెబుతున్న శ్రీ శ్రీనివాసా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ల‌గ్జ‌రీని మించిన స‌దుపాయాల‌తో.. ప్ర‌పంచ స్థాయి సౌక‌ర్యాల్ని న‌గ‌ర‌వాసుల‌కు అందించ‌డానికి న‌డుం బిగించింది. ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని కోకాపేట్‌లో ఆధునిక ల‌గ్జ‌రీ గేటెడ్ క‌మ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. విల్లా కంటే బ‌డా సైజుల్లో ఫ్లాట్ల‌ను డిజైన్ చేసి స‌రికొత్త సంచ‌ల‌నం సృష్టించింది.

ల‌గ్జ‌రీని మించిన స‌దుపాయాల్ని అందించ‌డ‌మంటే మాట‌లు కాదు. ఇందుకోసం ఎంతో ప‌క‌డ్బందీగా ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించాలి. డిజైనింగ్‌లో ఎక్క‌డా అంగుళం స్థ‌లం కూడా వృథా క‌నిపించ‌కూడ‌దు. పైగా, అందులో నివ‌సించేవారికి సమ‌స్త ల‌గ్జ‌రీ ఇంట్లో ద‌ర్శ‌న‌మివ్వాలి. ద‌గ‌ద‌గ మెరుపుల‌తో.. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో ప్ర‌పంచ స్థాయి గృహంలో నివ‌సిస్తున్నామ‌న్న అనుభూతిని క‌ల‌గాలి. మ‌రి, మీకు ఇలాంటి వినూత్న‌మైన అద్భుత గృహంలో జీవ‌నాన్ని కొన‌సాగించాల‌న్న ఆలోచ‌న‌లుంటే.. మీరు త‌ప్ప‌కుండా ఫార్చ్యూన్ సొంతాలియా స్కై విల్లాస్‌కు విచ్చేయాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 8 కోట్ల మంది ప్ర‌జ‌ల్లో కేవ‌లం 232 మందికి మాత్ర‌మే ఇందులో నివ‌సించే అవ‌కాశాన్ని శ్రీ శ్రీనివాసా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ క‌ల్పిస్తోంది. మ‌రి, ఆ అదృష్ట‌వంతుల జాబితాలో మీరు చేరాల‌నుకుంటే.. త‌క్ష‌ణ‌మే మీరు కోకాపేట్‌లో ముస్తాబవుతున్న ఈ ఫార్చ్యూన్ స్కై విల్లాస్‌కు రావాల్సిందే.

5.2 ఎక‌రాల్లో..

సుమారు 5.2 ఎక‌రాల్లో 29 అంత‌స్తుల ఎత్తులో ఫార్చ్యూన్ స్కై విల్లాస్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో వ‌చ్చేవి నాలుగు బ్లాకులు. ప్ర‌తి బ్లాకు మ‌ధ్య 60 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. మొత్తానికి వ‌చ్చే ఫ్లాట్ల సంఖ్య‌.. కేవ‌లం 232 మాత్ర‌మే. గ‌చ్చిబౌలి ఐటీ హ‌బ్‌, ఔట‌ర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేసే హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్డు మీద ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇక్క‌డ్నుంచి మూవీ ట‌వర్స్‌, కోకాపేట్ వంటివి చేరువ‌గా ఉంటాయి. 45 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న క్ల‌బ్‌హౌజ్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుపుకుంటున్న ఈ ల‌గ్జ‌రీ ప్రాజెక్టులో ప్ర‌తి ఫ్లోరుకు రెండంటే రెండే ఫ్లాట్లు ఉంటాయి. విస్తీర్ణం కూడా 6,333 మ‌రియు 7,333 చ‌ద‌ర‌పు అడుగులే.

నాలుగు వైపులా..

ఫార్చ్యూన్ స్కై విల్లాస్ లో నివ‌సించేవారు నాలుగు వైపులా న‌గ‌రాన్ని వీక్షించొచ్చు. ఉత్త‌రంలో హైదరాబాద్ ఐటీ హ‌బ్‌, ఆర్థిక జిల్లా ద‌ర్శ‌న‌మిస్తుంది. ప‌శ్చిమంలో ప్ర‌శాంత‌మైన గండిపేట స‌ర‌స్సు ప‌ర‌శింప‌జేస్తుంది. తూర్పులో క‌ళ్ల ముందే హైద‌రాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరు సాక్షాత్క‌రిస్తుంది.
ద‌క్షిణంలో గండిపేట్‌, ఉస్మాన్ సాగ‌ర్ స‌ర‌స్సు ప‌రివాహ‌క ప్రాంతం క‌నిపిస్తుంది. అంటే, భ‌విష్య‌త్తులోనూ ఆయా స్థ‌లం ఖాళీగానే ఉంటుందన్నమాట.

ప్ర‌తిరోజూ మ‌ధురానుభూతి..

Sri Srinivasa Constructions

ఫార్చ్యూన్ స్కై విల్లాలోకి అడుగుపెట్ట‌గానే చాలు.. ప‌చ్చ‌టి ప‌రిస‌రాలు మీకు స్వాగ‌తం ప‌లుకుతాయి. కారు దిగి అలా విశాల‌మైన విల్లాలోకి అడుగు పెడుతుంటే చాలు.. మీ రోజువారి చికాకులు దూర‌మై ప్ర‌శాంత‌త నెల‌కొంటుంది. ఎంతో గ్రాండ్‌గా రూపుదిద్దుకున్న ప్ర‌వేశ‌మార్గం మిమ్మ‌ల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ప్ర‌తి బ్లాకులో నాలుగు లిఫ్టుల్ని ఏర్పాటు చేశారు. విజిట‌ర్ల కోసం ఒక‌టి, నివాసితుల కోసం ఒక స‌ర్వీస్ ఎలివేట‌ర్‌, రెండు ప్రత్యేకమైన లిఫ్ట్‌ల‌ను అమ‌ర్చారు. ఎనిమిది అడుగులున్న మీ ఇంటి ప్ర‌ధాన ద్వారం మిమ్మ‌ల్ని ఎంతో సాద‌రంగా ఇంట్లోకి ర‌మ్మ‌ని పిలుస్తోంది. ఒక‌ప్పుడు మీరు క‌ల‌గా భావించింది.. ఇప్పుడు వాస్త‌వంగా మారి.. మీరు కోరుకున్న క‌ల‌ల గృహంలోకి అడుగుపెట్టే అవ‌కాశాన్ని శ్రీ శ్రీనివాసా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ క‌ల్పిస్తోంది.

ఎనిమిది అడుగుల ఎత్తైన ఫ్రెంచ్ తలుపులు మరియు అంతర్గత తలుపులు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. గొప్ప విష‌యం ఏమిటంటే.. సుమారు 70 శాతం అద్దాల‌తో డిజైన్ చేసిన ఈ గృహంలో ఇటుక‌ల్ని వినియోగించింది ముప్ప‌య్ శాత‌మే. దీని వ‌ల్ల ఇంట్లోకి స‌హ‌జ‌సిద్ధ‌మైన వెలుతురు ధారాళంగా ప్ర‌వేశిస్తుంది. మీ గృహం విదేశీ గృహాల్ని త‌లపిస్తుంది. లివింగ్ రూములో 31/8 అడుగుల లివింగ్ రూము కిటికీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా నిలుస్తుంది. 11.4 అడుగుల ఎత్తు గ‌ల సీలింగ్ మీ ఇంటి గొప్ప‌త‌నాన్ని సూచిస్తోంది. వీఆర్‌వీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అదనపు ఖర్చుతో వస్తుంది. మొత్తానికి, రాజ‌భ‌వ‌నాన్ని త‌ల‌పించే రీతిలో ఇంటిని సంస్థ డిజైన్ చేసింది.

విశాల‌మైన స్థ‌లం కావాల‌ని కోరుకునేవారికి సంస్థ ల‌గ్జ‌రీ గృహాల్ని డిజైన్ చేసింది. ప్రతి ఫోర్‌ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ 6333-7333 చ‌ద‌ర‌పు అడుగుల్లో విలాస‌వంతంగా నిర్మిస్తోంది. ప్ర‌తి ఇల్లూ ఓ వ్య‌క్తిగ‌త నివాసంగా క‌నిపిస్తుంది. ఒక్క మాస్ట‌ర్ బెడ్‌రూమే 700 చ‌ద‌ర‌పు అడుగుల్లో డిజైన్ చేశారు. ప్ర‌తి ఫ్లాటులో ప్ర‌త్యేకంగా స‌ర్వంట్ క్వార్ట‌ర్ ని ఏర్పాటు చేశారు. హైఎండ్ బాత్‌రూము ఫిట్టింగుల‌తో బాత్రూముల్ని గ్లామ‌ర్ రూములుగా డిజైన్ చేశారు. డ్రోన్ బోష్‌, విట్రా గ్లోబో, సైర‌స్ వంటి విదేశీ బ్రాండ్ల‌ను ఇందుకోసం వినియోగిస్తారు. ఇంట్లో ఉన్న‌ప్పుడు మీ చిన్నారుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపేందుకు విశాలంగా చిల్డ్ర‌న్ బెడ్రూమ్‌ని తీర్చిదిద్దారు. డైనింగ్ స్పేస్‌ను విశాలంగా.. 23 అడుగుల డ‌బుల్ హైట్ బాల్క‌నీల్ని డిజైన్ చేశారు. వంట చేసే క‌ళ‌ను పెంపొందించుకోవ‌డంతో పాటు ప్ర‌త్యేకంగా వంట‌కాల్ని ఆస్వాదించేందుకు విశాలమైన డ్రై కిచెన్ మరియు వెట్ కిచెన్‌కు స్థానం క‌ల్పించింది.

Sri Srinivasa Constructions

ఓపెన్ జిమ్ కాన్సెప్టు..

స్కై విల్లాస్ ప్రాజెక్టులోని ప్రతి అంగుళాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులోని డ్రైవ్ వే, ల్యాండ్ స్కేప్ ఏరియా, గార్డెన్లు, సిట్టింగ్ ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాటర్ బాడీస్, సీటింగ్ ఏరియాను మనసు పెట్టి డిజైన్ చేశారు. స్కై విల్లాస్ లో నివసించే పెద్దలకూ ఉపయోగపడే విధంగా ఓపెన్ జిమ్ కాన్సెప్టును ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. అంటే, ఉదయం మరియు సాయంత్రం వాకింగ్ చేసేవారు ఎంచక్కా ఓపెన్ జిమ్ లో ఎక్సర్ సైజు చేసుకోవచ్చన్నమాట.

క్లబ్ హౌజ్ ప్రత్యేకతే వేరు..

ఫార్చ్యూన్ స్కై విల్లాస్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో నివసించే 232 కుటుంబాల కోసమే ప్రత్యేకంగా 45 వేల చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ ని డిజైన్ చేశారు. ఆరు అంతస్తుల ఎత్తులో డెవలప్ చేసిన ఆధునిక సౌకర్యాలు ప్రతిఒక్కర్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ఫైవ్ స్టార్ హోటల్ ని తలపించే రీతిలో లాబీ ఏరియాను తీర్చిదిద్దుతారు. మల్టీపర్పస్ హాల్లో బర్త్ డే వంటివి సెలబ్రేట్ చేసుకోవచ్చు. వృత్తి, వ్యాపార నిమిత్తం ఎలాంటి సమావేశాల్ని అయినా ఇందులోని కాన్ఫరెన్సు రూములో నిర్వహించుకోవచ్చు. మినీ థియేటర్లో బంధుమిత్రులతో కలిసి నచ్చిన సినిమాల్ని చూడొచ్చు. ఇండోర్ టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్ లో నచ్చినంత సేపు హాయిగా జలకాటలు ఆడొచ్చు. ఆవరణలో అభివ్రుద్ధి చేసిన ల్యాండ్ స్కేప్ ని చూస్తే మనసు పులకిస్తోంది. సెంట్రల్ వాటర్ బాడీ, లిల్లీపాండ్ వంటివి చూస్తే సంతోషమేస్తుంది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియాను డెవలప్ చేస్తారు. క్రెష్ కూడా ఏర్పాటు చేస్తారు. బ్యాడ్మింటన్ కోర్టు, బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్ వంటి గేమ్స్ ఎంచక్కా ఆడుకోవచ్చు. ఇంటికొచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా గెస్ట్ రూములున్నాయి. యోగా రూమ్, లైబ్రరీ వంటి వాటికోసం స్థానం కల్పించారు. పెద్దల కోసం ప్రత్యేకంగా గదిని కేటాయించారు. మోడ్రన్ జిమ్, యాంఫీ థియేటర్, సీటింగ్ స్పేసెస్, కేఫ్టీరియా వంటివి ప్రతిఒక్కర్ని ఆకట్టుకుంటాయి.

క్ల‌బ్ హౌజ్ గ్రౌండ్ ఫ్లోరు

  • రిసెప్ష‌న్ విత్ వెయిటింగ్ లాంజి
  • టెంప‌రేచ‌ర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్‌
  • మ‌ల్టీప‌ర్ప‌స్ హాల్‌

ఫ‌స్ట్ ఫ్లోరు

  • వెయిటింగ్ లాంజి
  • జిమ్‌
  • కాన్ఫ‌రెన్స్ రూమ్స్‌
  • యోగా/ఏరోబిక్స్ రూమ్‌
  • క్రెష్‌

సెకండ్ ఫ్లోర్‌

బ్యాడ్మింట‌న్ కోర్టు
స్వ్కాష్ కోర్టు
హోమ్ థియేట‌ర్‌
ఇండోర్ గేమ్స్‌

థ‌ర్డ్ ఫ్లోర్‌

ఇండోర్ గేమ్స్‌
కార్డ్స్ రూమ్‌

ఫోర్త్ ఫ్లోర్‌

  •  వెయిటింగ్ లాబీ
  • స్పా/సెలూన్‌
  • లైబ్ర‌రీ
  • గెస్ట్ బెడ్‌రూములు

టెర్ర‌స్‌

  • స్విమ్మింగ్ పూల్‌
  • ఔట్ డోర్ సీటింగ్‌
  • బార్‌బీక్యూ/కేఫ్‌టీరియా
  • ఇండోర్ సీటింగ్ స్పేసెస్‌

5 నుంచి 15 నిమిషాల్లో..

ఫార్చ్యూన్ స్కైవిల్లాస్ ఎంత హాట్ లొకేష‌న్‌లో ఉందంటే.. ఇక్క‌డ్నుంచి ఐదు నుంచి ప‌దిహేను నిమిషాల్లో ఎక్క‌డికైనా చేరుకోవ‌చ్చు.

  •  గ‌చ్చిబౌలి ఐటీ హ‌బ్‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌
  • ఓఆర్ఆర్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు
  • అంత‌ర్జాతీయ స్కూళ్లు
  • సీబీఐటీ, ఎంజీఐటీ వంటి ఇంజినీరింగ్ కాలేజీలు,
  • ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన‌ ఐఎస్‌బీ
  • షెర‌టాన్‌, హ‌య‌త్ వంటి ఫైవ్‌స్టార్ హోట‌ళ్లు
  • శాండ్‌విచో, ఫిష‌ర్‌మ్యాన్ వార్ఫ్‌, గ్లాస్ ఆనియ‌న్స్ వంటి రెస్టారెంట్లు
  • గోల్కోండ రిసార్ట్స్
  • కాంటినెంటెల్‌, కేర్‌, ఏఐజీ వంటి ఆస్ప‌త్రులు
  • పుల్లెల గోపిచంద్ అకాడ‌మీ, బౌల్డ‌ర్ హిల్స్ గోల్ఫ్ కోర్సు వంటి స్పోర్ట్స్ అకాడ‌మీలు.
  •  గండిపేట్ (120 అడుగుల రోడ్డు), శంక‌ర్‌పల్లి రోడ్డు (150 అడుగుల రోడ్డు) కు మ‌ధ్య‌లో ఈ ప్రాజెక్టు ఉంది. దీంతో నార్సింగి జంక్ష‌న్‌, గోల్డ‌న్ మైల్ రోడ్డు, మూవీ ట‌వ‌ర్స్ రోడ్డుకు సుల‌భంగా చేరుకోవ‌చ్చు.

(బాక్స్‌)

పేరు: ఫార్చ్యూన్ స్కై విల్లాస్
ప్రాంతం: కోకాపేట్
స్థ‌ల విస్తీర్ణం: 5.2 ఎక‌రాలు
ఫ్లాట్ల సంఖ్య‌: 232
ఫ్లాట్ల విస్తీర్ణం: 6333- 7333 చ‌.అ.
స్ట్ర‌క్చ‌ర్‌: 2 సెల్లార్లు + జి+ 28 అంత‌స్తులు
యూనిట్ సైజు: 4 బీహెచ్‌కే
క్ల‌బ్ హౌస్ విస్తీర్ణం: 45 వేల చ‌.అ.

అద్భుత‌మైన రెస్పాన్స్‌..

హైద‌రాబాద్‌లో ప్ర‌ప్ర‌థ‌మంగా అధిక విస్తీర్ణం గ‌ల ఫ్లాట్ల‌కు శ్రీకారం చుట్టాం. విశాల‌మైన ఫ్లాట్లు.. ల‌గ్జ‌రీని మించిన స‌దుపాయాలు కావాల‌ని కోరుకునేవారి కోసం కోకాపేట్‌లో ఆరంభించిన స్కై స్క్రాప‌ర్‌లో 6333 మరియు 7333 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ల‌ను డిజైన్ చేశాం. సాధార‌ణంగా రెండు, మూడు అంత‌స్తుల ఎత్తులో క‌ట్టే విల్లాలో.. ఇంతింత భారీ విస్తీర్ణం ఉంటుంది. కానీ, ఈ ప్రాజెక్టులో క‌ట్టే ఫ్లాట్లు.. విల్లాల‌ విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. అందుకే, వీటికి స్కై విల్లాస్ అని పేరు పెట్టాం. మేం ఊహించిన‌ట్లుగానే మా ఈ ప్రాజెక్టుకు బ‌య్య‌ర్ల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే 75 శాతం ఫ్లాట్ల‌ను విక్ర‌యించాం. ఇదే స్ఫూర్తితో మ‌రింత అధిక విస్తీర్ణంలో ఫ్లాట్ల‌ను క‌ట్టేందుకు అడుగు ముందుకేస్తున్నాం.- వి. కృష్ణారెడ్డి, మేనేజింగ్ పార్ట‌న‌ర్‌, శ్రీ శ్రీనివాసా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles