అద్భుతమైన ప్రాజెక్టుల్ని ఆవిష్కరించి.. గృహయజమానులకు ఎక్కడ్లేని సంతోషం కలిగించడం శ్రీ శ్రీనివాసా కన్స్ట్రక్షన్ కి వెన్నెతో పెట్టిన విద్య. ఈ సంస్థ కట్టే ప్రాజెక్టులను చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుల్ని ఆవిష్కరించిన ఈ సంస్థ.. తాజాగా సోమాజిగూడలోని రాజ్‌భవన్ పక్కనే జీవీకే స్కై సిటీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి కొనుగోలుదారులకు హ్యాండోవర్ చేసింది.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టుల్ని డెవలప్ చేస్తందున్న ఖ్యాతినార్జించింది శ్రీ శ్రీనివాసా కన్స్ట్రక్షన్స్. ఈ సంస్థ రాజ్‌భవన్ రోడ్డులో డెవలప్ చేసిన స్టన్నింగ్ ప్రాజెక్టే.. జీవీకే స్కై సిటీ. నగరం నడి బొడ్డులో సాగర్ అందాల్ని ఆస్వాదించేలా.. సుమారు 3.2 ఎకరాల్లో నాలుగు బ్లాకుల్ని డెవలప్ చేసింది. ఇందులో పదిహేడు అంతస్తులవి 98 ఫ్లాట్లను విజయవంతంగా బయ్యర్లకు హ్యాండోవర్ చేసింది. ఒక టవర్‌లో అయితే ఏకంగా డ్యూప్లే ఫ్లాట్లకే స్థానం కల్పించారు. ఇందులోని ఒక్కో ఫ్లాట్ బిల్టప్ ఏరియా.. సుమారు 5,555 చదరపు అడుగుల్లో డెవలప్ చేశారు. ముప్పయ్ వేల చదరపు అడుగుల్లో ఫైవ్ లెవెల్ క్లబ్ హౌజ్‌ను తీర్చిదిద్దింది. మొత్తానికి, హైదరాబాద్‌లో ఎక్కడ ప్రాజెక్టుల్ని ఆరంభించినా.. బయ్యర్లకు సక్సెస్‌ఫుల్‌గా అందజేస్తుందనే ట్రాక్ రికార్డును శ్రీ శ్రీనివాసా కన్స్ట్రక్షన్స్ సొంతం చేసుకుంది.
ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తుల మేధోమధనం నుంచి ఆవిష్కృతమైన ప్రాజెక్టే.. జీవీకే స్కై సిటీ. ప్రపంచస్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా.. అంతర్జాతీయ డిజైన్లు ప్రతిబింబించేలా.. ఊహించిన దానికంటే మెరుగైన రీతిలో.. నిర్మాణాన్ని విజయవంతంగా బయ్యర్లకు శ్రీ శ్రీనివాసా కన్స్ట్రక్షన్స్ హ్యాండోవర్ చేసింది. ఇందులో నివసించే వారికి.. కోర్ హైదరాబాద్‌లో నివసిస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. రాజ్ భవన్ పక్కనే డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టు బాల్కనీలోకి వెళితే… ఎంచక్కా హుస్సేస్ సాగర్ లేక్‌ను వీక్షించొచ్చు. అంతేకాదు, ఇక్కడ్నుంచి షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, బొటిక్ స్టోర్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు, జలవిహార్, లుంబిని పార్కులకు ఐదు, పది నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తానికి, ఇటీవల కాలంలో.. కోర్ హైదరాబాద్‌లో సక్సెస్ఫుల్ గా బయ్యర్లకు హ్యాండోవర్ చేసిన ప్రాజెక్టు ఏదైనా ఉందా అంటే.. జీవీకే స్కైసిటీ అని ఎవరైనా చెప్పాల్సిందే.