poulomi avante poulomi avante

ప‌లు రియ‌ల్ సంస్థ‌ల‌కు.. రెరా నోటీసులు జారీ

  • ఆర్‌జే గ్రూపుతో పాటు మ‌రికొన్ని సంస్థ‌ల‌కు నోటీసులు
  • రెరా అథారిటీ క్షేత్ర ప‌ర్య‌ట‌న‌లో విస్మ‌య విష‌యాలు

రెజ్ న్యూస్‌, హైద‌రాబాద్‌: రెరా అనుమ‌తుల్లేకుండా అక్ర‌మంగా ప్రీ లాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్న ప‌లు సంస్థ‌ల‌పై తెలంగాణ రెరా అథారిటీ  సీరియ‌స్ అయ్యింది. తొలుత ఫేస్ బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌, వాట్సాపుల్లో ప్రీ లాంచుల ఆఫ‌ర్ల ప్ర‌క‌ట‌నల్ని గుప్పిస్తున్న అన్ని సంస్థ‌ల స‌మాచారాన్ని రెరా అథారిటీ సేకరించింది. వీటి ఆధారంగా స్వ‌యంగా రెరా అథారిటీ బృందాలు క్షేత్ర స్థాయిలో త‌నిఖీల్ని నిర్వ‌హిస్తున్నాయి. ఈ మేర‌కు దాదాపు యాభై సంస్థ‌ల కార్యాల‌యాలు, లేఅవుట్లు, ప్రాజెక్టుల వ‌ద్ద‌కు చేరుకుని పూర్తి వివ‌రాల్ని స్వ‌యంగా సేకరిస్తున్నాయి. వీటి ఆధారంగా రెరా అథారిటీ పలు కంపెనీలకు నోటీసులను జారీ చేసింది.

కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు రెరా అనుమ‌తి తీసుకోకుండా.. రెరా అనుమ‌తి గ‌ల ఏజెంట్ల‌తో ప్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నార‌ని తెలుసుకుని రెరా అథారిటీ విస్మయం చెందిన‌ట్లు స‌మాచారం. మ‌రికొంద‌రు కేవ‌లం హెచ్ఎండీఏకు ద‌ర‌ఖాస్తు చేసి త‌క్కువ రేటుకు ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నార‌ని క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో తెలుసుకుంది. ఇంకొంద‌రేమో, రెరా అనుమ‌తి వ‌చ్చాక‌ రేటు పెరుగుతుంద‌నే ప్ర‌చారాన్ని కూడా నిర్వ‌హిస్తున్నార‌ని స్వ‌యంగా గ్ర‌హించింది. ఇంకొంద‌రు ఇప్పుడైతే త‌క్కువ‌ని.. కొద్ది రోజుల‌య్యాక ఇంత త‌క్కువ‌కు దొర‌క‌ద‌నే ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నార‌ని క్షేత్ర ప‌ర్య‌ట‌న‌లో తెలుసుకుంది. మొత్తానికి, ఇలాంటి రియ‌ల్ సంస్థ‌ల వ‌ల్ల అమాయ‌కులు మోస‌పోయే ప్ర‌మాదం ఉంది కాబ‌ట్టి,  త‌క్కువ రేట‌నే అంశాన్ని చూసి ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని రెరా అథారిటీ సూచిస్తోంది.

ఆర్‌జే గ్రూపు దారుణం..

ఆర్ జే గ్రూపు అనే సంస్థ ఘట్ కేసర్లోని యమ్నంపేట్లో బ్లిస్ హైట్స్ అనే రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో ఫ్లాట్లను విక్రయిస్తోందని తెలంగాణ రెరా అథారిటీ నోటీసుకు వచ్చింది. అదేవిధంగా పటాన్ చెరులోని కర్దనూరు రోడ్డులో జై వాసవి ఓఆర్ఆర్ హైట్స్ అనే నిర్మాణాన్ని రెరా అనుమతి లేకుండా అడ్వర్టయిజ్మెంట్ చేయడంతో పాటు యూనిట్లను అమ్ముతున్నదని తెలుసుకున్నది. తెలంగాణ రెరా అథారిటీ నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో 2017 జనవరి ఒకటో తేది నుంచి.. 500 గజాలు లేదా అంత‌కుమించిన విస్తీర్ణంలో అభివృద్ధి చేసే వెంచర్ అయినా ఎనిమిది కంటే ఎక్కువ ఫ్లాట్లను నిర్మించాలనుకున్నా.. రెరా నిబంధనలు సెక్షన్ 1 (2) ప్రకారం తెలంగాణ రెరా అథారిటీలో నమోదు చేసుకోవాలి. ఒక ప్రమోటర్.. ప్లాటు లేదా ఫ్లాటుకు సంబంధించిన ప్రకటనల్ని విడుదల చేయాలనుకున్నా అమ్మకాల్ని చేపట్టాలనుకున్నా.. తప్పనిసరిగా రెరా చట్టం సెక్షన్ 3 (1) ప్రకారం..  అథారిటీ వద్ద అనుమతి తీసుకోవాలి.

ఆయా ప్రాజెక్టులో కొనేందుకు కొనుగోలుదారుల్ని ఆహ్వానించాలన్నా ఇది తప్పనిసరి. కానీ, ఈ నిబంధనల్ని పాటించకుండా.. రెరా అనుమతి లేకుండా ఈ సంస్థ యూనిట్లను విక్రయిస్తోందని తెలుసుకుంది. దీంతో ఈ సంస్థకు నోటీసును జారీ చేసింది. రెరా చట్టం సెక్షన్ 59 ప్రకారం.. మొత్తం ప్రాజెక్టు విలువలో పది శాతం సొమ్మును జరిమానాగా ఎందుకు విధించకూడదో తెలియజేయాలని నోటీసునిచ్చింది. ఇదే విధంగా, పలు ఇతర సంస్థలకు రెరా అథారిటీ నోటీసుల్ని జారీ చేసింది. మరి, ఆ రియల్టర్ల మీద ఎంత జరిమానా వసూలు చేస్తారో?

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles