poulomi avante poulomi avante

ప్లాటుకు 90 శాతం రుణం

న‌గ‌రంలో ఎప్ప‌టికైనా ఓ సొంతిల్లు ఉండాల‌నేది చాలామంది కోరిక‌. అందుకే, క‌ష్ట‌ప‌డి సంపాదించి పొదుపు చేసిన సొమ్ముతో కొనాల‌ని భావిస్తారు. తన జీవితకాలంలో పెట్టే అతిపెద్ద పెట్టుబడి ఇంటి పైనే. ఎక్కువ మొత్తంలో తీసుకునే రుణం కూడా గృహం కోసమే. ఇక ఇంటిమీద పెట్టే పెట్టుబడి ఒకసారితోనే అయిపోదు. కాలానుగుణంగా మార్పులు, విస్తరణ తదితరాల రూపంలో ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టక తప్పదు. అదే సమయంలో ఇంటి కోసం సగటు వేతనజీవి లేదా సాధారణ వ్యాపారి ఒకేసారి అంత భారీ మొత్తం వెచ్చించే అవకాశాలు ఉండవు. ఇలాంటివారి కోసమే పలు బ్యాంకులు దీర్ఘకాలిక గృహరుణాలు ఆఫర్ చేస్తున్నాయి. అసలు ఎన్ని రకాల గృహరుణాలు అందుబాటులో ఉన్నాయి? ఎవరికి ఏ ప్రాతిపదికన అవి లభిస్తాయి వంటి వివరాలు ఓ లుక్కేద్దామా..?

గృహరుణం ఏ ప్రాతిపదికన ఇస్తారంటే…

1. మీ వేతనం లేదా మీ వ్యాపారం వార్షిక టర్నోవర్
2. మీ వయసు
3. ప్రస్తుతం మీరు చేసిన రుణాలు
4. మీ క్రెడిట్ స్కోర్
5. మీరు కొనాలనుకునే ప్రాపర్టీ. అలాగే దాని విలువలో 20శాతం చెల్లించే స్తోమత మీరు కలిగి ఉన్నారా అనే విషయం.
6. ప్రాంతం. ప్రాపర్టీ అనుమతులు తదితర అంశాలు

ఫిక్స్ డ్ వడ్డీనా.. ఫ్లోటింగా?

గృహరుణం తీసుకునేటప్పుడే ఎలాంటి వడ్డీ రేటు కావాలనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్ డ్ వడ్డీ రేటా లేక ఫ్లోటింగ్ వడ్డీ రేటా అనేది రుణం తీసుకునే సమయంలోనే నిర్ధారించుకోవాలి. మీ ఆర్థిక స్థితిగతులు, అవసరాలు ఇతరత్రా అన్ని అంశాలనూ బేరీజు వేసుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు వడ్డీ రేట్ల మధ్య తేడాలేంటో చూద్దాం..

ఫ్లోటింగ్ వడ్డీ రేటును ఎప్పుడు ఎంపిక చేసుకోవాలంటే..

– వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని మీరు భావిస్తున్నప్పుడు
– వడ్డీ రేట్లు ఎలా మారతాయనే విషయంపై సరైన అంచనా లేనప్పుడు
– సమీప భవిష్యత్తులో మీ వడ్డీరేట్లపై కాస్త పొదుపు చేసుకోవాలని అనుకున్నప్పుడు

ఫిక్స్ డ్ వడ్డీ రేటును ఎప్పుడు ఎంచుకోవాలంటే..

– మీరు ఎంచుకున్న ఈఎంఐ చెల్లించడంలో ఎలాంటి సమస్యా లేనప్పుడు
– వడ్డీ రేట్లు పెరుగుతాయని మీరు భావిస్తున్నప్పుడు
– వడ్డీ రేట్లు తగ్గినా, పెరిగినా మీరు ఒకే వడ్డీ రేటు చెల్లించాలని అనుకున్నప్పుడు

ఒకవేళ ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనే విషయంలో సరైన నిర్ణయానికి రాలేకపోతే, కాంబినేషన్ లోన్ ఎంచుకోవచ్చు. ఇందులో ఫిక్స్ డ్ వడ్డీ, ఫ్లోటింగ్ వడ్డీ రెండూ ఉంటాయి. నిర్దేశిత రుసుం చెల్లించి ఫిక్స్ డ్ నుంచి ఫ్లోటింగ్ వడ్డీకి, ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్ డ్ రేటుకు మారొచ్చు. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీ ఉన్న నేపథ్యంలో ఫిక్స్ డ్ వడ్డీ రేటు ఎంచుకోవచం ఉత్తమం. అయితే, ఈ విషయంలో మీదే తుది నిర్ణయం.

గృహరుణాలు.. వాటి రకాలు..

ఇంటి కొనుగోలు రుణం: కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ఈ రుణం ఇస్తారు. కొత్త ఫ్లాట్ లేదా రో హౌస్, ప్రైవేటు డెవలపర్లు నిర్మించిన బంగ్లా వంటివన్నీ ఇందులోకి వస్తాయి. అలాగే రీసేల్ ఇంటిని కొనుగోలు చేయడానికి కూడా ఈ రుణం వినియోగించుకోవచ్చు. ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన ఇళ్లతోపాటు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని గృహాలను కొనుగోలు చేసుకోవచ్చు.
నిర్మాణ రుణం: డెవలప్ అథార్టీ ఇచ్చి ప్లాట్ లేదా ఫ్రీ హోల్డ్ లేదా లీజ్ హోల్డ్ ప్లాట్ లో నిర్మాణం కోసం ఈ రుణం ఇస్తారు. అయితే, ఆ ప్లాట్ కొనుగోలు చేసి ఏడాది దాటకూడదు. ఒకవేళ ప్లాట్ ఖరీదు లోన్ లో కలపకపోతే.. ఇంటి నిర్మాణానికి అయ్యే అంచనాను మాత్రం రుణం ఇవ్వడానికి పరిగణనలోకి తీసుకుంటారు.
గృహరుణం బదిలీ (బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్): మీరు తీసుకున్న గృహరుణానికి సంబంధించి ప్రస్తుతం మిగిలి ఉన్న మొత్తాన్ని మరో బ్యాంకు లేదా గృహరుణ సంస్థకు బదిలీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీ రేటు కంటే ఇతర బ్యాంకు లేదా గృహరుణ సంస్థ ఆఫర్ చేసిన వడ్డీ రేటు తక్కువ ఉన్నప్పుడు ఆ రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఆ రుణంలో మిగిలి ఉన్న మొత్తాన్ని సదరు బ్యాంకు లేదా సంస్థ చెల్లించి మీ గృహరుణాన్ని టేకోవర్ చేస్తుందన్నమాట.
ఇంటికి మ‌ర‌మ్మ‌తుల రుణం: కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులు, ఇతరత్రా అంశాల కారణంగా ఇంటి ప్రభ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇంటికి సంబంధించి మరమ్మతులు లేదా నవీకరణ వంటివి చేయించుకునేందుకు కూడా రుణాలు ఇస్తారు. టైల్స్ వేయించుకోవడం, ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్, పెయింటింగ్ వంటి కోసం ఈ రుణం తీసుకోవచ్చు.
ఇంటి విస్తరణ రుణం: మీ ఇంటిని విస్తరించుకోవాలంటే ఈ రుణం తీసుకోవచ్చు. అంటే, ప్రస్తుతం ఉన్న గదులు లేదా అంతస్తులు సరిపోనప్పుడు అదనపు గదులు లేదా అంతస్తుల నిర్మాణం కోసం బ్యాంకులు ఈ రుణమిస్తాయి.
ప్లాట్ రుణాలు: ఇంటి నిర్మాణం కోసమే కాదు.. ప్లాట్ కొనుగోలుకు కూడా రుణాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త ప్లాట్ (స్థలం) లేదా రీసేల్ ప్లాట్ కొనుగోలుకు, ప్లాట్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ కి ఈ రుణం తీసుకోవచ్చు. సాధారణంగా రుణదాతలు ప్లాట్ ఖరీదులో 85శాతం నుంచి 90 శాతం మాత్రమే రుణమిస్తాయి. మిగిలిన మొత్తాన్ని దరఖాస్తుదారే భరించాల్సి ఉంటుంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles