సగటు మనిషి తన జీవితంలో తీసుకునే అతిపెద్ద లోన్ ఇంటి రుణమే. మొత్తంపరంగానే కాకుండా కాలవ్యవధిపరంగా చూసినా ఇదే అతిపెద్ద రుణం. ఎందుకంటే గృహరుణం అనేది కనీసం 15 ఏళ్లు ఉంటుంది. ఇంటి రుణం తీసుకున్నదాని కంటే దాదాపు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఓ ప్రాపర్టీ మన సొంతమవుతుంది కాబట్టి ఇది ఉత్తమ రుణమే అని చెప్పొచ్చు. మరి ప్రస్తుతం ఏ బ్యాంకు వడ్డీ రేటు ఎలా ఉంది? ప్రాసెసింగ్ ఫీజు వివరాలేమిటి చూద్దామా?
లోన్ మొత్తం రూ.30 లక్షలు.. కాల వ్యవధి (20 సంవత్సరాలు అనుకుంటే ఈఎంఐ ఇలా అవుతుంది)
బ్యాంకు పేరు వడ్డీ రేటు(%) ఈఎంఐ (రూ.లలో) ప్రాసెసింగ్ ఫీజు
సిటీ యూనియన్ బ్యాంకు 8.25-10.50 25,562-29,951 0.20%-0.35’ + జీఎస్టీ
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8.35-10.90 26,283-30,762 0.25% (గరిష్టంగా రూ.25వేలు)
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.35-9.50 26,283-27,964 0.50% (గరిష్టంగా రూ.20వేలు)+జీఎస్టీ
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.35-10.75 26,283-30,457 0.50% (గరిష్టంగా రూ.15వేలు)+జీఎస్టీ
సౌత్ ఇండియన్ బ్యాంక్ 8.35-11.44 26,283-31,869 0.50% (గరిష్టంగా రూ.10వేలు)+జీఎస్టీ
బ్యాంక్ ఆఫ్ బరోడా 8.40-10.60 25,845-30,153 నిల్. షరతుల ప్రకారం ఒక్కో ప్రాపర్టీకి రూ.10వేలు రికవరీ)
బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.40-10.85 25,845-30,660 0.25%(కనీసం రూ.1500 గరిష్టం రూ.20వేలు) వ్యక్తులకు మాత్రమే
కెనరా బ్యాంక్ 8.40-11.25 25,845-31,478 0.50% (కనీసం రూ.1500 గరిష్టం రూ.10వేలు)
ఇండియన్ బ్యాంక్ 8.40-10.35 25,845-29,650 0.25% వరకు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 8.40-10.60 25,845-30,153 0.50% వరకు (గరిష్టంగా రూ.25వేలు)+జీఎస్టీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.40-10.10 25,845-29,150 0.35%(కనీసం రూ.2500 గరిష్టం రూ.15వేలు)
నేషనల్ బ్యాంక్ 8.40-11.00 25,845-30,966 –
ఐడీబీఐ బ్యాంక్ 8.45-12.25 25,940-33,557 రూ.5వేల నుంచి రూ.15వేలు. పీఎంఈవై ఇళ్లకు ఇన్వార్డ్ బదిలీకి ఫీజు లేదు
యూకో బ్యాంక్ 8.45-12.60 25,940-34,296 0.50% (కనీసం రూ.1500, గరిష్టం రూ.15వేలు)
పంజాబ్ సింధ్ బ్యాంక్ 8.55-10.00 26,130-28,951 ప్రాసెసింగ్ ఫీజు లేదు