poulomi avante poulomi avante

అమ్ముడవ్వని ఇళ్లు.. 12 వేలు

హైదరాబాద్లో అమ్ముడుకాని ఇళ్ల సంఖ్య దాదాపు పన్నెండు వేలకు చేరుకుంది. అంతా సవ్యంగా సాగితే.. వీటిని విక్రయించేందుకు ఎంతలేదన్నా మరో 10 నెలలైనా పడుతుంది. కరోనా థర్డ్ వేవ్ రాకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ, కరోనా వస్తే.. మరికొంత సమయం పట్టే అవకాశముంది.

 

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఐటీ రంగంపైనే ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐటీ సెక్టార్ బావుంటే అదే స్థాయిలో రియల్ ఊపు కనిపిస్తుంది. ఐటీ డీలా పడితే రియల్ కూడా కుదేలవుతుంది. అమెరికాలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ఇక్కడ ఇళ్ల డిమాండ్ తగ్గిపోయింది. అనంతరం గత దశాబ్దంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ.. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో రియల్ రంగం కాస్త ప్రభావితమైంది. ఇక ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి ఎలాంటి సమస్యలూ లేకుండా సాగుతోంది. అప్పటి నుంచి క్రమంగా హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్ అభివృద్ధి చెందింది. అయితే, సరిపడినంతగా ఇళ్లు లేకపోవడం, పరిమితమైన అమ్మకాల వల్ల ధరలు పెరిగాయి. కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఇళ్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ సంస్థ అధ్యయనం చేసిన 8 నగరాల్లో.. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కోవిడ్ సమయంలో కూడా ఇళ్ల ధరలు తగ్గలేదని వెల్లడైంది.

2021 మొదటి ఆరునెలల్లో హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి ఇదీ..

హౌసింగ్ యూనిట్స్ ప్రారంభం 16,712
హౌసింగ్ యూనిట్స్ అమ్మకాలు 11,974
సగటు ధర రూ.50,803 (స్క్వేర్ మీటర్)
రూ.4,720 (స్క్వేర్ ఫీట్)
విక్రయం కాని ఇళ్ల సంఖ్య 11,918
ఎన్నిక్వార్టర్లలో అమ్మవచ్చు? 3.2

  •  2020 మొదటి ఆరు నెలలతో పోలిస్తే 2021 మొదటి ఆరు నెలల్లో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ లో రికార్డు స్థాయి వృద్ధి నమోదైంది. ఇళ్ల అమ్మకాలు ఏకంగా 150 శాతం పెరిగాయి. ఇందులో కూడా 63 శాతం వెస్ట్ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి.
  • హైదరాబాద్ మొత్తంలో కొత్త నిర్మాణాలు 278 శాతం మేర పెరగ్గా.. వెస్ట్ హైదరాబాద్ 312 శాతం నిర్మాణాలతో ప్రథమ స్థానంలో నిలిచింది.
  • కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం ఎక్కువ కావడంతో విశాలమైన లేదా పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరిగింది.
  • హైదరాబాద్ సగటు రెసిడెన్షియల్ ధరలు ఒక శాతం మేర పెరిగాయి. 2020 మొదటి అర్ధభాగంలో చదరపు అడుగుకు రూ.4,673 ఉన్న ధర.. 2021 మొదటి అర్ధభాగంలో రూ.4,720కి చేరింది.
  • గత ఐదారేళ్లలో హైదరాబాద్ దేశంలోనే కీలకమైన ఐటీ హబ్ గా అవతరించింది. పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాల ఏర్పాటుకు రావడంతో అందరి చూపూ హైదరాబాద్ వైపే పడింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ఇతర రంగాలపై దృష్టి పెట్టడంతో అవి కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా రాష్ట్రం పెట్టుబడులకు కీలకమైన గమ్యస్థానంగా మారింది. పైగా ఐటీ, పరిశ్రమల విషయంలో సర్కారు విధానాలు ఆకట్టుకునే విధంగా ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సమీప భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles