ప్రస్తుతం దేశీయ గృహ క్లీనింగ్ పరిశ్రమ రూ.2 వేల కోట్లుగా ఉందని.. వచ్చే ఐదేళ్లలో 20 శాతం వృద్ధి రేటుతో రూ.15 వేల కోట్లకు చేరుతుందని ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీ 24 సిప్స్ అంచనా వేశారు. హైదరాబాద్ మార్కెట్ సుమారు రూ.150 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఇటీవల క్లీన్‌షీల్డ్ బ్రాండ్ పేరిట క్లీనింగ్ సర్వీసెస్ విభాగంలోకి 24 సిప్స్ ప్రవేశించింది. అపార్ట్‌మెంట్లు, విల్లాల శుభ్రత, నిర్వహణ సేవలను అందించనున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటి శుభ్రత, స్వచ్చత అత్యంత కీలకంగా మారింది. గత కొన్ని నెలలుగా ప్రొఫిషనల్ క్లీనింగ్ సేవలను కోరుకునేవారి సంఖ్య 300 శాతం పెరిగిందని తెలిపారు. నివాసితుల అవసరాలను బట్టి మొత్తం ఇంటిని లేదా డ్రాయింగ్ రూమ్, బెడ్ రూమ్, వాష్ రూమ్ ఇలా కొంత భాగాన్ని కూడా శుభ్రపరుస్తామని పేర్కొన్నారు. 1,200 చ.అ. 2 బీహెచ్‌కే క్లీనింగ్ ధర రూ.4 వేల నుంచి ప్రారంభమవుతాయి. ముగ్గురు లేదా నలుగురి నిపుణులు సుమారు 4 గంటల వ్యవధిలో శుభ్రత పూర్తి చేస్తారు.