గ్రీన్ బెల్ట్ లో ఆక్రమణలకు పాల్పడిన 13 మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లపై గ్రేటర్ నోయిడా అథార్టీ కొరడా ఝుళిపించింది. వారికి రూ.1.27 కోట్ల జరిమానా విధించింది. శామ్ ఇండియా ఒలింపియా, డ్రీం విల్లే ఆర్కేడ్, గెలాక్సీ ప్లాజా, సాయా, ఆర్జా స్క్వేర్, ఈఎం బార్క్, గౌర్ సిటీ, ఎన్ఎక్సోన్, నియో టౌన్, నీరాల ఎస్టేట్ లతోపాటు బ్లూమ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు జరిమానా విధించినట్టు తెలిపింది.
వారంలోగా జరిమానా మొత్తం చెల్లించకపోతే రికవరీ సర్టిఫికెట్ జారీచేస్తామని స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆక్రమణలను వెంటనే తొలగించకపోతే చట్టపరమన చర్యలు చేపడతామని హెచ్చరించింది. చాలా హౌసింగ్ సొసైటీలలో గ్రీనరీ ఏర్పాటు కోసం కొంత స్థలాన్ని వదిలివేయాలని గ్రేటర్ నోయిడా అథార్టీ సూచించింది. అయితే, వీటని పలువురు ఉల్లంఘించినట్టు ఇటీవల చేపట్టిన డ్రైవ్ లో అధికారులు గుర్తించారు. దీంతో గ్రీన్ బెల్ట్ నిబంధనలు ఉల్లంఘించివారికి జరిమానా విధించారు.