- జూబ్లీహిల్స్‌లో ‘ఏ’ క్లాసైన నిర్మాణం
- మంత్రి డెవలపర్స్.. ‘ఏ’
- 6 ఎకరాల్లో ఎనిమిది బ్లాకులు
- ఇంటి విస్తీర్ణం.. 3195 – 12,385 చ.అ.
- ధర.. రూ.7.35 – రూ.18.45 కోట్లు
అది హైదరాబాద్‌లోనే ఖరీదైన ప్రాంతం.. ప్రపంచమంతా ఇష్టపడే ఏరియా.. అక్కడ ఇల్లుంటే జీవితం ధన్యమైనట్లేనని చాలామంది ధనవంతులు భావిస్తారు. అందుకే, ఎలాగైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆరాటపడతారు. అలాంటి వారందరి కోసం కేవలం 126 ఖరీదైన గృహాలు అందుబాటులోకి
వచ్చేశాయి. అది కూడా లొకేషన్‌పరంగా.. సెంటరాఫ్ అట్రాక్షన్ అయిన జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో. మరి, ఇంకెందుకు ఆలస్యం.. బెంగళూరుకు చెందిన మంత్రి సంస్థ నిర్మిస్తున్న ‘ఏ’ ప్రాజెక్టు వివరాల ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా..
మీరు కోరుకున్నంత వ్యక్తిగత స్వేచ్ఛ.. ధారాళమైన గాలీ.. ప్రశంసనీయమైన నివాసాలు.. తెలివైన హోమ్ ఆఫీస్.. కళాత్మక వంటగది.. ఆకర్షణీయమైన విశ్రాంతి గది.. విస్మయం కలిగించే క్లబ్ హౌస్.. మొత్తానికి, మంత్రి ఏ ప్రాజెక్టు అనేక విశిష్టతలను కలిగి ఉంది.
అసలే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు.. ఆపై వెనకాల వందల ఎకరాల కేబీఆర్ పార్కు.. ప్రాజెక్టు చుట్టూ నీళ్లు.. మధ్యలో అదిరిపోయే డిజైన్ తో కళ్లు చెదిరే అపార్ట్ మెంట్.. ఇలా, ఒకే చిరునామాలో అనేక విశిష్థతలతో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టే.. ఏ!
ఈ ప్రాజెక్టు డిజైన్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. పేరుకు తగ్గట్టే నిజంగా ఇది ‘ఏ’ క్లాస్ ప్రాజెక్టు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జర్మన్ ఆర్కిటెక్ట్ హాది టెహ్రానీ.. దీనిని డిజైన్ చేశారు. భవనం డిజైన్ నుంచి ఇంటీరియర్, ల్యాండ్ స్కేప్, ఆర్ట్ వర్క్ ఇలా ఏది చూసినా దేనికదే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
నీటి మధ్యలో ఈ ప్రాజెక్టు ఉండేలా డిజైన్ చేయడం దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఉన్నతమైన సౌకర్యాలతో, విభిన్నమైన ప్రత్యేకత సంతరించుకున్న కమ్యూనిటీలో అత్యున్నతమైన జీవనం గడపాలని భావించేవారికి మంత్రి ‘ఏ’ ప్రాజెక్టును మించింది మరొకటి లేదు.
126 మందికే అవకాశం!
పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు, హైలైఫ్ కోరుకునే ప్రముఖులు, కింగ్ సైజు ఇంట్లో జీవించాలని భావించేవారు.. మంచి జీవితం ఉండాలని భావించేవారందరికీ ఈ ప్రాజెక్టు చక్కటి చిరునామాగా మారుతుంది. కార్పొరేట్ సీఈవోలు, వ్యాపార దిగ్గజాలు, మీడియా ప్రముఖులు మరియు సామాజిక ప్రముఖులు.. ఇలా ప్రతిఒక్కరూ కోరుకునే గమ్యస్థానంగా ఈ ప్రాజెక్టు మారుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. రాజభవనాన్ని తలపించే ఐదు పడక గదుల అపార్ట్‌మెంట్‌లు ఆర్కిటెక్చర్ ఎక్సలెన్సీకి ప్రతీకగా నిలుస్తాయి. ఇందులో నివసించేవారు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించొచ్చు.