poulomi avante poulomi avante

మున్సిపల్ కమిషనర్లపై జరిమానా విధించాలి

  • అక్రమ నిర్మాణాల్ని నిర్మించిన ప్రాంతాల్లో..
  • కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులపై జరిమానా?
  • అక్రమ కట్టడాల్ని ఆరంభంలోనే ఎందుకు గుర్తించలేదు?
  • రెండు రోజుల్లో 14 అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌

రియ‌ల్ ఎస్టేట్ గురు, హైదరాబాద్: గ‌త కొంత‌కాలం నుంచి హెచ్ఎండీఏ కూల్చివేస్తున్న అక్ర‌మ క‌ట్ట‌డాల్ని చూస్తుంటే ఎవరికైనా ఆశ్చ‌ర్య‌మేయాల్సిందే. నిబంధనల్ని పాటించకుండా.. అనుమతుల్ని తీసుకోకుండా.. అక్రమంగా అపార్టుమెంట్లను కడుతుంటే.. కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్‌, విజిలెన్స్ వంటి అధికారులు ఎంత మొద్దునిద్ర‌లో ఉన్నారో అర్థ‌మ‌వుతోంది. మొద్దునిద్ర అనడం కంటే అక్రమ వసూళ్ల మత్తులో పడిపోయి.. ఎవరేం కట్టుకుంటే నాకేంటి? నా జేబు నిండుతుందా.. లేదా.. అని ఆలోచిస్తూ కాలయాపన చేయడం వల్లే ఇలాంటి అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. అనుమతి తీసుకోకుండా.. అక్రమంగా కడితే.. మున్సిపల్ అధికారులొచ్చి కూల్చివేస్తారనే భయం కలిగిస్తే చాలు.. ఇలాంటి అక్రమ నిర్మాణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

ప్రస్తుతం 133 అక్రమ నిర్మాణాల్ని కూల్చివేశామని పురపాలక శాఖ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. కాకపోతే, వీటి కూల్చివేత వల్ల జాతి సంపద ఎంత వ్యర్థమైందో అర్థం చేసుకోవచ్చు. మరి, ఇలా సహజ వనరులు వృథా కాకుండా ఉండాలంటే పురపాలక శాఖ అధికారులు అక్రమ నిర్మాణాల్ని కట్టకుండా ముందే అడ్డుకట్ట వేయాలి. ఇంత బహిరంగంగా అక్రమ కట్టడాలు కడుతుంటే కళ్లగప్పించి చూస్తున్న మున్సిపల్ అధికారుల మీద కఠిన చర్యల్ని తీసుకోవాలి. అప్పుడే, వీరంతా సక్రమంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. నిజాంపేట్లో తాజాగా రెండు అక్రమ నిర్మాణాల్ని కూల్చివేశారు. మరి, ఇవి ఎప్పుడు ఆరంభయ్యాయి? అప్పుడు కమిషనర్ ఎవరున్నారు? అక్కడి టౌన్ ప్లానింగ్ మరియు విజిలెన్స్ అధికారులకు షోకాజ్ నోటీసుల్ని జారీ చేయాలి. అనుమతులు ఆలస్యమైతే అధికారుల మీద జరిమానా విధిస్తామని పదేపదే చెప్పిన మంత్రి కేటీఆర్.. ఇలాంటి అధికారుల మీద జరిమానా ఎందుకు విధించారు? లేకపోతే, ఇలాగే అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపల్ పరిధిలోని ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతలు పారదర్శకంగానే జరుగుతున్నాయా? లేక అమ్యామ్యాలు అందుకున్న వాటిని కూల్చివేయకుండా అడ్డుకుంటున్నారా? ఈఐపీఎల్ అనే సంస్థ గత కొంతకాలం నుంచి అక్రమంగా నిర్మాణాన్ని చేపడుతున్నా.. మణికొండ మున్సిపల్ అధికారులు ఎందుకు కళ్లప్పగించి చూస్తున్నారు? ఎందుకు ఆ నిర్మాణానికి అడ్డుకట్ట వేయలేకపోయారు? బడా బిల్డర్లు కాబట్టి అమ్యామ్యాల శాతం ఎక్కువుంటుంటి కాబట్టి, అందుకే వాటి జోలికి వెళ్లలేదా? ఇలా శివార్లలో ఎంతమంది బిల్డర్లను మున్సిపల్ మరియు పురపాలక అధికారులు రక్షిస్తున్నారు? ఎందుకంటే, స్థానిక మున్సిపల్ అధికారులు చెప్పిన వాటినే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ కూల్చివేస్తుంది. అలాంటప్పుడు, వారు సరైన సమాచారం ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటీ అనే సందేహాలు పట్టిపీడిస్తున్నాయి. 

కాస్త ఆలస్యంగానైనా, అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయడం కొస మెరుపు అని చెప్పొచ్చు. కాకపోతే, మళ్లీ కొంత కాలం తర్వాత ఆయా కట్టడాల్ని మళ్లీ నిర్మించారంటే.. అందుకు మున్సిపల్ కమిషనర్లతో పాటు స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేకపోతే, కూల్చివేతల హంగామా ముగిసిన తర్వాత మళ్లీ ఎవరికి వారు కట్టుకునే అవకాశం లేకపోలేదు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles