poulomi avante poulomi avante

ఆరంభ శూరులేనా? అడ్డుకోలేరా?

  • ప్ర‌భుత్వమే చ‌ర్య‌లు తీసుకోవాలి
  • అక్ర‌మార్కుల్ని అరిక‌ట్టే బాధ్య‌త వారిదే!
  • క‌రెక్టే.. కానీ, వారి స‌భ్య‌త్వం ర‌ద్దు చేయ‌రెందుకు?
  • నిర్మాణ రంగం పూర్తిగా మునిగేవ‌ర‌కూ చూస్తారా?
  • ఎన్‌సీఆర్ నుంచి గుణ‌పాఠం నేర్చుకోరా?

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: ఒక ప‌డ‌వ‌కు రంధ్రాలు ప‌డితే ఏం చేస్తారు? త‌క్ష‌ణ‌మే వాటిని పూడ్చి వేసే ప్ర‌య‌త్నం చేస్తారు. అందులో ప్ర‌యాణించే కొంద‌రు అతి తెలివైన వారు.. రంధ్రాలు ప‌డ్డాయ‌ని తెలిసి.. దాన్ని తామెందుకు క‌ష్ట‌ప‌డి పూడ్చాలి.. ప‌డ‌వ య‌జ‌మానియే ఆ ప‌ని చేయాల‌ని అతి తెలివిగా ఆలోచిస్తే ఏమ‌వుతుంది? అత‌నొచ్చి మ‌ర‌మ్మ‌తులు చేసే స‌మ‌యానికి.. ఆ ప‌డ‌వ మునిగిపోయి.. అందులో ప్ర‌యాణించేవారు దుర్మ‌ర‌ణం చెందిన ఆశ్చ‌ర్య‌ప‌డ‌క్క‌ర్లేదు.

అందుకే, ఇలాంటి దుర్ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు.. ప‌డ‌వ య‌జ‌మాని అనేక ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ, కొన్నిసార్లు ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల ఏర్ప‌డే స‌మ‌స్య‌ల‌కు.. అందులో ప్ర‌యాణించేవారు ప‌రిష్క‌రిస్తేనే ప్రాణాలు నిల‌బ‌డ‌తాయి. హైద‌రాబాద్ నిర్మాణ రంగం అనే ప‌డ‌వ‌కు యూడీఎస్‌, ప్రీలాంచుల వ‌ల్ల తూట్లు ప‌డుతున్నాయి. ప్ర‌భుత్వ‌మే ముందుకొచ్చి అక్ర‌మార్కులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వేచి చూసే ధోర‌ణిని నిర్మాణ సంఘాలు వేచి చూస్తే.. నిర్మాణ రంగ‌మంతా మునిగిపోయే ప్ర‌మాద‌ముంది. కాబ‌ట్టి, ఇప్ప‌టికైనా వీరంతా తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి. లేక‌పోతే ఆరంభ శూరులుగానే మిగిలిపోయే ప్ర‌మాద‌ముంది.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముగిసినా.. నిర్మాణ రంగంలో అమ్మ‌కాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇందుకు ప్రీలాంచ్‌, యూడీఎస్ అమ్మ‌కాలో ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిర్మాణ సంఘాల‌న్నీ ఎలుగెత్తి చాటాయి. త‌మ సంఘం సభ్యులే యూడీఎస్‌, ప్రీలాంచులు చేస్తున్నారని తెలిసినా, వారి గురించి ఇత‌ర స‌భ్యులు ఫిర్యాదుల్ని అంద‌జేసినా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే, క్రెడాయ్ హైద‌రాబాద్ నిర్వ‌హించే ప్రాప‌ర్టీ షోలో ఆయా సంస్థ‌లు బ‌డా బ‌డా స్టాళ్ల‌ను తీసుకోవ‌డ‌మో ప్ర‌ధాన కార‌ణం.

నాలుగేళ్ల క్రిత‌మే సొమ్మును అందజేసి నేటివ‌ర‌కూ నిర్మాణ ప‌నుల్ని ఆరంభించ‌ని ఓ సంస్థ కార్యాల‌యం ముందు కొంద‌రు కొనుగోలుదారులు ఏకంగా ధ‌ర్నా నిర్వ‌హించారు. మ‌రి, ఆ సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ఇంత‌కంటే మించిన సాక్ష్యం ఏముంటుంద‌ని తోటి స‌భ్యులు చెప్పినా ఈ సంఘం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇక క్రెడాయ్ తెలంగాణ‌ది మ‌రో క‌థ‌. ఇటీవ‌ల స్టేట్ కాన్‌క్లేవ్ నిర్వ‌హించే అంత‌వ‌ర‌కూ ఎంతో ఉత్సాహం చూపెట్టిన ఈ సంఘం అధ్య‌క్షుడు ఆ త‌ర్వాత ప‌త్తా లేకుండా పోయాడ‌ని స్వ‌యంగా ఆ సంఘ స‌భ్యులే అంటున్నారు. తెలంగాణ నిర్మాణ రంగానికీ ఓ దిశానిర్దేశం చేస్తుంద‌ని ఆస‌క్తిగా ఎదురు చూసిన నిర్మాణ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు క్రెడాయ్ తెలంగాణ అధ్య‌క్షుడు తీవ్ర నిరాశ‌ను మిగిల్చాడ‌ని స‌భ్యులు అనుకుంటున్నారు. రాష్ట్రంలోని ముఖ్య ప‌ట్ట‌ణాలు, టౌన్ల‌కు పాకిన యూడీఎస్‌, ప్రీలాంచుల మోసాల్ని అరిక‌ట్ట‌డంలో ఈ సంఘం పెద్ద‌గా దృష్టి సారించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ఛాప్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డంలో ఉన్నంత శ్ర‌ద్ధ‌.. నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు చూపెట్ట‌డం లేద‌ని ప‌లువురు డెవ‌ల‌ప‌ర్ల అభిప్రాయం.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles