కోకాపేట్.. ఒక్కసారిగా హైదరాబాద్ లో హాట్ లొకేషన్గా మారింది. ఇటీవల హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో ఎకరం రూ.60 కోట్లు పలకడంతో.. దేశవిదేశీ సంస్థల చూపు కోకాపేట్ మీద పడింది. హైదరాబాద్ నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి. ఒక సంస్థ ముప్పయ్ అంతస్తులుంటే.. మరొక సంస్థ 40 అంతస్తుల్లో నిర్మిస్తోంది. ఇంకో సంస్థ ముందుకొచ్చి 45 అంతస్తుల్లో కడుతున్నట్లు ప్రకటించింది.
మొత్తానికి, కోకాపేట్ రానున్న రోజుల్లో స్కై స్క్రేపర్స్ ప్రాంతంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి, ఇందులో ఏయే సంస్థలు త్వరగా పూర్తి చేస్తాయో తెలియదు కానీ, ప్రస్తుతం మార్కెట్లో అయితే కోకాపేట్ ప్రాంతం ప్రతిఒక్కర్ని విశేషంగా ఆకర్షిస్తుంది. మరి, ఇక్కడి ప్రాంతాల్లో రూపుదిద్దుకుంటున్న పలు ప్రాజెక్టుల వివరాలు మీకోసం.. ఇందులో ఒకట్రెండు ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యి రెడీ టు మూవ్ స్థాయిలో ఉండటం విశేషం.
ప్రాజెక్టు | బిల్డర్ | ప్రాంతం | ఫ్లాట్ల రకం | సంఖ్య | బిల్టప్ ఏరియా | ధర | పూర్తి ? |
వెస్ట్ బ్రూక్ | సైబర్ సిటీ | కోకాపేట్ | 2,3,4 బీహెచ్కే 3 టవర్లు | 3 టవర్లు, 1102 యూనిట్లు | ₹ 78.5లక్షలు – ₹ 1.75 కోట్లు | 2025 అక్టోబరు | |
అశోకా ఆస్పయిర్ | అశోకా డెవలపర్స | కోకాపేట్ | 3 బీహెచ్కే | 1 బిల్డింగు 393 యూనిట్లు | 1905- 2120 | 1.14- 1.27 కోట్లు | 2023 నవంబరు |
రాంకీ వన్ ఒడిస్సీ | రాంకీ ఎస్టేట్స్ | కోకాపేట్ | 3, 3.5, 4.5 బీహెచ్కే | 3 బిల్డింగులు | 1750- 3020 | 1.26- 2.17 కోట్లు | 2027 మార్చి |
ప్రెస్టీజ్ ట్రాంక్విల్ | ప్రెస్టీజ్ ఎస్టేట్స్ | కోకాపేట్ | 3 బీహెచ్కే | 4 బిల్డింగులు 907 యూనిట్లు | 1765- 2050 | 1.24- 1.43 కోట్లు | 2026 సెప్టెంబరు |
ఎలిమెంటల్ ఎర్త్ వుడ్స్ | ఎలిమెంటల్ రియాల్టీ | కోకాపేట్ | 2, 3 బీహెచ్కే | 1 బిల్డింగు | 1029 – 2083 | 2022 మార్చి | |
ఎన్ సీసీ అర్బన్ వన్ | ఎన్ సీసీ | కోకాపేట్ | 3, 3.5 బీహెచ్కే | 12 బిల్డింగులు 1317 యూనిట్లు | 1,535 – 3,380 | 1.07- 1.78 Cr | రెడీ టూ మూవ్ |
ఫార్చ్యూన్ స్కై విల్లాస్ | శ్రీ శ్రీనివాసా | కోకాపేట్ | 4 బీహెచ్కే | 4 బిల్డింగులు, 232 యూనిట్లు | 6332- 7332 | 5.38- 6.23 కోట్లు | 2024 డిసెంబరు |
పౌలోమీ అవంతే | పౌలోమీ ఎస్టేట్స్ | కోకాపేట్ | 2, 3 బీహెచ్కే | 3 బిల్డింగులు, 477 యూనిట్లు | 1310- 2540 | 85.15 లక్షలు- 1.65 కోట్లు | 2027 జనవరి |
ఏఎస్బీఎల్ స్పెక్ట్రా | ఎస్బీఎల్ బిల్డర్ | కోకాపేట్ | 3 బీహెచ్కే | 4 బిల్డింగులు, 1182 యూనిట్లు | 1516- 1702 | 1.55- 1.71కోట్లు | 2025 డిసెంబరు |
సన్ షైన్ ఎస్ ఎకోపోలిస్ | సన్ షైన్ ఇన్ఫ్రా | కోకాపేట్ | 2, 3 బీహెచ్కే | 1 బిల్డింగు | 1150 – 1645 | 69- 98.7 లక్షలు | 2024 డిసెంబరు |
డీఎస్సార్ ఎస్ఎస్సీ ద క్లాస్ | డీఎస్సార్ ఎస్ఎస్సీ | కోకాపేట్ | 4 బీహెచ్కే | 4 బిల్డింగులు, 448 యూనిట్లు | 2552- 3939 | 1.91 – 2.95 కోట్లు | 2025 డిసెంబరు |
మైహోమ్ తర్క్ష్య | మైహోమ్ | కోకాపేట్ | 3 బీహెచ్కే | 4 బిల్డింగులు, 660 యూనిట్లు | 1957- 2235 | 1.31 – 1.5 కోట్లు | 2023 జులై |
జయభేరి ద పీక్ | జయభేరి | నానక్ రాంగూడ | 4 బీహెచ్కే | 3 బిల్డింగులు, 144 యూనిట్లు | 4690- 5440 | 3.99 Cr – 4.62 కోట్లు | రెడీ టు మూవ్ |
ఆర్ఆర్ సిగ్నేచర్ | ఆర్ఆర్ బిల్డర్స్ కోకాపేట్ | కోకాపేట్ | 2,3 బీహెచ్కే | 1 టవర్, 93 యూనిట్లు | ₹ 76.9 లక్షలు | రెడీ టు మూవ్ |