poulomi avante poulomi avante

ప్రకృతి ఒడిలో.. ప్రైమార్క్స్ ఎకో నెస్ట్

  • గుండ్లపోచంపల్లిలో అదిరిపోయే గేటెడ్ కమ్యూనిటీ

నగర వాతావరణానికి దూరంగా.. అదే సమయంలో పలు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ కి దగ్గరగా.. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవనం గడపాలనుకుంటున్నారా? అయితే, ప్రైమార్క్స్ ఎకో నెస్ట్ చూడాల్సిందే. కొంపల్లి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని రకాల హంగులు, సమస్త సౌకర్యాలతో అదిరిపోయే గేటెట్ కమ్యూనిటీ సిద్ధమవుతోంది. గతేడాది నవంబర్ లో ప్రారంభమైన రెరా అనుమతి కలిగిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఐదెకరాల స్థలంలో ఐదు టవర్లతో మొత్తం 410 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి.

సమస్త సౌకర్యాలతో కూడిన 20వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. అపెరల్ ఎక్స్ పోర్ట్ పార్క్ ఎదురుగా సెల్లార్, స్టిల్ట్, 10 అంతస్తుల్లో మొత్తం ఐదు టవర్లు నిర్మిస్తున్నారు. వీటిలో 2, 3 బీహెచ్ కే ప్రీమియం ఫ్లాట్లు లభ్యంకానున్నాయి. 1160 నుంచి 1305 చదరపు అడుగుల మధ్యలో 2 బీహెచ్ కే, 1425 నుంచి 2165 చదరపు అడుగుల మధ్యలో 3 బీహెచ్ కే ఫ్లాట్లు ఉన్నాయి. పూర్తి వాస్తు విధానంతో, 60 శాతం ఓపెన్ ఏరియాతో చుట్టూ చెట్ల మధ్యలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.

ఇంకా మురుగునీటి శుద్ధి ప్లాంటు, నీటి శుద్ధి ప్లాంటు, వాననీటి ఇంకుడు గుంతలు, కార్ వాషింగ్ సౌకర్యం, సోలార్ ప్రీమియం ఫెన్సింగ్, ఆటోమేటిక్ ఎంట్రీ, ఎగ్జిట్ వ్యవస్థ, సీసీటీవీ, 24 గంటల సెక్యూరిటీ, బాస్కెట్ బాల్ కోర్టు, మల్టీ యూజ్ ప్లే కోర్టు, ఓపెన్ ఫిట్ నెస్, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం, పార్టీ లాన్, యూ షేప్ ట్రెల్లస్, విశాలమైన లాన్లు వంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక క్లబ్ హౌస్ విషయానికొస్తే అదిరిపోయే ఎంట్రన్స్ లాంజ్ తో అత్యద్భుతమైన డిజైన్ తో నిర్మిస్తున్నారు.

ఇందులో సూపర్ మార్కెట్, బ్యాడ్మింటన్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, యోగా రూం, డ్రై కేర్, సెలూన, లైబ్రరీ, మల్టీపర్పస్ హాల్, రెస్టారెంట్, సిట్టింగ్ లాంజెస్, గెస్ట్ రూమ్స్, స్పా వంటి విశిష్టతలున్నాయి. ఫ్లాట్ ధర రూ.46 లక్షల నుంచి మొదలవుతోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles