తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా సునీల్ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఇంతవరకూ ఆయన ట్రెడా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవల్ని అందించారు. ఆయన స్థానంలో జీఎస్ గా మేకా విజయ్ సాయ్ ఎన్నికయ్యారు. తను గతంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నిర్మాణ రంగం అభివృద్ధిలో కీలకమైన భూమికను పోషిస్తానని తెలిపారు. నిర్మాణ రంగం క్రమపద్ధతిలో పయనించేందుకు ట్రెడా తమ వంతు సహాయ సహకారాల్ని అందజేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన్ని నిర్మాణ సంఘాల ప్రతినిధులంతా కలిసి బంజారాహిల్స్‌లోని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.