poulomi avante poulomi avante

మూడు వేల‌కే ముచ్చ‌టైన స్వ‌గృహ ఫ్లాట్లు

  • బండ్లగూడ రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్లు
  • కొంత అసంపూర్తిగా ఉన్న‌వి చ‌.అ.కీ. రూ.2,750
  • పోచారంలో చ‌.అ.కీ. రూ.2500 మాత్ర‌మే
  • మొత్తం 2829 ఫ్లాట్ల విక్ర‌యం..

దాదాపుగా ద‌శాబ్దం నుంచి ఖాళీగా ప‌డి ఉన్న రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్ల విక్ర‌యానికి సంబంధించి విధివిధానాల‌ను ప్ర‌భుత్వం రూపొందించింది. ఈ మేర‌కు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి బుధ‌వారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

బండ్ల గూడలో మొత్తం 1501 ఫ్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయి. అందులో వర్క్స్ పూర్తి స్థాయిలో ఉన్నవి 419 ఫ్లాట్లు చ. అడుగు 3 వేల చొప్పున విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించారు. కాస్త అసంపూర్తిగా ఉన్న వాటిని చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.2,750 చొప్పున విక్ర‌యిస్తారు. పోచారంలో 1328 ఫ్లాట్లు అమ్మ‌కానికి ఉన్నాయి. వీటిని చ‌ద‌ర‌పు అడుక్కీ రూ. 2500 రూ.చొప్పున అమ్ముతారు. కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్ల‌ను.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ. 2250 రూ. చొప్పున విక్ర‌యిస్తారు. సాధారణ పౌరులు, ఉద్యోగులు, ఆసక్తి కలిగిన వారు మీ సేవా ద్వారా, ఆన్‌లైనులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంంధించి ప్రత్యక యాప్ కూడా అందుబాటులోకి వ‌స్తుంది. అర్హులైన వారికి బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంటుంది. www.swagruha.telangana.gov.in సైట్ ను పేపర్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల వరకు విజిట్ చేసి అప్లై చేసుకోవాలి. ఆసక్తి కలిగిన కొనుగోలుదారుల కోసం బండ్లగూడ, పోచారంలో 6 చొప్పున మోడల్ హౌసులు ఏర్పాటు చేశారు. వాటిని సందర్శించాక న‌చ్చితే అక్క‌డిక‌క్క‌డే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
* అప్లికేషన్ ఫీజు 1000 రూ.(నాన్ రిఫండబుల్)..
* లబ్దిదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో ఉంటుంది. అందుకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తారు.

బండ్ల గూడలో అమ్మ‌కానికి ఇవి..

  • 3BHK డీలక్స్ 345 ఫ్లాట్లు
  • 3BHK 444 ఫ్లాట్లు
  • 2BHK 712 ప్లాట్లు

పోచారంలో ఇవి అమ్మ‌కానికి..

  •  3 BHK డీలక్స్ 91ఫ్లాట్లు
  •  3 BHK 53 ఫ్లాట్లు
  •  2BHK 884 ఫ్లాట్లు
  •  1BHK 442 ఫ్లాట్లు
  • 3 BHK డీలక్స్ ఫ్లాట్ లో ఒక హల్, 3 బెడ్రూంలు, 3 అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూమ్, పూజా రూమ్, బాల్కనీ సౌకర్యాలుంటాయి.
  •  3 BHK ఫ్లాట్లో ఒక హాల్, 3 బెడ్రూం, 2 అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, పూజా రూమ్, బాల్కనీ
  •  2 BHK ఫ్లాట్లో హాల్ విత్ కిచెన్, 2 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ..
  • 1 BHK ఫ్లాట్లు హాల్ విత్ కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ ఉంటాయి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles