ప్రముఖ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ప్రొవైడర్ వీ వర్క్ ఇండియా.. ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ భూటానీ గ్రూప్ తో జట్టు కట్టింది. నోయిడాలో ఉన్న 25 అంతస్తుల అల్ఫాథమ్ టవర్ మొత్తాన్ని వీ వర్క్ ఇండియా తీసుకుంది. 6.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8500కి పైగా డెస్కులు కలిగి ఉన్న ఆల్ఫాథమ్ స్పేస్ ను వీ వర్క్ కేటాయిస్తుంది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో జరిగిన ఈ లావాదేవీ అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటని ప్రముఖ సంస్థ కొలియర్స్ వెల్లడించింది.
భూటానీ అల్ఫాథమ్ లోకి వీ వర్క్ కి స్వాగతం పలుకుతున్నామని, ఆ సంస్థకు నాణ్యత కలిగిన సేవలను అందించడానికి కృషి చేస్తామని భూటానీ గ్రూప్ సీఈఓ ఆశిష్ భూటానీ పేర్కొన్నారు. భూటానీ వంటి గొప్ప గ్రూప్ తో భాగస్వామి కావడం, తమ నెట్ వర్క్ ను నోయిడాలో విస్తరింపజేయడం సంతోషకరమైన అంశమని వీ వర్క్ ఇండియా రియల్ ఎస్టేట్ హెడ్ అర్నవ్ ఎస్ గుసేన్ వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ లో అతిపెద్ద విస్తరణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో సాయపడిన తమ భాగస్వామి కొలియర్స్ కి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ ఏడాది నుంచే ఈ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది.