poulomi avante poulomi avante

వర్క్ ఫ్రం హోం కుర్చీ కొంటున్నారా?

కరోనా మహమ్మారితో చాలామందికి ఇల్లే ఆఫీసుగా మారిపోయింది. ఇంట్లో నుంచే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా ఇది అందరికీ అనుకూలమే అయినా.. ఆఫీసు సెటప్ ఇంట్లో ఉండకపోవడం కాస్త ప్రతికూల అంశం. ఈ నేపథ్యంలో మారిన అవసరాల దృష్ట్యా ఇంట్లో ఆఫీసు పని చేయడం కోసం ఓ గది, అందులో ఫర్నిచర్ తప్పనిసరిగా మారింది. చాలామంది ఆ గదిని తమ ఆఫీసుగా మార్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఓ విశాలమైన టేబుల్, చక్కటి కుర్చీ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం చైర్ ఎలా ఉండాలనే అంశం కూడా కీలకంగా మారింది. నిజానికి మనం సరైన కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చుని పనిచేస్తే దాని ప్రభావం పనిమీద చాలా బాగా ఉంటుంది. అందుకే కుర్చీ ఎంపికలో కూడా జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి కుర్చీ ఉండాలంటే..

ఎక్కువసేపు కుర్చీల్లో కూర్చుని పనిచేసేవారికి వెన్నునొప్పి ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలో ఎర్గోనామిక్ డిజైన్ తో సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన కుర్చీని ఉపయోగించడం ద్వారా దీని బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. దృఢమైన ఎగ్జిక్యూటివ్, చక్కని బ్యాక్ రెస్ట్ కలిగిన కుర్చీ వెన్ను నొప్పి నుంచి కాపాడుతుందని వెల్లడైంది. ఇక చక్రాల కుర్చీలు ఒకచోట నుంచి మరోచోటకు కదలడానికి అనువుగా ఉంటాయి. మీ గది రంగులు, ఇతరత్రా ఫర్నిచర్ ను బట్టి మీ కుర్చీ రంగును కూడా ఎంచుకునే సౌలభ్యం ఉంది. వర్క్ ఫ్రం హోం చైర్స్ తీసుకునేటప్పుడు కొన్ని అంశాలు పరిశీలించాలి. చాలా కుర్చీలు ఎర్గోనమిక్ గా రూపొందించారు. అందువల్ల మనకు కావాల్సినంత ఎత్తు సెట్ చేసుకోవచ్చు. అందువల్ల మనకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా మార్చుకోవచ్చన్నమాట. ఈ కుర్చీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..

సీటు: సీటు అంటే మనం కూర్చునే ప్రదేశం. కుర్చీ సీటుకు రెండు క్లిష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఎత్తు సర్దుబాటు చేసుకోవడం, కోణాన్ని సర్దుబాటు చేసుకోవడం. కొన్ని కుర్చీలలో టేబుల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ఎత్తుకు సరిపోయేలా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల మణికట్టు వెనుకభాగంలో అనవసర ఒత్తిడిని నివారించవచ్చు. అలాగే మెరుగైన సౌకర్యం కోసం మనం కోరుకునే నిర్దిష్ట కోణంలో కూడా సీటును సర్దుబాటు చేసుకోవచ్చు.

బ్యాక్ రెస్ట్: సౌకర్యవంతంగా కూర్చోవడానికి బ్యాక్ రెస్ట్ బాగా సహకరిస్తుంది. అలాగే వెన్నుకు సపోర్ట్ ఇస్తుంది. కొన్ని కుర్చీలకు వెన్ను దిగువ భాగంపై ఎలాంటి ఒత్తిడీ లేకుండా చూడటం కోసం ప్రొట్రూషన్ కలిగి ఉంటాయి. కొన్ని మోడల్ కుర్చీల్లో బ్యాక్ రెస్ట్ ఎత్తు కూడా సర్దుబాటు చేసే వెసులుబాటు ఉంటుంది.
షోల్డర్ పొజిషనింగ్ కోసం ఆర్మ్ రెస్ట్: మౌస్ లేదా కీబోర్డుపై పనిచేస్తున్నప్పుడు మన చేతులు ఆని ఉండే ప్రదేశమే ఆర్మ్ రెస్ట్. ఇది సాధారణంగా మూడు క్లిష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది. సర్దుబాటు చేయగల వెడల్పు, సర్దుబాటు చేయగల ఎత్తు, తొలగించే వెసులుబాటు. ఇది కాకుండా కొన్ని మోడల్ కుర్చీల్లో ప్యాడెడ్ ఆర్మ్ రెస్టులు ఉంటున్నాయి. మోచేతులు నొప్పి పెట్టకుండా ఇవి సహకరిస్తాయి.

రిక్లైనింగ్ ఫీచర్: కొన్ని వర్క్ ఫ్రం హోం కుర్చీలు రిక్లైనింగ్ ఫీచర్లతో వస్తున్నాయి. ఇది అవసరమైన సమయాల్లో వెనక్కి వాలి సేద తీరడానికి ఉపకరిస్తుంది. లేకుంటే పనిచేసినంత సేపూ నిటారుగానే కూర్చోవాల్సి ఉంటుంది.

హెడ్ రెస్ట్: కుషన్ ఉన్న హెడ్ రెస్ట్ ఉంటే.. మనం వినడం లేదా చూడటం చేసే పనిలో ఉన్నప్పుడు తలను దానికి ఆనించి సౌకర్యవంతంగా ఉండొచ్చు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles