- గోద్రేజ్ నుంచి వినూత్న పరిష్కారాలు
పండగ వచ్చిందంటే చాలు.. భారతీయుల ఇళ్లు స్నేహితులు, బంధువులతో నిండిపోతాయి. చక్కగా పార్టీలు చేసుకుంటూ ఆనందమయ క్షణాలను ఆస్వాదిస్తారు. ఇంట్లోనే ఆహారం తయారుచేసుకుని తినడానికి మొగ్గు చూపిస్తారు. అతిథులు, మిత్రులు వస్తారు కాబట్టి ఇళ్లకు రంగులు వేయడం, ఫర్నిచర్ కు కొత్త శోభ తేవడం వంటివి చాలా సాధారణ విషయాలు. మరి ఇంట్లో అన్నీ బాగున్నా.. ఎంతో కీలకమైన వంటిగదిని మాత్రం వదిలేస్తే ఎలా? అందుకే వంటగదిని చక్కగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ఎలాగో చూద్దామా? ప్రస్తుతం అందరూ మాడ్యులర్ కిచెన్, స్టోరేజ్ కు అనువైన కిచెన్ లనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. స్థల పరిమితులు నేపథ్యంలో తమ జీవనశైలికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో మీ వంటగదిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు గోద్రేజ్ లాక్స్ నుంచి విప్లవాత్మక స్కీడో శ్రేణి వినూత్న పరిష్కరాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఈ పండగకు మీ వంటగదిని చక్కగా సిద్ధం చేయడంలో సహాయపడతాయి.
తొలుత మీ వంటగదిని శుభ్రం చేయండి. పండగ సమయంలో ఇల్లంతా శభ్రం చేసినట్టే వంటగదిని కూడా నీట్ గా తయారు చేయండి. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడ చక్కగా సర్దండి. సర్దుబాటు చేయగల పార్టిషన్స్ వినియోగించి కట్లెరీ, ప్లేట్లను చక్కగా అమర్చండి. మీ శైలికి సరిపోని, మీరు వినియోగించని ప్రతి వస్తువునూ వంటగది నుంచి తొలగించండి. మీ వంటగదిని చక్కగా మార్చడానికి ఇదే తగిన సమయం అని కచ్చితంగా గుర్తుంచుకోండి. డిష్ టవల్స్ అయినా, ఉపయోగించిన ఉపకరణాలైనా.. వాటిని తొలగించండి. కేబినెట్లలో ఎక్కువ స్థలం ఉంటుంది. మెజ్జనైన్ స్థాయి ట్రేలను వినియోగించడం ద్వారా ఆ మల్టిపుల్ స్టోరేజ్ కంటైనర్లను రీ స్టాక్ చేయండి. డ్రాయర్ లోని నిలువుగా ఉండే స్పేస్ ను చక్కగా వినియోగించడం దీని ప్రత్యేకత.
పరిమిత నిల్వ స్థలంతో వంటగదిని ఎలా తీర్చిదిద్దాలా అని ఆలోచిస్తున్నప్పుడు ప్రతి చదరపు అంగుళం స్థలమూ చాలా ముఖ్యమే. పండగ నేపథ్యంలో స్వీట్లు, స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటివి నిల్వ చేయడం తప్పనిసరి. అందుకే వీటన్నింటినీ ఓ క్రమపద్ధతిలో అమర్చుకోవాలి. ఈ నేపథ్యంలో మీ మంచీలన్నింటినీ స్లైడ్ అవుట్ పాంట్రీలో నిల్వ చేయడం చాలా సులభం. పై, కింది డ్రాయర్ల పక్కకు జరుగుతాయి. లోపల ఏముందో బయటకు చక్కగా కనిపిస్తాయి.
ప్రతి అవసరానికి వినూత్న పరిష్కారాలు..
మనం ఇంట్లో పిండివంటలు చేసుకోవడానికి అనేక రకాల పాన్ లు, కడాయిలు, తవ్వాలు, మసాలా దినుసుల బాక్సులు, ప్లేట్లు, థాలీలు, ఇంకా ఇతర పాత్రలు కావాలి. విదేశాల్లో తయారైనా బాస్కెట్లు, ఉపకరణాల్లో వీటిని ఉంచలేం. ఈ నేపథ్యంలో మన వంటగది యొక్క అన్ని క్రియాత్మక అవసరాలను తీర్చడానికి గోద్రేజ్ కిచెన్ ఫిట్టింగులు.. స్కీడో(స్మార్ట్ కిచెన్ డ్రాయర్లు, ఆర్గనైజర్లు) అనే వినూత్న పరిష్కరాలను తీసుకొచ్చింది. ఇందులో పలు రకాలా డ్రాయర్లు, ఆర్గనైజర్లు, కార్నర్ సొల్యూషన్స్, అండర్ సింక్ సొల్యూషన్స్ వంటివి ఉన్నాయి.