poulomi avante poulomi avante

గొప్ప బిల్డ‌ర్‌గా ఎద‌గాలంటే..!

వేణు భ‌గ‌వాన్‌, ఫౌండ‌ర్‌- బి క్ల‌బ్‌

బిల్డర్ అనగానే ఇళ్లు కట్టించి అమ్మే వ్యక్తి అని గుర్తుకొస్తాడు. బిల్డర్లు చాలామందే ఉంటారు. కానీ గొప్ప బిల్డర్లు చాలా తక్కువ మంది ఉంటారు. మరి బిల్డర్ కి గొప్ప బిల్డర్ కి తేడా ఏమిటి? సాధారణ బిల్డర్ గొప్ప బిల్డర్ కావాలంటే ఏం చేయాలి? సాధారణ బిల్డర్ ఇంటిని మాత్రమే నిర్మిస్తాడు. కానీ గొప్ప బిల్డర్ తన సంస్థ సంస్కృతిని నిర్మిస్తాడు. అదే అతడిని ఉన్నతస్థాయిలో నిలబెడుతుంది.

కోవిడ్ మానవ జీవితాల్లో, ఆలోచనల్లో, ప్రాధానతల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతతో కూడిన జీవితాన్ని ఆస్వాదించాలనుకోవడం చాలామంది ప్రస్తుతం అతి ముఖ్యమైన ప్రాధాన్యతలుగా మారిపోయాయి. ఇప్పటివరకు విలాసానికి ప్రాధాన్యత ఇచ్చినవారంతా ప్రకృతికి దగ్గరగా జీవించాలనే నిజాన్ని తెలుసుకున్నారు. ఫలితంగా భూముల ధరలు భారీగా పెరిగాయి. ప్రకృతిపై ప్రేమ పెరగడం వల్ల విల్లాల ధరలు కూడా కొండెక్కాయి. ఇక కోవిడ్ కారణంగా ఇళ్ల అమ్మకాలకూ గిరాకీ పెరగడంతో ప్రీలాంచ్ ఆఫర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆకర్షణీయమైన ధరలకు ఆకాశహర్మ్యాలు లభిస్తున్నాయనే ఆశతో చాలామంది ఎగబడి కొనుక్కున్నారు. అవి పూర్తవుతాయా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది. నిజానికి ప్రీ లాంచ్ అనే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. బిల్డరుగా ఉన్నవారు తమ సన్నిహితులు, వినియోగదారులకు ముందుగా చెప్పేవారు. వారి మీద ఉన్న నమ్మకంతో అందులో పెట్టుబడి పెట్టేవారు. కొంతమంది ప్రముఖ బిల్డర్లు అయితే అలా ఆసక్తి చూపివారిలో కొందరిని ఎంచుకుని మార్కెటింగ్ అవసరం లేకుండా అమ్మేసేవారు. కానీ ఇప్పుడు మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మార్కెట్ ఉండేది. ఇప్పుడు మార్కెటింగ్ ఉంది. మార్కెటింగ్ చిట్కాలు తెలియకపోతే మీరు ఎంత మంచి బిల్డర్ అయినా అవి అమ్ముడుపోతాయనే గ్యారెంటీ ఉండదు. అదే సమయంలో బాగా మార్కెటింగ్ చేసి.. ఏ అనుమతీ లేకపోయినా అమ్మినంత మాత్రాన గొప్ప బిల్డర్ అయిపోతారనీ లేదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో అసలు బిల్డర్ల కంటే మార్కెటింగ్ చేసి అమ్మగలిగే బిల్డర్లే ఎక్కువగా ఉన్నారు.

క్యాష్ ఫ్లో రావాలంటే..

ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో ఒక మంచి బిల్డర్.. తన ప్రాజెక్టు సమయానికి వినియోగదారులకు అందించాలన్నా.. క్యాష్ ఫ్లో ఇబ్బందులు రాకుండా నిర్మాణం చేపట్టాలన్నా ముందుగా అతడు నిర్మించాల్సింది భవనాన్ని కాదు.. తన ఆర్గనైజేషన్ కల్చర్ ను నిర్మించాలి. నిజానికి ఎంత ఆలస్యమైతే అంత రేటు పెరిగేది భూమి ఉన్నవారికి మాత్రమే.. బిల్డర్ కు కాదు. బిల్డర్ ఎంత వేంగా ప్రాజెక్టు పూర్తి చేసి, అప్పగిస్తాడో అంత క్యాష్ ఫ్లోను ఆస్వాదించొచ్చు. ఖర్చులను అదుపులో ఉంచగలిగి, నిరంతరం క్యాష్ ఫ్లో వచ్చేలా అమ్మకాలు ఉండి, ఆర్థిక క్రమశిక్షణ కలిగి, సమర్థవంతమైన ఉద్యోగులు సంస్థలో ఉంటే.. ఆ బిల్డర్ కి తిరుగు ఉండదు. సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి మార్కెట్లో నిలబడగలుగుతారు. వాస్తవానికి మార్కెట్ మందగిస్తే.. చాలామంది బిల్డర్లకు క్యాష్ ఫ్లో ఒత్తిడి పెరుగుతుంది. కానీ ప్రస్తుతం చాలా సంస్థలకు నగదు లోటు కంటే విశ్వసనీయత లోటు విపరీతంగా ఉంది. దీనిని అధిగమించినవాడే గొప్ప బిల్డర్ కాగలరు.

 

రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరైనా ప్రవేశించడం చాలా సులభం. సొంతిల్లు అనేది ప్రతి వ్యక్తి కల. దానిని క్యాష్ చేసుకోవడానికి చాలామంది ఉంటారు. నిర్మాణ రంగంలో సరైన అనుభవం లేనివారు, కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఈ రంగంలోకి ప్రవేశించి రకరాల ఆఫర్లతో అమ్మకాలు జరిపి సకాలంలో హ్యాండోవర్ చేయనివారి కోకొల్లలుగా ఉంటారు. అందుకే ఈ రంగంలో విశ్వసనీయత లోటు కూడా ఎక్కువ. అదే సమయంలో మంచి ఉద్దేశం, సామర్థ్యం కలిగిన బిల్డర్లు ఎదగడానికీ ఈ రంగంలోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాత్కాలిక లాభాలు చూడకుండా దీర్ఘకాల లాభాలు దృష్టిలో ఉంచకుంటేనే సదరు బిల్డర్ లేదా ఆ సంస్థ బ్రాండ్ వాల్యూతోపాటు బిజినెస్ కూడా అనేక రెట్లు పెరుగుతుంది.
ఒక మంచి సంస్థాగత సంస్కృతి ఆ సంస్థను మార్కెట్లో గొప్ప బ్రాండ్ గా నిలబెడుతుంది. బిల్డర్ ఓ భవనాన్ని చాలా సులభంగా నిర్మిస్తాడు. కానీ సంస్థ సంస్కృతిని నిర్మించడం అంత సులభం కాదు. అది ఓ దీర్ఘకాల ప్రక్రియ. ఒక సంస్థ నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్మించిన సంస్థాగత సంస్కృతి ఆ సంస్థను గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతుంది. అదే కల్చర్ లేని సంస్థలు తమ స్థాయిని క్రమంగా తగ్గించుకుంటాయి. నిజానికి సరైన సంస్థాగత సంస్కృతిని నిర్మించడానికి సూత్రధారుడు ఆ సంస్థ వ్యవస్థాపకులే. రాజీ లేని విలువలతో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటే ఇక ఆ సంస్థకు తిరుగుండదు. వినియోగదారులే ఆ సంస్థకు అభిమానులుగా మారి, వారే మార్కెటింగ్ కూడా చేసి పెడతారు. అలా ఆ సంస్థ అభివృద్ధిలో భాగమవుతారు. ఇదంతా ఆ సంస్థ విలువలు, విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా విలువల్లో రాజీపడితే ఆ సంస్థ బీటలు వారడం కూడా మొదలుపెడుతుంది. అంటే.. ఈ రంగమైనా, ఏ రంగమైనా, ఎప్పటికైనా.. అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ఉండాల్సిందే విశ్వాసమే.

 

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles