poulomi avante poulomi avante

నివాసితుల సమస్యలకు ప్రత్యేక సెల్

అపార్ట్ మెంట్ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి లక్నో డెవలప్ మెంట్ అథార్టీ (ఎల్ డీఏ) నడుం బిగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎల్ డీఏ వైస్ చైర్ పర్సన్ ఇంద్రమణి త్రిపాఠీ లక్నోలోని పలు అపార్ట్ మెంట్ల రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన తర్వాత వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సెల్ లో ఓ నోడల్ ఆఫీసర్ ను నియమిస్తారు. ఆయన అపార్ట్ మెంట్లను తనిఖీ చేసి, వారి సమస్యలను పరిష్కరిస్తారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles