poulomi avante poulomi avante

కబ్జా భూమిలో మై హోమ్‌ రాకా?

  • ఆ భూమిని మై హోమ్ కబ్జా చేసిందని ఆరోపణ

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మై హోమ్, రెడ్డీ ల్యాబ్స్ పై కబ్జా ఆరోపణలొచ్చాయి. రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిని తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకుని నిర్మాణాలు చేపట్టారంటూ బాధితులు మీడియా ముందుకు రావడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో అధికారులు మైహోమ్, రెడ్డీ ల్యాబ్స్ కే ఒత్తాసు పలుకుతున్నారని, చట్టబద్ధంగా భూమి తమదేనని నిరూపించే ఆధారాలు ఉన్నా.. అధికారులు వారికే అప్పగించడం దారుణమని పేర్కొన్నారు. బాధితుల తరఫున రిటైర్డ్ రెవెన్యూ జాయింట్ కలెక్టర్ రాంగోపాల్ రావు ఇటీవ‌ల సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాల్ని వెల్ల‌డించారు.

రంగారెడ్డి జిల్లా మదీనాగూడలోని సర్వే నెంబర్ 98లో దివంగత తాండ్ర ముత్తయ్యకు ఏడెకరాల 30 గుంటల భూమి ఉందని, దానిపై సర్వ హక్కులూ ముత్తయ్య వారాసులకే ఉందని రాంగోపాల్ రావు పేర్కొన్నారు. అయితే, తప్పుడు పత్రాలతో ఈ భూమిని హోమ్, రెడ్డీ ల్యాబ్స్ కలిసి కబ్జా చేశాయని ఆరోపించారు. 2021లో ఆ భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ హోమ్ రాకా పేరుతో భవన నిర్మాణం కూడా చేపట్టారని పేర్కొన్నారు. తహశీల్దార్, జాయింట్ కలెక్టర్, చివరకు హైకోర్టు సైతం ఆ భూమి ముత్తయ్య వారసులదేనని చెప్పినా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేద‌ని విమర్శించారు.

మైహోమ్, రెడ్డీ ల్యాబ్స్ దౌర్జన్యంగా భూమి లాక్కున్నారని.. పైగా తప్పుడు పత్రాలతో భవన అనుమ‌తులు తెచ్చుకుని నిర్మాణం చేపట్టారని వివరించారు. దీంతో తాండ్ర ముత్తయ్య వారసులు హైకోర్టు ఆశ్రయించగా.. ఆ భవన అనుమతిని రద్దు చేయాలని న్యాయస్థానం జీహెచ్ఎంసీని ఆదేశించిందని వివరించారు. కానీ అధికారులు ఆ పని చేయకుండా.. మై హోమ్ సంస్థ‌కే వత్తాను పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాండ్ర ముత్తయ్య వారుసులకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. తమ భూమి కోసం బాధితులు పోరాడుతుంటే వారిని బెదిరిస్తున్నారని, ఈ నేపథ్యంలో కబ్జాదారుల నుంచి బాధితులను కాపాడటంతో పాటు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాంగోపాల్ రావు ప్రభుత్వానికి విన్నవించారు.

మై హోమ్ రాకాలో ఎవ‌రూ కొన‌వ‌ద్దు

మై హోమ్ సంస్థ మ‌దీనాగూడ‌లో చేప‌ట్టిన మై హోమ్ రాకా నిర్మాణానికి ఇచ్చిన అనుమ‌తుల‌న్నీ ఏప్రిల్ 28న ర‌ద్దు చేసింద‌ని మాజీ జాయింట్ క‌లెక్ట‌ర్ రాంగోపాల్ రావు ప‌త్రికాముఖంగా తెలిపారు. అక్ర‌మంగా పొందిన స్థ‌లంలో క‌డుతున్న నిర్మాణాల్లో ఎవ‌రూ కొనుగోలు చేయ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విష‌య‌మై తాము ప్ల‌బిక్ నోటీసు కూడా ఇచ్చిన‌ట్లు వివ‌రించారు. ఈ స్థ‌లాన్ని ప్ర‌భుత్వం యజ‌మానుల‌మైన త‌మ‌కు అప్ప‌గించాల‌ని బాధిత కుటుంబాల మ‌హిళ‌లు బాలామ‌ణి, విజ‌య‌ల‌క్ష్మీ, శార‌ద‌, అమృత‌బాయిలు కోరారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles