హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకునేందుకు విశాలమైన ఇల్లు లేదా విల్లా ఉండాలని చాలామంది భావిస్తారు. కేవలం ఖరీదైన గృహాలున్నవారే వీటిని ఏర్పాటు చేసుకుంటారని అనుకుంటారు. కానీ, కేవలం కాస్త బడా సైజు టీవీ ఖర్చుతోనే.. ఇంట్లో ఎంచక్కా హోమ్ థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చాలామంది తెలియదు. ఔను.. మీరు చదివింది నిజమే.. లక్షన్నరకే మీ ఇంటిని మినీ మూవీ థియేటర్‌గా మార్చుకోవచ్చు. అదెలా అంటారా?
మీ ఇంట్లో 8/6 అడుగుల సైజు గోడ ఉందా? అయితే, అదే గోడకు హోమ్ థియేటర్‌ను బిగించి.. ఎంచక్కా కొత్త సినిమాల్ని ఆస్వాదించొచ్చు. ఇందుకు మీరు అయ్యే ఖర్చు కేవలం లక్షన్నర మాత్రమే. ఒక ప్రొజెక్టర్, సినిమా స్క్రీన్, 2.1 డిజిటల్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. హ్యాపీగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎంచక్కా నచ్చిన సినిమాను ఆస్వాదించొచ్చు. మ్యూజికల్ కన్సర్ట్స్ను వీక్షించొచ్చు. ఇలా, మీకు నచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ హోమ్ థియేటర్‌ను అందించే సంస్థకు బడా చరిత్ర ఉంది. స్టార్ ట్రాక్ హోమ్ థియేటర్ సంస్థ యజమానికి హైదరాబాద్‌లోని అనేక సినిమా థియేటర్లకు సౌండ్ సిస్టమ్‌ను అందించిన ఘనచరిత్ర ఉంది. టెక్నాలజీ మీద పూర్తి పట్టు ఉన్న ఆయన.. ప్రత్యేకంగా హోమ్ థియేటర్లను డిజైన్ చేశారు. మార్కెట్లో ఎక్కడా దొరకని నాణ్యమైన హోమ్ థియేటర్ కావాలంటే.. కచ్చితంగా స్టార్ ట్రాక్ హోమ్ థియేటర్‌ను కలవాల్సిందే.