నోవాటెల్ హైదరాబాద్ విమానాశ్రయంలోని లాబీ ప్రాంతం సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. గౌర్మెట్ బార్ మరియు ఫుడ్ ఎక్స్ఛేంజీలను ఆరంభించింది. సమకాలీన డిజైన్‌తో అతి సుందరంగా ముస్తాబైన బార్ సీలింగ్ నుంచి క్రిస్టల్ బాల్ లైటింగ్ రంగులు, జూట్ ల్యాంపులతో ప్రశాంతంగా కనిపిస్తుంది. కాస్త మందంగా కనిపించే చెక్క ఫర్నీచర్ ప్రత్యేకమైన సర్వ్ వేర్‌తో పాటు భోజన అనుభవాన్ని పెంచుతుంది. హోటల్‌కు ప్రకాశవంతమైన కొత్త రూపం సంతరించుకుంది.
ఈ సందర్భంగా నోవాటెల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ రూబిన్ చెరియన్ మాట్లాడుతూ.. నోవాటెల్ హోటల్ ప్రాంగణాన్ని రీడిజైన్ చేసి.. అతిథులకు మరింత ఉన్నతమైన సేవల్ని అందించడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. విమానాశ్రయంలో విశ్రాంతి మరియు వ్యాపార ప్రయాణీకుల కోసం పని, ఆటల మధ్య సమతుల్యాన్ని సాధించే విధంగా డిజైన్ చేశామన్నారు. తమ సరికొత్త గౌర్మెట్ బార్ కస్టమర్లకు ఆనందాన్ని ఇస్తుందన్నారు.