poulomi avante poulomi avante

THE SKIGH : ప్రకృతిలో ఆవాసం ‘ద స్కై‘లో సాధ్యం

ప్రకృతిలో నివసిస్తూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని కావాలని కోరుకుంటున్నారా? అయితే, మీలాంటి వారందర్ని సాదరంగా స్వాగతం పలుకుతోంది.. ‘ THE SKIGH ‘ @తాడేపల్లి, అమరావతి.

ప్రకృతి ఒడిలో యాభై తొమ్మిది శాతం ఓపెన్ స్పేస్ లతో.. సహజసిద్ధమైన గాలి, వెలుతురు, నీటి వసతులతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టే.. ద స్కై. ఎయిమ్స్, డీజీపీ, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, కమర్షియల్ కాంప్లెక్సులు, స్కూళ్లు, కాలేజీలకు అతి సమీపంలో.. మీ జీవనశైలిని ప్రతిబింబించేలా… మీ మనస్సు మెచ్చే రీతిలో.. ఆధునిక సౌకర్యాలతో… నవ నాగరికతకు దర్పం, చూపు తిప్పుకోనివ్వని కలల సౌధంలో జీవించాలని ఉందా? అయితే, మీకు అతికినట్లు సరిపోయే ప్రాజెక్టే.. ద స్కై, హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ.

ఎంటీఎంసీ పరిధిలో..

మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ (MTMC) పేరు చెప్పగానే తక్షణం మనకి గుర్తుకు వచ్చేది.. ఎయిమ్స్. దాదాపు 2000 కోట్లతో.. 200 ఎకరాల విస్తీర్ణంలో.. సగటున 5000ల మందికి పైగా ఉద్యోగులతో.. అన్ని వైద్య విభాగాలకు సంబంధించిన అత్యాధునిక వసతులతో.. రోజుకి పది వేలకు పైగా రోగులకు సేవలందించగల సామర్ధ్యం కలిగింది.. అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్. తాడేపల్లిలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం, ఆయన నివాసం, డీజీపీ మరియు ఇతర విభాగాధిపతుల ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఏపీఎస్పీ బెటాలియన్, ఆక్టోపస్, ఏపీఐఐసీ ఐటీ సెజ్ లు వంటివి ఇక్కడే ఉన్నాయి.

ఎన్ఆర్ఐ, మణిపాల్ లాంటి సూపర్ స్పెషలిటీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, నాగార్జున యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, వాణిజ్య సముదాయాలు, కన్వెన్షన్ సెంటర్లు, మల్టీప్లెక్సులు సమీపంలోనే కొలువుదీరాయి. ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య కార్యాలయాలన్నీ ఇక్కడ నుంచే పనిచేస్తున్నాయి. మంగళగిరి – తాడేపల్లికి మధ్య ఆరు లైన్ల ఎక్సప్రెస్ మరియు నాలుగు లైన్ల సర్వీస్ రోడ్ ఉండటంతో.. హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్ లకు ధీటుగా ఈ గ్రోత్ కారిడార్ అభివృద్ధి చెందడానికి ఆస్కారముంది. ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరంగా అభివర్ణించవచ్చు. ఇలాంటి వాటన్నింటికీ అత్యంత సమీపంలోనే రాజసం ఉట్టిపడేలా దర్శనమిచ్చే హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీయే.. ద స్కై.

THE SKIGH – ప్రాజెక్టు విశిష్టతలెన్నో..

అమరావతిలోనే అతి సుందరంగా ముస్తాబువుతున్న ద స్కై ప్రాజెక్టు ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. బేస్మెంట్+స్టీల్ట్+జి+9 అంతస్తులతో నిర్మితమైన ఈ ప్రాజెక్టులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. 183 దాకా ఉన్నాయి. పది నెలల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును వంద శాతం వాస్తుకు అనుగుణంగా నిర్మించారు. ఇందులో 2 బెడ్రూం ఫ్లాట్లు 20, 3 పడక గదుల ఫ్లాట్లు.. 163 ఉన్నాయి. వీటి విస్తీర్ణం.. 1336 నుంచి 2716 చదరపు అడుగుల్లోపు ఉన్నాయి.

ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టులో పిల్లలు, పెద్దల కోసం విశాలమైన బాడ్మింటన్, బాస్కెట్ బాల్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియాలు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, ఆట స్థలాలు, పార్కులు, ల్యాండ్ స్కేపింగ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, రిసెప్షన్ లౌంజ్, కిట్టీ పార్టీ హాల్, ఫంక్షన్ హాళ్లు, బ్యూటీ పార్లర్, సూపర్ మార్కెట్, ఏసీ జిమ్, స్నూకర్, బిలియర్డ్స్, హోటల్ రూములు వంటివన్నీ పొందుపరిచారు. విశాలమైన పార్కింగుతో ప్రస్తుత జీవన విధానానికి అన్నివిధాలుగా సరిపోయే విధంగా.. అత్యంత సుందరంగా ముస్తాబవుతున్న ప్రాజెక్టే.. ద స్కై. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి ఇంతకుమించిన తరుణం లేదని చెప్పొచ్చు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles