రెరాలో తమ ప్రాజెక్టులను నమోదు చేయడానికి తప్పుడు పత్రాలు సమర్పించిన 27 మంది డెవలపర్లపై కేసు నమోదైంది. మహారాష్ట్ర థానే జిల్లాలో 27 మంది ప్రాపర్టీ డెవలపర్లు తప్పుడు పత్రాలు ఉపయోగించి రెరాలో తమ ప్రాజెక్టులు నమోదు చేశారు. ఇళ్ల నిర్మాణానికి కల్యాన్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అనుమతి ఇచ్చినట్టుగా తప్పుడు వివరాలు నమోదు చేశారని కేడీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుంచి 2022 మధ్య కాలంలో ఈ మేరకు మోసం చేశారని తెలిపింది. అనంతరం ఆయా ఇళ్లను రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు విక్రయించినట్టు వివరించింది. ఇలా 27 గ్రామాలకు చెందినవారిని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు 27 మంది ప్రాపర్టీ డెవపర్లపై చీటింగ్ కేసు నమోదు చేశారు.