బిల్డర్లు వాణిజ్యపరమైన అవసరాల కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్ వెల్స్ పై జరిమానా విధించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. నోయిడాలో ఇలా అక్రమంగా బోర్ వెల్స్ వేసిన బిల్డర్లకు.. ఆ ప్రాజెక్టు వ్యయంలో కనీసం 0.5 శాతాన్ని మధ్యంతర పరిహారంగా విధించాలని సూచించింది. నోయిడాలో దాదాపు 40 మంది బిల్డర్లు అక్రమంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై ఈ మేరకు తీర్పునిచ్చింది.
ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు తనిఖీలు జరిపిన అధికారుల బృందం 33 బిల్డర్లలో 25 మంది ఎలాంటి అనుమతి లేకుండా బోర్ వెల్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించింది. ఈ మేరకు ట్రిబ్యునల్ కు నివేదిక సమర్పించింది.