రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి రూ.50 కోట్ల టీడీఎస్ చెల్లింపులో జాప్యం చేసిన కేసులో హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, దాని డైరెక్టర్లకు మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వడంతోపాటు తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, స్టే ఇవ్వడాన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ముండే వ్యతిరేకించారు. నిందితులను సోమవారం కోర్టు ముందు హాజరుపరచాలని గత విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించిందని పేర్కొన్నారు. కోర్టు ముందు వారు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినట్టు నివేదించారు. దీంతో నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది.