కొత్త సంవత్సరంలో కెనడాలో ఇళ్ల ధరలు తగ్గే అవకాశం ఉందని రీ మ్యాక్స్ నివేదిక అంచనా వేసింది. అక్కడి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్ల ధరలు తగ్గుతాయని పేర్కొంది. గృహాల ధరలు సగటున 3.3 శాతం తగ్గే అవకాశం ఉందని వివరించింది. హౌసింగ్ మందగమన, వడ్డీ రేట్లు పెరగడం వంటి అంశాలు మాంద్యం ప్రమాదానికి ఆజ్యం పోసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేసింది.
గ్రేటర్ టొరంటో, గ్రేటర్ వాంకోవర్ లో అత్యధికంగా దాదాపు 15 శాతం వరకు ఇళ్ల ధరల్లో క్షీణత నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. క్యూబెక్ సీలో 10 శాతం తగ్గుదల నమోదవుతుందని, జీవీఏలో 5 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. మరోవైపు అట్లాంటిక్ కెనడాలో ఇళ్ల ధరలు పెరుగుతాయని.. హాలిఫాక్స్ లో ఇది 8 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. కాల్గరీలో కూడా 2023లో ఇళ్ల ధరలు 7 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు వివరించింది.