భారత రియల్ రంగం గతేడాది మెరుగైన ఫలితాలే సాధించింది. 2022లో ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు 340 కోట్ల డాలర్లకు చేరడమే ఇందుకు నిదర్శనం. ఇందులో కమర్షియల్ ఆఫీస్ విభాగం వాటా 45 శాతం ఉండటం విశేషం. అలాగే రెసిడెన్షియల్, రిటైల్ సెక్టార్లలో సైతం గణనీయమైన వృద్ధి నమోదైందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సావిల్స్ ఇండియా వెల్లడించింది.
ఎప్పటిలాగా కమర్షియల్ ఆఫీస్ విభాగం పెట్టుబడుల్లో పై చేయి సాధించిందని సావిల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ క(కేపిటల్ మార్కెట్స్) దివాకర్ రాణా తెలిపారు. కాగా, 2023లో భారత్ లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు 350 కోట్ల డాలర్ల నుంచి 400 కోట్ల డాలర్ల వరకు రావొచ్చని సావిల్స్ ఇండియా అంచనా వేసింది.