poulomi avante poulomi avante

ఫాక్స్‌కాన్ సంస్థ రాక‌తో ఒరిగేదేంటి?

  • స్థానికులకు ఉపాధి దొరుకుతుంది
  • ఐటీ త‌ర‌హా ఉద్యోగాలుండ‌వు!
  • జీత‌భ‌త్యాలు భారీగా ఉండ‌వు..
  • రాత్రికి రాత్రే అద్భుతాలు జ‌ర‌గ‌వు!
  • కాబ‌ట్టి ఎగిరి గంతేయక్క‌ర్లేదు..
  • శ్ర‌మ‌దోపిడికి పెట్టింది పేరీ సంస్థ‌
  • 2021లో చెన్నైలో కార్మికుల క‌ష్టాలు!
  • ఫాక్స్‌కాన్‌తో ప్ర‌భుత్వం ప్ర‌తీ
    అంశం చ‌ర్చించాలి

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌ : కొంగ‌ర‌క‌లాన్‌లో ఫ్యాక్స్ కాన్ సంస్థ ఏర్పాటు అవుతోంద‌ని.. ల‌క్ష మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని.. ఇంకేముంది రియ‌ల్ రంగానికి ఎక్క‌డ్లేని గిరాకీ పెరుగుతుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి, ఇందులో ఎంత శాతం వాస్త‌వం ఉంది? అస‌లీ సంస్థ ప్ర‌త్యేక‌త‌లేంటి? ఎప్పుడు ఆరంభ‌మైంది? మ‌న దేశంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా తెలంగాణ‌లో అడుగుపెడుతుందా? లేక ఇదివ‌ర‌కే ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసిందా? అయితే, అక్క‌డ వాస్త‌వ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి? ఫాక్స్‌కాన్ సంస్థ రాక‌తో నిజంగానే రియ‌ల్ రంగానికి ఊపొస్తుందా?

తైవాన్‌కు చెందిన న్యూతైపీలో.. 1974లో ఆరంభమైన ఈ కంపెనీలో ప్ర‌స్తుతం 13 ల‌క్ష‌ల మందికి పైగా ప‌ని చేస్తున్నారు. ప్ర‌పంచంలో అతిపెద్ద టెక్నాల‌జీ ఉత్ప‌త్తి సంస్థ‌ల్లో ప్ర‌ముఖంగా నిలుస్తుందీ కంపెనీ. అమెరికా, కెన‌డా, చైనా, జ‌పాన్ వంటి దేశాల‌కు చెందిన ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల్ని ఉత్ప‌త్తి చేస్తుంది. ఐఫోన్‌, ఐపాడ్‌, సోనీ, గూగుల్, షావోమీ, బ్లాక్ బెర్రీ వంటి బ్రాండ్ల ఫోన్ల‌ను ఈ సంస్థే త‌యారు చేస్తుంది. ఫాక్స్‌కాన్‌కు 24 దేశాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాంతాలలో 137 క్యాంపస్‌లు మరియు కార్యాలయాలు ఉన్నాయి. ఫాక్స్‌కాన్ యొక్క మెజారిటీ ప‌రిశ్ర‌మ‌లు తూర్పు ఆసియాలో ఉన్నాయి, మరికొన్ని బ్రెజిల్, యూరప్ మరియు మెక్సికోలో ఉన్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ సంస్థ 2015 నుంచి మ‌న దేశంలోనూ కార్య‌క‌లాపాల్ని నిర్వ‌ర్తిస్తోంది.

సంస్థ ఏర్పాటు చేస్తున్నామ‌నే ప్ర‌క‌ట‌న ఫాక్స్‌కాన్ కొత్త‌గా ఏం చేయ‌లేదు. 2015లోనే ఈ సంస్థ.. భార‌త‌దేశంలో 12 ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దాదాపు ప‌ది ల‌క్ష‌ల మందికి ఉద్యోగ అవ‌కాశాల్ని క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించింది. మ‌న దేశంలో త‌మ కార్య‌క‌లాపాల్ని విస్త‌రించేందుకు అదానీ గ్రూపుతో క‌లిసి చ‌ర్చ‌ల‌నూ జ‌రిపింది. అదే సంవ‌త్స‌రంలో స్నాప్‌డీల్‌లో పెట్టుబ‌డి పెట్టింది. సెప్టెంబర్ 2016లో జియోనీతో క‌లిసి ఉత్ప‌త్తుల త‌యారీని ఆరంభించింది. 2019 ఏప్రిల్ లో.. ఫాక్స్‌కాన్ భారతదేశంలో కొత్త ఐఫోన్‌లను భారీగా ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదించింది. దీని తయారీ దక్షిణ చెన్నైలో జరుగుతుందని ఛైర్మన్ టెర్రీ గౌ అప్ప‌ట్లో చెప్పారు. సెప్టెంబర్ 2022లో, ఫాక్స్‌కాన్ గుజరాత్‌లో వేదాంత గ్రూప్ ద్వారా $21 బిలియన్ల పెట్టుబడితో చిప్ మేకింగ్ ఫెసిలిటీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది.

ఫాక్స్‌కాన్‌పై ఆరోప‌ణ‌లివే!

ఫాక్స్ కాన్ ప‌రిశ్ర‌మ‌లో విస్తృతమైన కార్మికుల దుర్వినియోగం మరియు అక్రమ ఓవర్‌టైమ్‌లతో కూడిన లేబర్ క్యాంపులుగా మారాయ‌ని మెయిన్ ల్యాండ్ చైనాలోని 20 విశ్వ‌విద్యాల‌యాలు సంయుక్తంగా రూపొందించిన నివేదిక‌లో పేర్కొన్నాయి. అక్క‌డి ఫ్యాక్ట‌రీ కార్మికుల‌ను సెక్యూరిటీ గార్డులు కొడుతూ ప‌ట్టుబట్టార‌ని నివేదిక‌లు వెలువ‌డ్డాయి. ప‌నివేళ‌లు స‌రిగ్గా ఉండ‌వ‌నే ఆరోప‌ణ‌లూ ఈ సంస్థ మీద ఉన్నాయి.

2009-10 మ‌ధ్య‌కాలంలో ఫాక్స్‌కాన్ ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేసే కార్మికుల ఆత్మహత్యలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. పత్రికలలో దృష్టిని ఆకర్షించిన మొదటి కేసుల్లో.. సన్ డాన్యోంగ్ అనే 25 ఏళ్ల వ్యక్తి ని సెక్యూరిటీ గార్డులు కొట్ట‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 2010లో ప‌ద్నాలుగు మంది కార్మికులు ఫాక్స్‌కాన్‌లో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నాక ప‌రిస్థితిలో మార్పును తెచ్చే ప్ర‌య‌త్నం చేసింది. జనవరి 2012లో వుహాన్‌లోని పరిస్థితులపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు, ఫ్యాక్టరీ పరిస్థితులు మెరుగుపడకపోతే 150 మంది కార్మికులు సామూహిక ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. 2012 మరియు 2013లో, ముగ్గురు యువ ఫాక్స్‌కాన్ ఉద్యోగులు భవనాలపై నుంచి దూకి మరణించారు.

చెన్నైలో ఏం జ‌రిగిందంటే?

తెలంగాణ కంటే ముందే చెన్నైలో ఫాక్స్‌కాన్ సంస్థ శ్రీ పెరంబుదూర్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేసింది. 2021 డిసెంబ‌రు 15న.. సంస్థ అందించే ఆహారం తిని 256 మంది కార్మికులు డ‌యేరియా బారిన ప‌డ్డారు. అందులో 159 మంది కార్మికులు ఆస్ప‌త్రి పాల‌య్యారు. దీనిపై సంస్థ ఎలాంటి స‌మాచారం వెలువ‌రించ‌లేదు. అయితే ఇద్ద‌రు కార్మికులు మ‌ర‌ణించార‌నే వార్త వాట్స‌ప్పుల్లో చ‌క్క‌ర్లు కొట్టింది. దీంతో, డిసెంబ‌రు 17న వ‌ర్క‌ర్స్ నివ‌సించే డార్మిట‌రీల్లో కార్మికులు కూర్చోనే నిర‌స‌న‌లు జ‌రిపారు. అదే రోజు రాత్రి 10 గంటలకు, ఫ్యాక్టరీకి చెందిన వంద‌లాది మంది మహిళా కార్మికులు చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు. ఫ‌లితంగా 67 మంది మహిళా నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. త‌ర్వాత త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కార్మికుల ప‌రిస్థితిని స‌మీక్షించింది. డిసెంబరు 22న ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డార్మిటరీలోని వంటగదిలో ఎలుకలు మరియు డ్రైనేజీ సరిగా లేకపోవడంతో సీజ్‌ చేసింది. కార్మికులకు అందించిన గదులు కిక్కిరిసిపోయాయి, వారు నేలపై పడుకుంటున్నార‌ని, కొంతమందికి నీటి సరఫరాతో మరుగుదొడ్లు కూడా లేవ‌ని గుర్తించింది. అయితే, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని.. జనవరి 2022లో ఆపిల్, తమిళనాడు ప్రభుత్వానికి హామీ ఇచ్చిన తర్వాత, ఫాక్స్‌కాన్ తన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించింది. ఇప్పుడీ సంస్థ తెలంగాణ రాష్ట్రం అడుగుపెడుతుంది కాబ‌ట్టి.. ప్ర‌తి అంశాన్ని ప‌క్కాగా చ‌ర్చించి.. ఇందులో ప‌ని చేసేవారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్ని తీసుకోవాలి. సంస్థ ప్ర‌తినిధుల‌తో ప‌క్కాగా చర్చించి కార్మికుల ప‌ని వేళ‌లు, నివాస‌యోగ్య‌మైన ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలి.

రాత్రికి రాత్రే అద్భుతం జ‌ర‌గ‌దు

ఫాక్స్‌కాన్ సంస్థ వ‌స్తే.. రాత్రికి రాత్రే కొంగ‌ర‌క‌లాన్‌లో అద్భుతం జ‌రుగుతుంద‌ని.. ఆ కంపెనీ వేలాది మందికి ఉపాధి అవ‌కాశాల్ని అంద‌జేస్తుంద‌ని.. ఫ‌లితంగా రియ‌ల్ రంగానికి ఊపొస్తుంద‌నే ప్ర‌చారాన్ని గుడ్డిగా న‌మ్మ‌కండి. ఫాక్స్‌కాన్ ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల్ని ఉత్ప‌త్తి చేసే కంపెనీ మాత్ర‌మేన‌ని గుర్తుంచుకోండి. ప్ర‌ధానంగా ఫోన్ల‌ను త‌యారు చేసే ప‌రిశ్ర‌మ అని మ‌ర్చిపోవ‌ద్దు. ఈ సంస్థ రావ‌డం వ‌ల్ల స్థానికులు కార్మికులుగా ప‌ని చేయాల్సి ఉంటుంది త‌ప్ప‌.. ఐటీ కంపెనీ త‌ర‌హా ఉద్యోగాలు పెద్ద‌గా ఉండ‌వు. ఇందులో ప‌ని చేసే కార్మికులకు వ‌చ్చే జీత‌భ‌త్యాల వ‌ల్ల అక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ప్లాట్లు తెగ కొనేస్తార‌నే ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు. కాక‌పోతే, ప‌ని లేనివారికి ప‌ని దొరుకుతుంది. ఠంచ‌నుగా జీతం వ‌స్తుంది. ప్లాట్లు కొన‌గ‌లిగే స్థాయికి ఆయా కార్మికుల జీత‌భ‌త్యాలుంటాయా? లేవా? అనే అంశంపై ప్ర‌భుత్వ‌మే స్ప‌ష్ట‌త‌నివ్వాలి.

మొత్తానికి, ఫాక్స్‌కాన్ వ‌ల్ల రియ‌ల్ రంగానికి ఊపొస్తుంద‌నే మాటల్ని గుడ్డిగా న‌మ్మ‌కండి. ఎప్పుడో ప‌దేళ్లకు పెర‌గాల్సిన ప్లాట్ల రేట్ల‌ను నేడే పెంచేసి.. భూములు, ప్లాట్ల‌ను అమ్మే ప్ర‌బుద్ధులున్నారు. వారి మాట‌ల్ని న‌మ్మేసి మీ క‌ష్టార్జితాన్ని వృధా చేసుకోవ‌ద్దు. వాస్త‌వ ప‌రిస్థితుల్ని ప‌క్కాగా బేరీజు వేసుకున్నాకే పెట్టుబ‌డి నిర్ణ‌యం తీసుకుంటే శ్రేయ‌స్క‌రం.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles