111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రిమండలి గురువారం నిర్ణయం తీసుకున్నది. 111 జీవోను ఎత్తివేయాలని 84 గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వారికి సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పలువురు మంత్రులు అంటున్నారు. హెచ్ఎండీఏ భూముల మాదిరిగా ఈ గ్రామాలకు అవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటితో పాటు మూసిని కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 111జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాలకు ఎలాంటి ఆంక్షలు ఇక నుంచి ఉండవని తెలిపారు. 84 గ్రామాల చుట్టూ రింగ్ మైన్ ను నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయించిందని అన్నారు.