మీరు మీ ఇంటి పునర్నిర్మాణం గురించి ఆలోచిస్తున్నారా? అయితే, ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారా? ఏమాత్రం చింతించకండి. మీరు డబ్బు ఖర్చు చేయకుండానే మీ స్థలాన్ని మెరుగుపరుచుకునే కొన్ని ఐడియాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా?
ఇంటి పునరుద్ధరణ రూ.లక్ష లోపు చేయవచ్చు లేదా కొన్ని పునర్నిర్మాణాలు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కంటే ఎక్కువా ఖర్చు చేయవచ్చు. అందుకే గృహ పునరుద్ధరణకు బడ్జెట్ అనేది చాలా కీలకం. మీరు చేయాలనుకుంటున్న ప్రతి పని జాబితాను రూపొందించండి. అందులో అత్యంత అవసరమైన వాటి ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో తుది జాబితా ఖరారు చేయండి. తర్వాత ప్రతి పనికీ ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవడానికి పరిశోధన చేయండి. మీరు కొనుగోలు చేయగలిగినవాటిపై పని చేయండి. బడ్జెట్ ను అధిగమించకుండా అందుబాటులో లేని వాటిని తొలగించండి లేదా వాయిదా వేయండి.
గోడలకు పెయింట్ వేయండి..
మీ ఇంటి గోడలకు పెయింటింగ్ వేయడం అనేది మీ నివాస స్థలాన్ని మెరుగుపరిచే సులభమైన పద్ధతుల్లో ఒకటి. పెయింటింగ్ వేస్తే అది మీ ఇంటికి కొత్త రూపాన్ని, తాజా అనుభూతిని తెస్తుంది. మీ ఫర్నిచర్, పరిసరాలు మరింత ఇనుమడింపజేసే రంగులను ఎంచుకోండి. మీ ఇంట్లో ఉన్న పాత వస్తువును అమ్మి ఆ డబ్బును పెయింటింగ్ కోసం వినియోగించండి.
మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకోండి..
చిన్న బడ్జెట్ లో ఇంటి పునరుద్ధరణను విజయవంతం చేయడానికి కొన్ని ‘డూ యువర్ సెల్ఫ్’ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి. ఇంటి మరమ్మతులు చేయడం, కొత్త లైట్ ఫిట్టింగులను ఇన్ స్టాల్ చేయడం లేదా అల్మారాలు నిర్మించడం ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆన్ లైన్ లో చూడొచ్చు.
లైటింగ్ రిఫ్రెష్ చేయండి..
మీ ఇంట్లో లైటింగ్ అప్ డేట్ చేయడం వల్ల మీ ఇంటి రూపాన్ని, అనుభూతిని మార్చుకోవచ్చు. అది కూడా తక్కువ ఖర్చుతోనే. కొత్త లైటింగ్ జోడించడం లేదా పాతవాటిని భర్తీ చేయడం గురించి ఆలోచించండి. కాస్త డల్ గా ఉన్న ప్రదేశాలను కాంతివంతం చేయడానికి తగిన లైట్లను వినియోగించండి. ట్రాక్ లైట్లు, స్పాట్ లైట్ల ద్వారా కూడా ఇంటిని అందంగా చేసుకోవచ్చు.
చిన్న మార్పులు
చిన్న చిన్న మార్పులు ఎంతటి వ్యత్యాసాలు కలిగిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? విస్తృతమైన మెరుగుదలలకు బదులుగా త్రో కుషన్లు లేదా కొత్త రగ్గును జోడించడం వంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేయండి. ఈ మార్పులు బడ్జెట్ ను విచ్ఛిన్నం చేయకుండా మీ ఇంటిని అందంగా మార్చుకోవచ్చు.
కిచెన్ కేబినెట్లు అప్ గ్రేడ్..
మీరు మీ వంటగదిని మెరుగుపరచాలనుకుంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే మీ కేబినెట్లను మార్చడాన్ని పరిగణించండి. ఓపెన్ షెల్ఫ్ ప్రభావాన్ని సృష్టించడానికి మీరు వాటిని పెయింట్ చేయండి. హార్డ్ వేర్ ను మార్చవచ్చు లేదా తలుపులను తీసేయొచ్చు. ఇది ఖర్చు లేకుండా మీ వంటగదిని మొత్తం మేకోవర్ చేయొచ్చు.
లివింగ్ రూమ్ ఫ్లోరింగ్
మీ గదిలో ఫ్లోరింగ్ అరిగిపోయినట్టుగా లేదా పాతదిగా కనిపిస్తే దాన్ని మార్చడాన్ని పరిగణించండి. లామినేట్, హార్డ్ వుడ్, టైల్స్ తో సహా బడ్జెట్ స్నేహపూర్వక ఇంటి పునర్నిర్మాణాలకు అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.
ఫిక్చర్లను కొంచెం మార్చండి..
బాత్రూమ్, కిచెన్ కేబినెట్ల హార్డ్ వేర్ అప్ డేట్ చేయాలనుకుంటే అందుకు ఇదే సరైన సమయం. పొడవైన డ్రాయర్ పుల్ లు లేదా చినన్ డోర్ నాబ్ ల వంటి విభిన్న డిజైన్లు ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న నాబ్ లు బోరింగ్ గా ఉంటే కొత్త వాటిని ఎంచుకోవచ్చు.
ఇండోర్ మొక్కలు పెంచండి.
మీ ఇంటికి ఇండోర్ మొక్కలు జోడించడం వల్ల ఇంటి రూపాన్ని మార్చడమే కాకుండా గాలి నాణ్యతను కూడా మెరుగుపరవచ్చు. మీకు ఉన్న స్థలంలో లైటింగ్ కు సరిపోయేలా విభిన్నమైన మొక్కలను ఎంచుకోవచ్చు.
స్థలాన్ని విస్తరించడానికి అద్దాలు..
అద్దాలు అనేవి గదిని పెద్దవిగా, మరింత తెరిచి ఉంచేలా చేస్తాయి. అందువల్ల మీ గది లేదా మీ ఇంటి ఇతర ప్రాంతాలకు అద్దాలను జోడించడాన్ని పరిశీలించండి. తద్వారా విస్తృతమైన పునరుద్ధరణలు లేకుండాలనే ఇంటి రూపాన్ని మార్చుకోవచ్చు.
ఫొటో గ్యాలరీ గోడను సృష్టించండి..
మీ ఇంట్లో పిక్చర్ గ్యాలరీ గోడను ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలించండి. మంచి ఫ్రేములు, చిత్రాలను ఎంపిక చేసుకోవడం ద్వారా అందమైన గ్యాలరీ సృష్టించుకోవచ్చు. మొత్తమ్మీద ఇంటి పునరుద్ధరణ అనేది ఖరీదైనది కాదని గుర్తుంచుకోండి. కొంచెం ఊహ, మరికొంచెం సృజనాత్మకత, కొద్దిగా వనరులతో అందమైన, ఆచరణాత్మకమైన ఇంటిని నిర్మించుకోవచ్చు.