అపర్ణా కన్స్ట్రక్షన్స్ 56వ ప్రాజెక్టును కొంపల్లిలో ఆరంభించింది. దీనికి.. అపర్ణా కనోపి ఎల్లో బెల్స్ అని నామకరణం చేసింది. ఈ ప్రాజెక్టును 10.5 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఇందులో పదిహేను అంతస్తుల ఎత్తు గల టవర్లు పది ఉంటాయి. అన్నీ వాస్తుకు అనుగుణంగా నిర్మిస్తారు. ఇందులో వచ్చే ఫ్లాట్ల విస్తీర్ణం.. 1294 నుంచి 1911 చదరపు అడుగుల్లో ఉంటాయి. ఆధునిక సదుపాయాల కోసం 44,500 చదరపు అడుగుల్లో క్లబ్ హౌజ్ ను నిర్మిస్తారు.
ఈ ప్రాజెక్టును 2025 మార్చి లోపు పూర్తి చేస్తారు. సంస్థకు సంబంధించిన విస్తరణ ప్రణాళికల గురించి డైరెక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. 2021 సంవత్సరం తమకు అత్యంత కీలకమైనదని.. సానుకూలమైనదిగా అభివర్ణించారు. సంస్థను ఆరంభించి 25 ఏళ్లు అవుతోందని వెల్లడించారు. అందుకే వచ్చే ఐదేళ్లలో సుమారు ఆరు కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు ప్రాజెక్టుల్ని నిర్మించడానికి ప్రణాళికల్ని రచించామని వెల్లడించారు. రానున్న రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల్లో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.