Categories: Celebrity Homes

బంగ్లాలో స్విమింగ్ పూల్ ఉండాలి – నటి మధురిమ తులి

మధురిమ తులి.. తెలుగు నటి. ఆమె ఇల్లు చూస్తే అచ్చంగా ఆమెకు ప్రతిబింబంగానే ఉంటుంది. తన కలల ఇంటి గురించి ఆమె రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడారు త‌న డ్రీమ్ హోమ్ క‌బుర్ల‌ను రియ‌ల్ ఎస్టేట్ గురుతో ఇలా పంచుకున్నారు.

‘నేను ఇటీవల ఓ ఇల్లు కొన్నాను. నేను ఇంకా ఆ ఇంటికి మారలేదు. అయితే, ఇంటికి సంబంధించి అందరికీ కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి. అలాగే నాకూ ఉన్నాయి. పదండి మిమ్మల్ని నేను పుట్టి పెరిగిన డెహ్రాడూన్ కి తీసుకెళ్తాను. అది ఓ బంగ్లా. సుప్రసిద్ధ ముస్సోరీ పర్వతాలకు ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఎంతో అందంగా నిర్మించారు. అది ఎప్పుడూ మంచుతో కప్పి ఉంటుంది’ అని వివరించారు. ఇక తన ఆదర్శవంతమైన ఇంటి గురించి మరింతగా చెబుతూ.. ‘లావిష్ నెస్ అద్భుతంగా కనిపిస్తుంది. కానీ నా ఇల్లు మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. నిజానికి కొన్ని ఇంటీరియర్ డిజైన్ స్టైల్స్ మా ఇంటిని చాలా పెద్దగా కనిపించేలా చేస్తాయి. బంగ్లాయే నా ప్రాధాన్యత అయినప్పటికీ, నేను మొక్కలు, బోల్డ్ పెయింటింగ్స్, కాన్వాస్ లను ఇష్టపడతాను. విల్లా అనేది బంగ్లాతో సమానం కాదు. మేం నలుగురం మాత్రమే ఉన్నాం కాబట్టి, బంగ్లా చాలా ఎక్కువ అవుతుంది. అయితే, అందులో స్విమింగ్ పూల్ ఉండాల్సిందే’ అని చెప్పారు.

తన ఇంటిని ఆదర్శంతంగా తీర్చిదిద్దేందుకు మధురిమ ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగితే.. ‘నేను డెహ్రాడూన్ లో నా ఇంటిని ఆదర్శవంతంగా తీర్చి దిద్దాలనుకుంటున్నాను. అక్కడ చేసినట్టుగా ముంబైలో చేయలేం. షూటింగ్ లేనప్పుడు నేను ఎక్కువ సమయం జిమ్ లేదా నా తోటలో గడుపుతాను లేదా సంగీతానికి నా స్థలాన్ని అంకితం చేస్తాను.’ అని చెప్పారు. తన కెరీర్ ముంబైలో మొదలైంది కాబట్టి అక్కడే ఉంటానని స్పష్టంచేశారు. అయితే, తన స్వగ్రామంలో వెకేషన్ హోమ్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘ఇంటీరియర్ డిజైనర్లు అద్భుతమైన మార్గదర్శకులు కాబట్టి, వారిని నియమించుకోవడం నాకు మంచిది. రియల్ ఎస్టేట్ గ్రూపులు కూడా చాలా తెలివైనవి. ఓ సెలబ్రిటీని తమ ఇళ్లు చూసేందుకు ఎలా ప్రలోభపెట్టాలో వారికి బాగా తెలుసు. ఈ రోజుల్లో డబ్డు సంపాదించడమే ప్రధాన లక్ష్యం’ అని ముగించారు.

This website uses cookies.